Tirupathi Rao
River Indie EV Bookings Open: విద్యుత్ స్కూటర్లలో బెంగళూరుకు చెందిన రివర్ ఇండీ పేరు మారుమోగుతోంది. ఆ బండి అంత స్పెషల్ ఎందుకో చూద్దాం.
River Indie EV Bookings Open: విద్యుత్ స్కూటర్లలో బెంగళూరుకు చెందిన రివర్ ఇండీ పేరు మారుమోగుతోంది. ఆ బండి అంత స్పెషల్ ఎందుకో చూద్దాం.
Tirupathi Rao
ప్రస్తుతం అందరూ టూవీలర్ అనగానే ఎలక్ట్రిక్ వాహనం కొనాలి అనుకుంటున్నారు. అయితే ఈ విద్యుత్ వాహనాలను కొనాలి అనుకోవడానికి చాలానే కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది పెట్రోలు ఖర్చులు తగ్గుతాయని, అలాగే పర్యావరణానికి తమ వంతుగా ఏదో మేలు చేసే వాళ్లం అవుతామని ఈవీల వైపు మొగ్గు చూయిస్తున్నారు. ఈ ఈవీ మార్కెట్ లో ఇప్పుడు చెప్పుకోబోయే రివర్ ఇండీ స్కూటర్ కు ఎంతో క్రేజ్ ఉంది. మరి.. అంత క్రేజ్ ఎందుకు వచ్చింది? అందుకు గల కారణాలు ఏంటి? ఆ రివర్ ఇండీ ఈవీ ఫీచర్స్- స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం.
రివర్ ఇండీ అనేది బెంగళూరుకు చెందిన సంస్థ. వీళ్లు ఇక్కడే ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఒకసారి ఈ కంపెనీకి చెందిన స్కూటర్లు మార్కెట్ లోకి వచ్చాయి. అవి హాటు కేకుల్లో అమ్ముడయ్యాయి. మరోసారి ఈ రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించి కంపెనీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసింది. రూ.2,500 చెల్లించి మీరు ఈ ఈవీని బుక్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ రివర్ ఇండీ ఈవీలకు ఎందుకంత క్రేజ్ అనే అనుమానం అందరిలో మొదలైంది. అసలు ఆ స్కూటర్ లో ఉన్న స్పెషల్ ఏంటో చూద్దాం. 2023లో ఈ రివర్ ఇండీ స్కూటర్లు మొదట సేల్ కి వచ్చాయి. తొలి సేల్ లో ఈ స్టార్టప్ కంపెనీ దాదాపు 200 యూనిట్స్ ని అమ్మకం చేసింది. వీటికి వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.
ఇంకేముంది మరోసారి కంపెనీ తయారీని ప్రారంభించింది. అలాగే మళ్లీ బుకింగ్స్ ని ఓపెన్ చేసింది. ఈ రివర్ ఇండీ ఈవీల్లో చాలానే ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఈ స్కూటర్ డిజైన్ గురించి. ఎందుకంటే దీని లుక్స్ ఎంతో ప్రీమియంగా, స్టైలిష్ గా ఉంటాయి. ఈ బండికి అంత క్రేజ్ రావడానికి సగం కారణం లుక్స్ అనే చెప్పాలి. అలాగే ఈ బండిలో ఉండే టోరేజ్ కూడా దీనిని మరింత స్పెషల్ గా మార్చేస్తోంది. సీటు కింద 43 లీటర్ల బూట్ స్పేస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్ 12 లీటర్స్ గ్లౌవ్ బాక్స్ లభిస్తోంది. ఈ స్టోరేజ్ ఈ బండిని మరింత స్పెషల్ గా మార్చేస్తోంది.
అలాగే ఈ బండి స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఈ బండి 6.7 కిలో వాట్స్ మోటర్ సామర్థ్యంతో వస్తోంది. ఇది గంటకు అత్యధికంగా 90 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అలాగే ఫుల్ ఛార్జ్ చేస్తే 120 కిలో మీటర్ల రేంజ్ ను అందిస్తుంది. ఇది కేవలం 3.9 సెక్లలోనే 0 నుంచి 40 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇంక ఈ స్కూటర్ ధర విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇది రూ.1.38 లక్షలకు అందుబాటులో ఉంది. ఈ మోడల్ ని పరిచయం చేసిన తర్వాత దీని ధర రూ.13 వేలు పెరిగింది. ఈ బండి ఏథర్ 450ఎస్, టీవీస్ క్యూబ్ మోడల్స్ కు గట్టి పోటీని ఇస్తోంది. అలాగే బెంఘళూరులో ఈ రివర్ ఇండీకి క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే కంపెనీ ప్రొడక్షన్ కెపాసిటీని పెంచి.. దేశవ్యాప్తంగా అమ్మకాలు ప్రారంభిస్తే ఈ బండికి ఆదరణ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. మరి.. రివర్ ఇండీ లుక్స్, ఫీచర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.