iDreamPost
android-app
ios-app

BMW నుంచి సరికొత్త బైక్.. ఫీచర్లు చూస్తే మామూలుగా లేవు.. కానీ ధరకే మైండ్ పోతుంది..

  • Published Jun 14, 2024 | 1:38 PM Updated Updated Jun 14, 2024 | 5:25 PM

బీఎండబ్ల్యూ కార్లతో పాటుగా బైక్‌లు అన్నా కొందరికి చాలా ఇష్టం. ఇక తాజాగా ఈ కంపెనీ నుంచి కొత్త బైక్‌ లాంచ్‌ అయ్యింది. ఫీచర్లు అద్భుతంగా ఉండగా.. ధర మాత్రం చుక్కలను తాకుతుంది. ఆ వివరాలు..

బీఎండబ్ల్యూ కార్లతో పాటుగా బైక్‌లు అన్నా కొందరికి చాలా ఇష్టం. ఇక తాజాగా ఈ కంపెనీ నుంచి కొత్త బైక్‌ లాంచ్‌ అయ్యింది. ఫీచర్లు అద్భుతంగా ఉండగా.. ధర మాత్రం చుక్కలను తాకుతుంది. ఆ వివరాలు..

  • Published Jun 14, 2024 | 1:38 PMUpdated Jun 14, 2024 | 5:25 PM
BMW నుంచి సరికొత్త బైక్.. ఫీచర్లు చూస్తే మామూలుగా లేవు.. కానీ ధరకే మైండ్ పోతుంది..

బైక్స్ అంటే ఇష్టం ఉండనివాడు దాదాపుగా ఉండడు. అదే స్పోర్ట్స్ బైక్ అంటే ఏదో తెలియని ఫాంటసీ ఉంటుంది. అలాంటి బైక్ మీద ఒక్క లాంగ్ రైడ్ అయినా వెళ్ళాలి అని అనుకోని అబ్బాయిలు ఉండరు. BMW కార్లు అన్నా కుడా జనాలకి పిచ్చ క్రేజ్ ఉంటుంది, అలాంటి BMW బైక్ అంటే ఇంకా ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆ బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియా నుంచి కొత్త బైక్ వచ్చేసింది. బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ దీని పేరు, కానీ రేటు మాత్రం సామాన్యుడికి దూరంగా సంపన్నుడికి దగ్గరగా ఉంది. ఎంతో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. జస్ట్ రూ. 20.95 లక్షల (ఎక్స్-షోరూమ్) మాత్రమే. అదే ధరకు లాంచ్ కూడా చేసారు. బీఎండబ్ల్యూ లేటెస్ట్ ఏడీవీ ఫుల్‌గా బిల్ట్-అప్ యూనిట్ (CBU)గా ఈ బైక్ భారత మార్కెట్లోకి వచ్చింది. రావడం తోనే జనాల మనసులు దోచేసింది.

ఈ బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ డెలివరీలు ఈ నెల చివరి నుంచి మొదలవుతాయి. ధర పరంగా ఆర్ 1250 జీఎస్‌తో పోలిస్తే.. కొత్త 1300 జీఎస్ రేటు 40 వేలు పెరిగింది. బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ కు ఇంకా చాలా ఆప్షనల్ ఎక్స్‌ట్రాలను, ప్యాకేజీలను కూడా అందించింది. బీఎండబ్ల్యూ మోటర్రాడ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు.

Brand new bike from BMW

బీఎండబ్ల్యూ R 1300 జీఎస్ బైక్ ఏకంగా 1,300సీసీ, ట్విన్-సిలిండర్ తో ఉన్న ఇంజిన్ మోటారుతో రన్ అవుతుంది. లాస్ట్ జనరేషన్ జీఎస్ ఏడీవీ కన్నా ఎక్కువ పవర్ఫుల్ గా దీని పికప్ ఉంటుంది. పీక్ పవర్ అవుట్‌పుట్ ఫిగర్ మాత్రం 143bhp దగ్గర ఉంటుంది, గరిష్ట టార్క్ 149Nm రిలీజ్ చేస్తుంది. ఈ బాక్సర్-శైలి ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇంజిన్ కూడా కింద ఉంది. ఇంకా, ఆర్ 1300 జీఎస్ కూడా ఆర్ 1250 జీఎస్ కన్నా 12కిలోలు బరువు తక్కువాగా ఉంటుంది. వెయిట్ తగ్గడం వలన బాడీ సైజు కూడా తగ్గి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా తగ్గింది, ఈ వెర్షన్ 19-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్‌తో వస్తుంది. దీని ముందు వెర్షన్ లో ఒక లీటర్ ఎక్కువ వస్తుంది.

భారత్‌లో అమ్మే వేరియంట్‌ను బీఎండబ్ల్యూ R 1300 జీఎస్ ప్రో అని పిలుస్తున్నారు. అలాగే ఈ బైక్ స్టైలింగ్ మొత్తం 3 ఆప్షన్లతో వస్తుంది. వీటిని వ్యక్తిగతంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులో ట్రిపుల్ బ్లాక్, స్టైల్ జీఎస్ ట్రోఫీ, 719 ట్రముంటానా అనే వేరియంట్స్ ఉన్నాయి. ట్రిపుల్ బ్లాక్ అనేది ఆప్షనల్ అడాప్టివ్ రైడ్ హైట్ ఫీచర్‌తో ఏకైక మోడల్, టాప్-ఎండ్ మాత్రమే యాక్టివ్ క్రూస్ కంట్రోల్, ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్ అలాగే బాడీ రాడార్ బేస్డ్ సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తుంది.