Bug: టెస్లా కారులో బగ్ కనిపెట్టిన చిన్నారి.. స్పందించిన మస్క్

Bug In Tesla Car.. కంప్యూటర్ కోడింగ్ విషయంలో పలు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. దీన్ని బగ్ అంటారు. ఇప్పుడో ప్రముఖ కంపెనీ కారులోనే ఈ బగ్ గుర్తించిందో చిన్నారి. వీడియో చేసి మస్క్ కు వివరించింది...

Bug In Tesla Car.. కంప్యూటర్ కోడింగ్ విషయంలో పలు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. దీన్ని బగ్ అంటారు. ఇప్పుడో ప్రముఖ కంపెనీ కారులోనే ఈ బగ్ గుర్తించిందో చిన్నారి. వీడియో చేసి మస్క్ కు వివరించింది...

సాధారణంగా సాఫ్ట్ వేర్ రంగంలో ఎక్కువగా బగ్ అనే పదాన్ని వింటూ ఉంటాం. సాంకేతికంగా జరుగుతున్న పనిలో సమస్య ఎదురైతే దాన్ని బగ్ అని పిలుస్తుంటారు. బగ్ అనేది కంప్యూటర్ ప్రోగ్రామ్ కోడింగ్ లోపం. కొన్ని సార్లు ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు గుర్తించలేరు. ఆ తర్వాత బయటపడుతుంటాయి. ఈ బగ్ కారణంగా కొన్ని సార్లు యూజర్లు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వీటిని కనిపెట్టి ఉద్యోగాలు పొందిన వాళ్లు, లక్షలు కొల్లగొట్టిన వాళ్లు కూడా ఉన్నారు. తాజాగా ఓ పాప బగ్ కనిపెట్టి.. సమస్యను పరిష్కరించాలంటూ ఏకంగా టెస్లా కార్ల అధినేత, బిలినీయర్ ఎలన్ మస్క్‌కు రిక్వెస్ట్ చేసింది. ఆమె రిక్వెస్టుకు మస్క్ రిప్లై కూడా ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇంతకు ఆ వీడియోలో ఆ పాప ఏమన్నదంటే..

చైనాకు చెందిన పాప ఈ బగ్ కనిపెట్టింది. తన ముద్దు ముద్దు మాటలతో ట్విట్టర్ సీఈవోను ప్రశ్నించింది. ఆ వీడియోలో ‘హలో మిస్టర్ మస్క్. నా పేరు మోలీ..మా దేశం చైనా. నీ కారులో నాకొక సమస్య ఎదురైంది. వాహనంలో ఉన్న స్క్రీన్ పై గీతలు గీశాను. కానీ కొన్ని సార్లు ఈ గీతలు మాయం అవుతున్నాయి. ఇలా ఉంటూ కొన్ని గీతలు గీసి చూపించింది. అంతలో మీరూ చూశారు కదా.. దీన్ని పరిష్కరించగలరా’అంటూ ఏ మాత్రం బెరుకు లేకుండా ఎలన్ మస్క్‌కు క్వశ్చన్ గురి పెట్టింది. ఈ వీడియోపై టెస్లా అధినేత మస్క్ స్పందించారు. కచ్చితంగా సమస్య పరిష్కరిస్తామని తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఆ చిన్న వీడియోలో మోలీ సమస్యను హైలెట్ చేసింది. టెస్లా వాహనంలో స్క్రీన్‌తో సమస్యలను ఎదుర్కొంటున్న చైనాకు చెందిన ఈ పాప..గీతలు గీసి.. ఆ తర్వాత తిరిగి మళ్లీ డ్రా చేస్తుంటే పాత గీతలు మాయం కావడాన్ని స్పష్టంగా వీడియో రూపంలో తెలియజేసింది. ఈ బగ్ కనిపెట్టండి అని కోరింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఇప్పటి వరకు ఎక్స్‌లో మిలియన్ వ్యూస్‌తో పాటు 14వేలకు పైగా లైక్స్ వచ్చాయి. నెటిజన్లు కూడా కామెంట్స్ చేశారు. సమస్యను చాలా బాగా వివరించావని ఓ నెటిజన్ అంటే.. పిల్లలు అనుకుంటాం కానీ.. పెద్దల కన్నా చాలా గౌరవంగా, ఉన్నతంగా మాట్లాడిందని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

Show comments