Google కి పోటీగా ChatGPT నుంచి సూపర్ ఫీచర్.. ఇక నుంచి అలా కూడా..!

ChatGPT: చాట్ జీపీటీ వలన ఎన్ని లాభాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఇందులో ఒక కొత్త ఫీచర్ రానుంది.

ChatGPT: చాట్ జీపీటీ వలన ఎన్ని లాభాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఇందులో ఒక కొత్త ఫీచర్ రానుంది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఒక రేంజిలో డెవలప్ అయ్యింది. ఇంకా డెవలప్ అవుతుంది కూడా. ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతోంది. చాలా రంగాల్లో ఏఐ దూసుకుపోతుంది. కొన్ని రంగాలలో అయితే AI వినియోగం అనివార్యంగా మారింది. ఎలా అంటే అసలు AI లేకపోతే పనులేమి జరగవు అన్నట్టుగా డెవలప్ అయ్యింది. అయితే ఇంతలా ఏఐ ఫేమస్ అవ్వడానికి కారణం చాట్‌జీపీటీ. ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఓపెన్‌ ఏఐ తీసుకొచ్చిన ఈ చాట్‌జీపీటీ.. సెర్చ్‌ ఇంజన్‌లో సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసింది. అసలు ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా దానికి వెంటనే సమాధానం చెప్పడం ఈ చాట్‌జీపీటీ యొక్క స్పెషాలిటీ.

అయితే ఒక్క ఫీచర్ మాత్రం ఇందులో ఉండదు. అదేంటంటే గూగుల్‌లో ఉన్నట్లు వెబ్‌ లింక్స్‌ చాట్‌ జీపీటీలో ఉండవు. ఇప్పటిదాకా మనం అడిగిన ప్రశ్నకు కేవలం ఒకే సమాధానం ఇస్తుంది. అయితే తాజాగా ఓపెన్‌ ఏఐ సూపర్ డెసిషన్ తీసుకుంది. సేమ్ గూగుల్‌ లాగానే ఇకపై చాట్‌ జీపీటీలో కూడా వెబ్‌ లింక్స్‌ ని సజెక్ట్ చేయనుంది. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా యూజర్లు ఇకపై ఇన్స్టంట్ గా, అంటే చాలా త్వరగా వెబ్‌ లింక్స్‌తో కూడిన రియల్‌టైమ్‌ ఇన్ఫర్మేషన్ చూడవచ్చని ఓపెన్‌ ఏఐ తెలిపింది. ఇంతకు ముందు అయితే కేవలం సెర్చ్‌ ఇంజిన్‌ ద్వారా మాత్రమే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఇకపై ఆ అవసరం ఉండదని తెలిపింది. ఇందుకోసం ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ హోమ్‌ పేజీలో కొత్తగా సెర్చ్‌ ఆప్షన్‌ను తీసుకొస్తుంది. ఇక్కడ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం సర్చ్‌ చేయొచ్చు.

ఈ సరికొత్త ఫీచర్‌ వెబ్‌సైట్‌తో పాటు యాప్‌లో కూడా అందుబాటులోకి రానుంది. కేవలం డేటాబేస్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా రియల్‌ టైమ్‌ ఇన్ఫర్మేషన్ ని కూడా ఇవ్వనుంది. చాట్‌జీపీటీ ప్లస్‌, టీమ్‌ యూజర్లు, సెర్చ్‌ జీపీటీ వెయిట్‌ లిస్ట్‌ యూజర్లకు ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఎంటర్‌ప్రైజెస్‌, ఎడ్యుకేషనల్‌ యూజర్లకు కొన్ని రోజుల్లో ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుంది. అలాగే చాట్‌ జీపీటీని ఫ్రీగా వాడుతున్న వారికి మాత్రం ఈ ఫీచర్‌ రావడానికి కొంత టైమ్ పడుతుందని ఓపెన్‌ ఏఐ తెలిపింది. ఈ కొత్త ఫీచర్ తో చాట్ జీపీటీ గూగుల్ కి కచ్చితంగా పోటీ ఇవ్వడం ఖాయం. ఇదీ సంగతి. ఇక చాట్ జీపీటీలో కొత్తగా వచ్చిన ఈ క్రేజీ ఫీచర్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments