iDreamPost
android-app
ios-app

Ather 450 Apex: సింగిల్ ఛార్జ్ తో 157KM.. అదిరిపోయిన ATHER EV ఫీచర్స్

ఏథర్ కంపెనీకి భారత్ లో చాలా మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు ఏథర్ నుంచి 450 అపెక్స్ పేరిట సరికొత్త మోడల్ వచ్చింది.

ఏథర్ కంపెనీకి భారత్ లో చాలా మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు ఏథర్ నుంచి 450 అపెక్స్ పేరిట సరికొత్త మోడల్ వచ్చింది.

Ather 450 Apex: సింగిల్ ఛార్జ్ తో 157KM.. అదిరిపోయిన ATHER EV ఫీచర్స్

ఎలక్ట్రిక్ స్కూటర్ అనగానే వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా ఫ్యూయల్ కష్టాలు ఉండవు. పెట్రోలు ఎంత పెరిగింది? లీటరు ఎంత ధర పలుకుతోంది? అనే ప్రశ్నలు అస్సలు పట్టించుకోరు. అలాగే పర్యావరణానికి తమవంతు సహాయం చేసినవాళ్లు కూడా అవుతారు. కాలుష్యం లేకుండా పర్యావరణానికి మేలు చేసినవాళ్లు అవుతారు. అలాంటి ఉద్దేశం ఉన్న వారి కోసం ఏథర్ కంపెనీ ఒక సరికొత్త ఈవీని మార్కెట్ లోకి లాంఛ్ చేసింది. ఇది అదిరిపోయే స్టైలిష్ గా ఉండటమే కాకుండా అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంది. మరి.. ఏథర్ ఈవీ ధర ఎంత? దాని ఫీచర్స్ ఏంటి? అనే వివరాలు చూద్దాం.

ప్రస్తుతం భారత్ లో ఏథర్ కంపెనీ ఎలక్ట్రిక్ బైక్స్ కి ఎంతో మంచి డిమాండ్ ఉంది. లుక్స్ పరంగానే కాకుండా అద్భుతైన ఫీచర్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏథర్ ఈవీల్లో మంచి స్పెసిఫికేషన్స్ మాత్రమే కాకుండా.. స్పీడ్, రేంజ్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ లోకి ఏథర్ అపెక్స్ 450 అనే మోడల్ ని లాంఛ్ చేశారు. ఈ మోడల్ లో కూడా ఇప్పటి వరకు ఉన్న ఏథర్ ఈవీలకు మించిన ఫీచర్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ మోడల్ స్కూటీ లుక్స్ పరంగా ఎంతో స్టైలిష్ గా ఉంది. వీళ్లు ప్రమోట్ చేస్తున్న బ్లూ- ఆరెంజ్ మిక్స్డ్ కలర్ ఈవీ స్టన్నింగ్ లుక్స్ తో ఉంది. ఇప్పటికే రూ.2,500 టోకెన్ అమౌంట్ కట్టి ఈ స్కూటర్ ని బుక్ చేసుకోవచ్చు. ఈ మోడల్ డెలివిరీలను 2024 మార్చి నెల నుంచి ప్రారంభిస్తామని కంపెనీ చెబుతోంది.

ఏథర్ నుంచి వస్తున్న ఈ 450 అపెక్స్ మోడల్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇప్పటికే మార్కెట్ లో ఉన్న 450x మోడల్ కి ఇది అప్ గ్రేడెడ్ వర్షన్ గా చెబుతున్నారు. ఇది 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి కేవలం 2.9 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది. ఇందులో మొత్తం 5 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. కొత్తగా warp స్థానంలో warp+ మోడ్ ను తీసుకొచ్చారు. ఈ మోడ్ లో మీరు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయచ్చు. ఇంక బ్యాటరీ విషయానికి వస్తే.. 3.7 కిలో వాట్స్ పర్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఏథర్ 450 అపెక్స్ స్కూటీ వస్తోంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 157 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుందని చెబుతున్నారు. అత్యధిక వేగంతో కంటిన్యూగా నడిపినట్లయితే 75 కిలోమీటర్ల రేంజ్ ను ఈ ఈవీ అందిస్తుంది.

ఈ మోడల్ లో బ్యాటరీకి 60 వేల కిలోమీటర్లు లేదా ఐదేళ్ల వరకు బ్యాటరీకి వారెంటీ ఇస్తున్నారు. ఇంక ఈ అపెక్స్ 450 ఈవీ లుక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏ ఈవీలో లేని విధంగా ఈ మోడల్ లో ట్రాన్సపరెంట్ సైడ్ ప్యానల్స్ ని ఇచ్చారు. ఇవి కాకుండా అపెక్స్ లో కూడా  ఇప్పటివరకు ఉన్న ఏథర్ మోడల్స్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఇంక ఈ బండి ధర గురించి మాట్లాడుకుంటే.. రూ.1.89 లక్షల నుంచి ప్రేస్ మొదలవుతుందని చెబుతున్నారు. అయితే ఈ సెగ్మెంట్ లో ఇది కాస్త ఖరీదైన వాహనం అనే చెప్పాలి. కానీ, లుక్స్, స్పీడ్, రేంజ్, స్పెసిఫికేషన్స్ ని బట్టి చూస్తే ఆ మాత్రం ధర ఉంటుందనే చెప్పాలి. మరి.. ఏథర్ అపెక్స్ 450 ఈవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.