Vinay Kola
Smartphones: కేవలం 10 వేల ధర లోపు మంచి స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Smartphones: కేవలం 10 వేల ధర లోపు మంచి స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Vinay Kola
ఎక్కువ ఖర్చు పెట్టి స్మార్ట్ ఫోన్ కొనడం ఎందుకని చాలా మంది అనుకుంటారు. అలా అని తక్కువ బడ్జెట్లో ఫోన్ కొంటే అవి సరిగ్గా పని చేయవేమో అని భయపడుతుంటారు. అయితే అలాంటి వారి కోసం కేవలం 10 వేల ధర లోపు మంచి స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో ఉన్నాయి. ఇక అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ ఎం14 4జి ఫోన్ 10 వేల బడ్జెట్లో దొరికే మంచి ఫోన్. ఇది 6.70 ఇంచెస్ టచ్ స్క్రీన్ తో వస్తుంది. ఈ ఫోన్ 4 జీబీ,6 జీబీ ర్యామ్ లతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ద్వారా పని చేస్తుంది. దీని బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే.. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇక దీనిలో ఆకట్టుకునే అంశం ఏంటంటే దీని కెమెరా .. ఇది 50+2+2 ట్రిపుల్ బ్యాక్ కెమెరాతో వస్తుంది. ఇక దీని ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే.. ఫ్రంట్ 13 మెగా పిక్సల్ కెమెరా ఉంటుంది. దీని ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వస్తే.. ఇందులో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. రూ. 8,337 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 10 వేలల్లో మంచి బడ్జెట్ ఫోన్.
ఇన్ఫినిక్స్ తన తాజా స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ హాట్ 50 ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 48MP (Sony IMX582) బ్యాక్ కెమెరా ఇంకా డెప్త్ సెన్సార్ ఉంటాయి. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా వుంది. 6.7 ఇంచెస్ HD+ స్క్రీన్ తో ఈ ఫోన్ వస్తుంది. ఇది 8GB ఫిజికల్ ర్యామ్ + 8GB ఎక్స్టెండెడ్ ర్యామ్ కలిగి ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 14 OS పై XOS 14.5 సాఫ్ట్ వేర్ తో పని చేస్తుంది. 5000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ లాంచ్ ఐయింది. దీని స్టార్టింగ్ వేరియంట్ (4GB + 128GB) ను కేవలం రూ. 9,999 ధరతో లాంచ్ చేసింది కంపెనీ. హై ఎండ్ వేరియంట్ (8GB + 128GB) ను రూ. 10,999 ధరతో లాంచ్ చేసింది. సెప్టెంబర్ 9న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ సేల్ స్టార్ట్ అవుతుంది. 10 వేలకే బెస్ట్ 5జి ఫోన్ కావాలనుకునేవారికి ఇంత కంటే సూపర్ ఆప్షన్ ఉండదు.
ఇక ఇన్ఫినిక్స్ 40ఐ మొబైల్ 6. 56 ఇంచెస్ తో వచ్చే బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఇది 4జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ద్వారా పని చేస్తుంది. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంది. దీని కెమెరా విషయానికి వస్తే.. ఇది 50 మెగా పిక్సల్ బ్యాక్ కెమెరా కలిగి ఉంటుంది. 32 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. దీనిలో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజి ఉంటుంది. ఇక దీని ధర విషయానికి వస్తే.. రూ. 8,679 నుంచి స్టార్ట్ అవుతుంది. 10 వేలలో మంచి ఫోన్ కోరుకునేవారికి ఇది కూడా మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు. మరి ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.