Arjun Suravaram
BSNL 4G: దేశీయ పెద్ద టెలికాం ఆపరేటర్ సంస్థలైన జియో, ఎయిర్ టెల్, వొడఫోన్ఐడియాలు వరుసగా తమ రీఛార్జ్ ప్లాన్ రేట్లను పెంచి మొబైల్ వినియోగదారులపై పెను భారాన్ని మోపాయి. ఇలాంటి సమయంలో బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్ వేసింది.
BSNL 4G: దేశీయ పెద్ద టెలికాం ఆపరేటర్ సంస్థలైన జియో, ఎయిర్ టెల్, వొడఫోన్ఐడియాలు వరుసగా తమ రీఛార్జ్ ప్లాన్ రేట్లను పెంచి మొబైల్ వినియోగదారులపై పెను భారాన్ని మోపాయి. ఇలాంటి సమయంలో బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్ వేసింది.
Arjun Suravaram
ఇటీవల దేశీయ టెలికాంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా టెలికాం సంస్థలు రీఛార్జీ ధరలు పెంచి..వినియోగదారులకు గట్టి షాకిచ్చాయి. తొలుత జియో ఈ ఛార్జీలను పెంచడం ప్రారంభిస్తే.. అదే బాటలో ఎయిర్ టెల్, వొడాపోన్ ఐడియా సంస్థలు కూడా వెళ్లాయి. దీంతో వినియోగదారులు ఈ సంస్థలపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వ రంగానికి చెందిన టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మిగిలిన వాటితో పోలిస్తే..ఆకట్టుకునే ధరలో రీఛార్జ్ ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ అందిస్తుంది. లక్షలాదిమంది బీఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయ్యేందుకు క్యూ కడుతున్నారు. దీంతో బీఎస్ఎన్ఎల్ యుద్ధం ప్రారంభించిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
దేశీయ పెద్ద టెలికాం ఆపరేటర్ సంస్థలైన జియో, ఎయిర్ టెల్, వొడఫోన్ఐడియాలు వరుసగా తమ రీఛార్జ్ ప్లాన్ రేట్లను పెంచి మొబైల్ వినియోగదారులపై పెను భారాన్ని మోపాయి. గతంలో ఉన్న ధరల కంటే భారీగా టారిఫ్ లను పెంచేశాయి. ఇలా తొలుత జియో స్టార్ చేసి..మిగిలిన సంస్థలు కూడా అదే బాటలో పయనం కావడంతో మొబైల్ వినియోగదారులు అసంతృప్తితో ఉన్నారు. ఇదే అనూహ్యంగా బీఎస్ఎన్ఎల్ కి కలిస్తోంది. బీఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయ్యేందుకు క్యూ కడుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.
4జీతో తమ సేవలను అందిచనుంది. ఈ నేపథ్యంలోనే వినియోగాదారులు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఇక కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య బీఎస్ఎన్ఎల్ పై కీలక విషయాలను ప్రస్తావించారు. బీఎస్ఎన్ఎల్ 4జీ టెక్నాలజీని గర్వంగా చూడాలని ఆయన అన్నారు. అయితే ఆసంస్థ 4జీ సర్వీసును ఎప్పుడు అందుబాటులోకి తీసుకురానుందనే అంశంపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. సాధ్యమైనంత త్వరలో 4జీ, 5జీ సేవలను ప్రారంభిస్తాయని ఆయన హామీ ఇచ్చారు.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది కస్టమర్లకు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టాటా గ్రూప్ కి చెందిన సంస్థలు, ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ కు సహకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తేజస్, బీఎస్ఎన్ఎల్, టీసీఎస్, సీడీఓటీ కంపెనీలు అన్నీ కలిసి పని చేస్తున్నాయని మంత్రి సింధియా పేర్కొన్నారు. భారత్‌లో సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. గతేడాది దేశీయ టెలికాం పరికరాల ఎగుమతులు రూ.20 వేల కోట్లకు చేరువయ్యాయని పేర్కొన్నారు. 5Gలో వేగవంతమైన వృద్ధిని చూస్తున్న భారత్.. 6జీ టెక్నాలజీ అభివృద్ధికి కృషి చేస్తోందని సింధియా చెప్పారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో జియోను బహిష్కరించాలనే ట్రెండ్ తో పాటు కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ కు వెళ్లాలనే పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం బీఎస్ఎన్ఎల్ కి కస్టమర్లు చాలా ఎక్కువగా ఉండేవారు. జియో రాకతో చాలా వరకు పడిపోయింది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో తిరిగి అనేకమంది వినియోగాదారులు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ ఇప్పటికే.. టాటాలకు చెందిన టీసీఎస్ తో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో టాటాలు 4జీ సాంకేతిక అభివృద్ధితో పాటు దేశంలో డేటా కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. టాటాల సహకారంతో బీఎస్ఎన్ ఎల్ దేశవ్యాప్తంగా 9వేల కంటే ఎక్కువ 4జీ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తోంది. ఇప్పటికే ఫైలెట్ ప్రాజెక్ట్ ప్రాతిపాదికన పనులు ప్రారంభించింది. మొత్తంగా ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ తీసుకుంటున్న చర్యలతో మిగిలి టెలికాం సంస్థలో అయోమయంలో పడ్డాయనే టాక్ వినిపిస్తోంది.