iDreamPost
android-app
ios-app

iPhone వాడుతున్నారా? మీకో గుడ్ న్యూస్.. ఆ సర్వీసెస్ పూర్తిగా ఉచితం!

  • Published Nov 04, 2024 | 5:34 PM Updated Updated Nov 04, 2024 | 5:34 PM

iPhone: యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ మోడల్ వాడే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్ 14 ప్లస్ కెమెరా ప్రాబ్లమ్స్ పై ఉచితంగా సర్వీసెస్ అందిస్తుంది.

iPhone: యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ మోడల్ వాడే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్ 14 ప్లస్ కెమెరా ప్రాబ్లమ్స్ పై ఉచితంగా సర్వీసెస్ అందిస్తుంది.

iPhone వాడుతున్నారా? మీకో గుడ్ న్యూస్.. ఆ సర్వీసెస్ పూర్తిగా ఉచితం!

యాపిల్ తన పాపులర్ మోడల్స్​లో ఒకటైన ‘ఐఫోన్ 14 ప్లస్’ పై సూపర్ బెనిఫిట్ అందిస్తుంది. ఈ ఫోన్​ బ్యాక్​ కెమెరా సరిగ్గా లేకుంటే దాన్ని ఫ్రీగా రిపేర్ చేస్తామని యాపిల్ ప్రకటించింది. ఇందుకోసం ఒక సర్వీస్​ ప్రోగ్రామ్​ను స్టార్ట్ చేసినట్లు తెలిపింది. ఈ ప్రోగ్రామ్ లో బ్యాక్ కెమెరా సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్న యూజర్ల ఐఫోన్​ను ఎలాంటి కాంప్లిమెంటరీ ఛార్జీలు తీసుకోకుండానే రిపేర్ చేస్తారు. ఇంకా అంతేకాక ఈ ప్రోగ్రామ్ కి ముందే రిపేర్లు చేయించుకున్నవారికి రిపేర్​కు అయిన డబ్బులను కూడా రిఫండ్ చేస్తామని యాపిల్ తెలిపింది.

ఏప్రిల్ 2023 నుంచి ఏప్రిల్ 2024 మధ్య తయారైన ఐఫోన్ 14 ప్లస్ మొబైల్స్​లో ఈ బ్యాక్ కెమెరా ప్రాబ్లం వస్తుంది. ఈ మోడల్స్​లో బ్యాక్ కెమెరాను యాపిల్ సరిగ్గా ప్రివ్యూ చేయలేదట. అందుకే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న యూజర్లకు ఫ్రీగా సర్వీస్ అందిస్తుంది. యాపిల్ రిటైల్ స్టోర్, సర్వీస్ ప్రొవైడర్‌లు లేదా మెయిల్-ఇన్ సర్వీస్ ఆప్షన్ ద్వారా ఫ్రీగా రిపేర్‌ను పొందొచ్చని యాపిల్ తెలిపింది.12 నెలల పాటు అంటే సరిగ్గా సంవత్సరం పాటు ఈ కాంప్లిమెంటరీ రిపేర్లను పొందవచ్చట. ఇక ‘ఐఫోన్ 14 ప్లస్’ మోడల్‌లోని ఫోన్లలో మాత్రమే ఈ బ్యాక్ కెమెరా ప్రాబ్లెమ్స్ ఉన్నాయని, కేవలం వారికి మాత్రమే ఈ సర్వీసులు అప్లై అవుతాయని యాపిల్ కంపెనీ తెలిపింది. అలాగే యూజర్లు తమ మొబైల్​కు ఈ ఫ్రీ సర్వీస్​ అప్లై అవుతుందో లేదో చెక్​ చేసుకోవాలని కూడా సూచించింది. ఐఫోన్ 14 ప్లస్ కొన్న తేదీ నుంచి 3 ఏళ్ల పాటు మాత్రమే రిపేరింగ్ కవరేజ్ అనేది ఉంటుందని యాపిల్ తెలిపింది. ఈ ప్రోగ్రామ్ కేవలం ‘ఐఫోన్ 14 ప్లస్’ బ్యాక్​ కెమెరా ప్రాబ్లంస్ మాత్రమే కవర్ చేస్తుంది. ఈ సర్వీస్ ప్రోగ్రామ్ లో వేరే మోడల్ ఐఫోన్స్​ ఏవీ కూడా కవర్ అవ్వవు.

ఇక మీరు ఐఫోన్ 14 ప్లస్ యూజర్ అయితే.. ఫస్ట్ యాపిల్ సర్వీస్ ప్రోగ్రామ్ వెబ్​పేజీలో మీ సీరియల్ నంబర్​ను రిజిస్టర్ చేసుకుని మీ మొబైల్​కు సర్వీస్ ఉందో లేదో చెక్​ చేసుకోవాలి. మీ మొబైల్ లో సీరియల్ నంబర్‌ను గుర్తించేందుకు సెట్టింగ్స్​ ఓపెన్ చేయండి. అందులో General ఆప్షన్ ఓపెన్ చేసి About పై ట్యాప్ చేయండి. ఇక స్క్రీన్​లోని సీరియల్ నంబర్​పై లాంగ్​ ప్రెస్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల కాపీ షార్ట్​కట్​ డిస్​ప్లే అవుతుంది. ఇక సర్వీస్​ ప్రోగ్రాం కోసం యాపిల్.. ​ సపోర్ట్ పేజీలోని ఫీల్డ్​లో టెక్స్ట్​ పేస్ట్ చేసేందుకు మీకు పర్మిషన్ ఇస్తుంది. దాంతో మీరు ఈ సర్విస్ కి ఎలిజిబుల్ అవుతారు. ఇదీ సంగతి.. మీరు ఐఫోన్ 14 ప్లస్ యూజర్ అయ్యి మీరు కెమెరా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వెంటనే ఈ సర్వీస్ ని ఉపయోగించుకోండి. మీ కెమెరా ప్రాబ్లెంస్ ని ఫ్రీగా సాల్వ్ చేసుకోండి. ఇదీ సంగతి. ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి.