iDreamPost
android-app
ios-app

చాట్​జీపీటీ ఖేల్ ఖతం! యూజర్ల సంఖ్య భారీగా పడిపోవడానికి కారణం?

  • Author singhj Published - 06:16 PM, Sat - 8 July 23
  • Author singhj Published - 06:16 PM, Sat - 8 July 23
చాట్​జీపీటీ ఖేల్ ఖతం! యూజర్ల సంఖ్య భారీగా పడిపోవడానికి కారణం?

టెక్నాలజీ రోజురోజుకీ మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది. సాంకేతికత విభిన్న రూపాల్లో అందుబాటులోకి వస్తోంది. ఈ టెక్ జమానాలో రోజుకో సాంకేతికత తయారై బయటికొస్తోంది. ఇటీవలి కాలంలో చూసుకుంటే.. ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే వినిపిస్తోంది. ఏఐదే భవిష్యత్తు అని టెక్ నిపుణులు అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇంత చర్చ జరగడానికి చాట్​జీపీటీ ఒక కారణంగా చెప్పొచ్చు. కోడింగ్ దగ్గర నుంచి కవితల వరకు ఏది నేర్చుకోవాలన్నా చాట్​జీపీటీనే మార్గమని చాలా మంది అంటూ వచ్చారు. దీని దగ్గర ప్రతి ప్రశ్నకు జవాబు ఉందని చెబుతూ వచ్చారు. దీంతో ఈ చాట్​బోట్​ను చాలా మంది వాడారు. భవిష్యత్తు ఏఐ టెక్నాలజీదేనని చెప్పడానికి చాట్​జీపీటీ సక్సెస్ కారణమని టెక్ విశ్లేషకులు చెబుతూ వచ్చారు.

వాస్తవంలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. గతేడాది నవంబర్​లో మార్కెట్​లో రిలీజైన దగ్గర నుంచి ఈ చాట్​బోట్​ను ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోందని తెలుస్తోంది. దీనికి వినియోగదారుల్లో కృత్రిమ మేధకు సంబంధించిన టూల్స్, ఇమేజ్ జనరేటర్స్ టూల్స్ వాడాలనే ఆసక్తి తగ్గడమే కారణమని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. సిమిలర్ వెబ్ రిపోర్టు ప్రకారం కూడా చాట్​జీపీటీని ఉపయోగించే సంఖ్య భారీగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. మే, జూన్ నెలల్లో ఏఐ వినియోగదారులు 9.7 శాతం పడిపోయారు. రెగ్యులర్​గా కాకుండా సందర్భాన్ని బట్టి చాట్​జీపీటీని వాడే యూనిక్ విజిటర్స్ కూడా 5.7 శాతం తగ్గారు. యూఎస్​లో అయితే ఈ చాట్​బోట్​ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

అమెరికాలో నెలవారీగా 10.3 శాతం మంది యూజర్లు చాట్​జీపీటీని వాడటమే మానేశారు. అంతేకాదు, వెబ్​సైట్​లో విజిటిర్స్ గడిపిన టైమ్ కూడా 8.5 శాతం తగ్గినట్లు సిమిలర్ వెబ్ రిపోర్ట్ పేర్కొంది. ఈ నివేదికను నిశితంగా పరిశీలిస్తే.. నవంబర్ 2022లో మొదలైనప్పటి నుంచి గ్రోత్ రేట్ తటస్థంగా కొనసాగుతూ వచ్చింది. వెబ్​సైట్​ను విజిట్ చేసే యూజర్ల సంఖ్య ఫిబ్రవరి-మార్చి నెలల్లో 10 బిలియన్ల నుంచి 15 బిలియన్లకు చేరింది. కానీ తర్వాతి రెండు నెలల్లో గ్రోత్ రేట్ తగ్గింది. చాట్​జీపీటీతో పాటు వరల్డ్​లో రెండో అతిపెద్ద ఏఐ ప్లాట్​ఫామ్ అయిన కేరక్టర్​ కూడా ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సిమిలర్ వెబ్ రిపోర్ట్ హైలైట్ చేసింది. ఏఐ టూల్స్​కు యూజర్లు తగ్గడానికి ప్రధాన కారణం వాటిపై నమ్మకం కోల్పోవడమేనని తెలుస్తోంది. చాట్​జీపీటీలో గత కొన్ని నెలలుగా అనేక సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు యూజర్లు కూడా తగ్గుతుండటంతో దీని పనైపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.