iDreamPost
android-app
ios-app

Scam Alert: ఇలాంటి ఈమెయిల్ వస్తే జాగ్రత్త.. నమ్మితే ఘోరంగా లాస్ అవుతారు?

  • Published Oct 11, 2024 | 12:18 PM Updated Updated Oct 11, 2024 | 12:18 PM

Scam: ఆన్ లైన్ మోసాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. గుర్తించలేని విధంగా పెరిగిపోతున్నాయి.

Scam: ఆన్ లైన్ మోసాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. గుర్తించలేని విధంగా పెరిగిపోతున్నాయి.

Scam Alert: ఇలాంటి ఈమెయిల్ వస్తే జాగ్రత్త.. నమ్మితే ఘోరంగా లాస్ అవుతారు?

ప్రస్తుతం ఆన్ లైన్ మోసాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఎంతలా అంటే వాటిని గుర్తించలేని విధంగా పెరిగిపోతున్నాయి. రోజుకో మోసం జరిగిపోతుంది. అధికారులకు కూడా అంతు చిక్కని విధంగా మోసాలు పెరిగిపోతున్నాయి. వాటిని ఎలా తెలుసుకోవాలలో తెలియని పరిస్థితి వచ్చేసింది. వాటి బారిన పడి ప్రజలు కోట్ల రూపాయలను పోగొట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఒక్క పక్క ప్రభుత్వం చాలా విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నా కానీ ఈ మోసాలు ఆగట్లేదు. మోసగాళ్లు అసలు కనిపెట్టలేని మార్గాల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు. గతంలో మోసగాళ్ళు బ్యాంకు అధికారులుగా ఫోన్లు చేసేవారు. బ్యాంకు ఎకౌంట్ నంబర్, ఓటీపీలను అడిగి డబ్బంతా దోచుకునేవారు. చదువుకోనివారు, అమాయకులు, టెక్నాలజీ గురించి పెద్దగా తెలియని వారు మాత్రమే మోసపోయేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. బాగా చదువుకున్నవారు, పెద్ద పెద్ద ఉద్యోగులు, పెద్ద వ్యాపారవేత్తలు కూడా ఆన్ లైన్ స్కాముల వలలో చిక్కుకు పోతున్నారు. చిక్కుకొని భారీగా నష్టపోతున్నారు. ఇటీవల చెన్నైకి చెందిన బిజినెస్ మ్యాన్ ఓ స్కాములో చిక్కుకున్నాడు. ఆ స్కామ్ పేరు ఈమెయిల్ స్పూఫింగ్. ఆ స్కాములో అతను ఏకంగా రూ.2 కోట్లను పోగొట్టుకున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే జాగ్రత్త పడ్డారు. దాంతో అధికారులు ఆ డబ్బును రికవరీ చేయగలిగారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

చెన్నైలో అగ్రిగో ట్రేడింగ్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. అయితే ఆ కంపెనీ జనరల్ మేనేజర్ కు ఒక ఈమెయిల్ వచ్చింది. అమెరికాలోని రీజియన్స్ బ్యాంకు అకౌంట్ కి 238.500 డాలర్లు (రూ.2 కోట్లు) పంపమని ప్రొఫార్మా ఇన్ వాయిస్, బ్యాంక్ వివరాలు ఆ ఈమెయిల్ లో ఉన్నాయి. సాధారణంగా ఆ కంపెనీ బిజినెస్ పేమెంట్స్ కోసం ఇది ఎప్పుడూ జరిగే ప్రాసెస్. ఇక ఈ ఈమెయిల్ కూడా సరిగ్గా అలానే ఉంది. దాంతో ఆ జనరల్ మేనేజర్ ఆ ఈమెయిల్ తమ కంపెనీకి సంబంధించిందేమో అని నమ్మారు. వెంటనే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా NEFT ద్వారా ఆ రెండు కోట్ల డబ్బుని పంపారు. తర్వాత రోజు అసలు డిస్ట్రీబ్యూటర్ తో డబ్బు పంపించా అని మాట్లాడాడు. అలా మాట్లాడినప్పుడు అతను షాక్ అయ్యాడు. డబ్బులా ఎప్పుడు పంపారు నాకేమీ రాలేదు అనడంతో జనరల్ మ్యానేజర్ దెబ్బకు ఖంగు తిన్నాడు. వెంటనే మొత్తం చెక్ చేయగా ఈ ఈమెయిల్ ఫేక్ అని తెలిసింది. కంపెనీ ప్రతినిధులు వెంటనే అలర్ట్ అయ్యారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్టేట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెంటర్ కేసు ఫైల్ చేసి, వెంటనే యాక్షన్ లోకి దిగింది. యూఎస్ ఏలోని హోం మినిస్టర్ అఫ్ఫైర్స్ డిపార్ట్మెంట్, రిజియన్స్ బ్యాంకుని సంప్రదించింది. ఆ డబ్బులను వెంటనే గుర్తించింది. మొత్తం డబ్బును రికవరీ చేసి కంపెనీ నష్టపోకుండా చేసింది. అలా సైబర్ నేరగాళ్ళు మోసం చేశారు. ఇలాంటి మోసాలు ఎలాగైనా జరగవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈ స్కామ్ పేరు ఈమెయిల్ స్పూఫింగ్. ఇది ఫ్రాడ్ ఈమెయిల్. దీన్ని పంపిన వారి చిరునామా, ఇతర వివరాలు చాలా నమ్మశక్యంగా ఉంటాయి. ఇవి అచ్చం పేమెంట్స్ జరిపే కంపెనీల ఎంప్లాయీస్ నుంచి వచ్చినట్టే ఉంటాయి. వీటిని నమ్మితే కచ్చితంగా మోసపొతారు.ఇలాంటివి వచ్చినప్పుడు దాన్ని పంపిన వారి చిరునామాను ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి. ఈమెయిల్ ని జాగ్రత్తగా చదవాలి. సాధారణంగా స్కామర్స్ డబ్బులు తొందరగా పంపాలని ఒత్తిడి చేస్తారు. పేమెంట్ త్వరగా చేయమంటారు.ఇలాంటి ఈమెయిల్ వస్తే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి కాల్ చెయ్యండి. లేదా cybercrime.gov.inలో కంప్లైంట్ చెయ్యండి. జాగ్రత్తగా ఉండండి. మరి ఈ ఈమెయిల్ స్పూఫింగ్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.