విండోస్ యూజర్లకి హై రిస్క్ వార్నింగ్.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు

Central Govt Issues Warning To Those Laptop, Computer Users: ఈ మధ్య కాలంలో ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు వాడేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఉద్యోగులు, విద్యార్థులతో పాటు సాధారణ ప్రజలు కూడా ల్యాప్ టాప్, కంప్యూటర్స్ ని వినోదం కోసం వాడుతున్నారు. అయితే ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు వాడేవారిని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. వెంటనే తాము చెప్పిన పని చేయాలని సూచించింది.    

Central Govt Issues Warning To Those Laptop, Computer Users: ఈ మధ్య కాలంలో ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు వాడేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఉద్యోగులు, విద్యార్థులతో పాటు సాధారణ ప్రజలు కూడా ల్యాప్ టాప్, కంప్యూటర్స్ ని వినోదం కోసం వాడుతున్నారు. అయితే ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు వాడేవారిని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. వెంటనే తాము చెప్పిన పని చేయాలని సూచించింది.    

చాలా మంది ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు వాడుతున్నారు. వీటిలో విండోస్, మ్యాక్, లైనక్స్, ఉబుంటు ఇలా పలు రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అయితే ఎక్కువ మంది యూజర్లు మైక్రోసాఫ్ట్ కి చెందిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తో వచ్చే కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లనే వాడతారు. అయితే ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది. విండోస్ 11, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్స్ లో రెండు భద్రతా లోపాలను గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. భద్రతా లోపాల విషయమై విండోస్ యూజర్స్ ని కేంద్రం హెచ్చరించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పని చేసే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్ ఇన్) యూజర్స్ ని హెచ్చరించింది.

విండోస్ 11, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్స్ లో తలెత్తిన భద్రతా లోపాలను వాడుకుని టార్గెట్ సిస్టంపై దాడి చేసే ఆస్కారం ఉందని సెర్ట్ ఇన్ హెచ్చరించింది. వర్చువలైజేషన్ బేస్డ్ సెక్యూరిటీ, విండోస్ బ్యాకప్ కి సపోర్ట్ చేసే విండోస్ బేస్డ్ సిస్టమ్స్ లో లోపాలు ఉన్నట్లు ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ గుర్తించింది. ఈ లోపాల ద్వారా హ్యాకర్లు గతంలో తొలగించిన డేటాను తిరిగి ప్రవేశపెట్టడం లేదా వీబీఎస్ సెక్యూరిటీని ఛేదించడం వంటివి చేస్తారని తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి మైక్రోసాఫ్ట్ అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకుందని సెర్ట్ ఇన్ తెలిపింది. తాజా సెక్యూరిటీ ప్యాచ్ లో భద్రతా లోపాలను ఎదుర్కునే సొల్యూషన్ ఉందని.. కాబట్టి విండోస్ యూజర్లు వెంటనే మైక్రోసాఫ్ట్ లేటెస్ట్ అప్డేట్ ని డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ప్రభావితమయ్యే విండోస్ సిస్టమ్స్ వెర్షన్ల జాబితాను విడుదల చేసింది. 

ప్రభావితమయ్యే విండోస్ సిస్టమ్స్ వెర్షన్స్ ఇవే:

  • విండోస్ సర్వర్ 2016 (సర్వర్ కోర్ ఇన్స్టాలేషన్)
  • విండోస్ సర్వర్ 2016
  • విండోస్ 10 వెర్షన్ 1607 ఫర్ ఎక్స్ 64 బేస్డ్ సిస్టమ్స్
  • విండోస్ 10 వెర్షన్ 1607 ఫర్ ఎక్స్ 32 బిట్ సిస్టమ్స్
  • విండోస్ 10 ఫర్ ఎక్స్ 64 బేస్డ్ సిస్టమ్స్ 
  • విండోస్ 10 ఫర్ ఎక్స్ 32 బిట్ సిస్టమ్స్ 
  • విండోస్ 10 వెర్షన్ 1809 ఫర్ ఏఆర్ఎం 64 బేస్డ్ సిస్టమ్స్ 
  • విండోస్ 10 వెర్షన్ 1809 ఫర్ ఎక్స్ 64 బేస్డ్ సిస్టమ్స్ 
  • విండోస్ 10 వెర్షన్ 1809 ఫర్ 32 బిట్ సిస్టమ్స్ 
  • విండోస్ 10 వెర్షన్ 22హెచ్2 ఫర్ 32 బిట్ సిస్టమ్స్ 
  • విండోస్ 10 వెర్షన్ 22హెచ్2 ఫర్ ఏఆర్ఎం 64 బేస్డ్ సిస్టమ్స్ 
  • విండోస్ 10 వెర్షన్ 22హెచ్2 ఫర్ ఎక్స్ 64 బేస్డ్ సిస్టమ్స్ 
  • విండోస్ 10 వెర్షన్ 21హెచ్2 ఫర్ ఎక్స్ 64 బేస్డ్ సిస్టమ్స్ 
  • విండోస్ 10 వెర్షన్ 21హెచ్2 ఫర్ ఏఆర్ఎం 64 బేస్డ్ సిస్టమ్స్ 
  • విండోస్ 10 వెర్షన్ 21హెచ్2 ఫర్ 32 బిట్ సిస్టమ్స్ 
  • విండోస్ 11 వెర్షన్ 24 హెచ్2 ఫర్ ఎక్స్ 64 బేస్డ్ సిస్టమ్స్
  • విండోస్ 11 వెర్షన్ 24హెచ్2 ఫర్ ఏఆర్ఎం 64 బేస్డ్ సిస్టమ్స్ 
  • విండోస్ 11 వెర్షన్ 23హెచ్2 ఫర్ ఎక్స్ 64 బేస్డ్ సిస్టమ్స్  
  • విండోస్ 11 వెర్షన్ 23హెచ్2 ఫర్ ఏఆర్ఎం 64 బేస్డ్ సిస్టమ్స్ 
  • విండోస్ 11 వెర్షన్ 22హెచ్2 ఫర్ ఎక్స్ 64 బేస్డ్ సిస్టమ్స్ 
  • విండోస్ 11 వెర్షన్ 22హెచ్2 ఫర్ ఏఆర్ఎం 64 బేస్డ్ సిస్టమ్స్ 
  • విండోస్ 11 వెర్షన్ 21హెచ్2 ఫర్ ఏఆర్ఎం 64 బేస్డ్ సిస్టమ్స్ 
  • విండోస్ 11 వెర్షన్ 21హెచ్2 ఫర్ ఎక్స్ 64 బేస్డ్ సిస్టమ్స్ 
  • విండోస్ సర్వర్ 2019 (సర్వర్ కోర్ ఇన్స్టాలేషన్)
  • విండోస్ సర్వర్ 2019
  • విండోస్ సర్వర్ 2022
  • విండోస్ సర్వర్ 2022 (సర్వర్ కోర్ ఇన్స్టాలేషన్)
  • విండోస్ సర్వర్ 2022, 23హెచ్2 ఎడిషన్ (సర్వర్ కోర్ ఇన్స్టాలేషన్)
Show comments