iDreamPost
android-app
ios-app

iOS 17.6లో మైండ్ బ్లాక్ ఫీచర్స్! ఇవే యూజర్స్ కోరుకున్నది!

  • Published Aug 01, 2024 | 10:04 PM Updated Updated Aug 01, 2024 | 10:04 PM

What Are The Features In Apple iOS 17.6 Update: మీరు 2023వ సంవత్సరం ముందు లాంఛ్ అయిన ఐఫోన్స్ ని కొన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. యాపిల్ కంపెనీ నుంచి సరికొత్త అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ ని ఖచ్చితంగా ఇన్ స్టాల్ చేసుకోవాలని యాపిల్ కంపెనీ సూచించింది. అంతేకాదు ఈ అప్డేట్ తో మీరు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

What Are The Features In Apple iOS 17.6 Update: మీరు 2023వ సంవత్సరం ముందు లాంఛ్ అయిన ఐఫోన్స్ ని కొన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. యాపిల్ కంపెనీ నుంచి సరికొత్త అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ ని ఖచ్చితంగా ఇన్ స్టాల్ చేసుకోవాలని యాపిల్ కంపెనీ సూచించింది. అంతేకాదు ఈ అప్డేట్ తో మీరు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

  • Published Aug 01, 2024 | 10:04 PMUpdated Aug 01, 2024 | 10:04 PM
iOS 17.6లో మైండ్ బ్లాక్ ఫీచర్స్! ఇవే యూజర్స్ కోరుకున్నది!

యాపిల్ కంపెనీ తాజాగా ఐఓఎస్ 17.6 అప్డేట్ ని లాంఛ్ చేసింది. ఐఓఎస్ 18కి ముందు ఐఓఎస్ 17 వెర్షన్ లాస్ట్ అప్డేట్ గా దీన్ని తీసుకొచ్చింది. ఇందులో మూడు ప్రధాన అప్డేట్స్ అయితే కనిపించాయి. కొన్ని రీసెంట్ గా వచ్చిన ఐఫోన్ మోడల్స్ లో ఈ అప్డేట్ ముందుగానే వచ్చింది. ఐఫోన్ 12, 13, 14 లాంటి ఫోన్ల కోసం సరికొత్త అప్డేట్ ని లాంచ్ చేసింది. త్వరలో ఐఓఎస్ 18ని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐఫోన్ 15 సిరీస్ కంటే ముందు వచ్చిన ఫోన్లలో సరికొత్త అప్డేట్ ని తీసుకొచ్చింది. ఐఓఎస్ 18లో ఉండే ఫీచర్స్ లో కొన్నిటిని ముందుగానే పరిచయం చేసింది. 

కస్టమైజ్ గ్యాలరీ:

వాటిలో మొదటిది కస్టమైజ్ గ్యాలరీ ఫీచర్ ఒకటి. ఇందులో ఫోటోస్, పీపుల్, ఫోటో షఫిల్, లైవ్ ఫోటో, ఎమోజీ, వెదర్, ఆస్ట్రానమీ, కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఫోటోస్ లో ఉన్న పిక్స్ ని, పీపుల్ ఆప్షన్ లో పలానా వ్యక్తి ఫోటోని వాల్ పేపర్ గా సెట్ చేసుకోవచ్చు. లైవ్ ఫోటోని, షఫిల్ అయ్యేలా కొన్ని ఫోటోలను వాల్ పేపర్ గా పెట్టుకోవచ్చు. ఎమోజీలను వాల్ పేపర్, వాతావరణ, ఖగోళ శాస్త్ర సంబంధిత పిక్స్ ని వాల్ పేపర్ గా పెట్టుకోవచ్చు. ఫీచర్డ్ ఇమేజెస్ ని కూడా వాల్ పేపర్ గా సెట్ చేసుకోవచ్చు. లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్ లో నచ్చిన పిక్స్ ని ఇకపై సులువుగా సెట్ చేసుకోవచ్చు. హోమ్ స్క్రీన్ ని అన్ లాక్ చేసిన తర్వాత స్క్రీన్ పై వేలితో హోల్డ్ చేసి ఉంచితే కస్టమైజ్ ఆప్షన్ వస్తుంది. ఇందులో మళ్ళీ పిక్స్ కాకుండా ప్లెయిన్ బ్యాక్ గ్రౌండ్ ని సెట్ చేసుకోవచ్చు. గ్రేడియంట్ రంగు బ్యాక్ గ్రౌండ్ ని సెట్ చేసుకోవచ్చు. బ్లర్ బ్యాక్ గ్రౌండ్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది. 

ఆల్ షార్ట్ కట్స్:

ఆల్ షార్ట్ కట్స్ అనే ఫీచర్ ఒకటి ఉంది. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏ నుంచి జడ్ వరకూ మీ ఐఫోన్ లో ఉన్న యాప్స్ డిస్ప్లే అవుతాయి. ఎన్ని అయినా పెట్టుకోవచ్చు. అస్తమానూ మీరు యూజ్ చేసే యాప్స్ ని మీరు ఇందులో పెట్టుకోవచ్చు. ఈ అప్డేట్ లో భాగంగా బుక్స్, కెమెరా, క్లాక్, ఫైల్స్, ఫ్రీ ఫార్మ్, గూగుల్ వంటి యాప్స్ ని డిస్ప్లే చేసింది.

యాడ్ విడ్జెట్స్:

హోమ్ స్క్రీన్ మీద విడ్జెట్స్ ని యాడ్ చేసుకునే ఫీచర్ ని తీసుకొచ్చింది. విడ్జెట్స్ లో మీరు బ్యాటరీ పర్సంటేజ్, టైం క్లాక్, మెయిల్, సోషల్ మీడియా ఐకాన్స్ వంటివి పెట్టుకోవచ్చు. డెప్త్ ఎఫెక్ట్ ఆన్, ఆఫ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.  

ఇంప్రూవ్ సిరి అండ్ డిక్టేషన్ ఫీచర్:

ఈ ఫీచర్ లో మీరు సిరితో ఆడియో రికార్డింగ్స్ ని షేర్ చేయవచ్చు. దీని వల్ల మన సహజమైన భాషని, యాసని సరళీకృతం చేస్తుంది. కొన్నిసార్లు మన భాషను, యాసని సిరి అర్థం చేసుకోకపోవచ్చు. అయితే ఈ ఫీచర్ తో మన భాష, యాస సిరి సర్వర్ లో స్టోర్ అవుతాయి. వీటిని బేస్ చేసుకుని యాపిల్ కంపెనీ యూజర్ సౌకర్యార్థం అప్డేట్స్ ని తీసుకొస్తుంది. 

లాంగ్వేజ్ ట్రాన్స్ లేటర్ (వేరే లెవల్ ఫీచర్ ఇది):

ఐఫోన్ లో బెస్ట్ ఫీచర్ ఏదైనా ఉందంటే అది లాంగ్వేజ్ ట్రాన్స్ లేటరే. ఈ యాప్ ని ఓపెన్ చేస్తే ట్రాన్స్ లేషన్, కెమెరా, కాన్వర్సేషన్, ఫేవరెట్స్ అనే నాలుగు ఆప్షన్స్ కనబడతాయి. ట్రాన్స్ లేషన్ ద్వారా మీరు ఇంగ్లీష్ వాక్యాన్ని, పదాలను వేరే భాషలోకి అనువాదం చేసుకోవచ్చు. దాని పక్కనే ఉన్న కెమెరా మీద ట్యాప్ చేస్తే.. వెబ్ సైట్ లేదా ఏదైనా పేపర్ మీద ఉన్న భాషను మీకు కావాల్సిన భాషలోకి అనువాదం చేస్తుంది. కెమెరాని ఆ పేపర్ మీద ఫోకస్ చేస్తే చాలు. కాన్వర్సేషన్ ని కూడా వేరే భాషలోకి అనువాదం చేస్తుంది. ఇద్దరి సంభాషణను ఇది అనువాదం చేస్తుంది. ఆల్రెడీ మీ ఫోన్ లో భాషలు డౌన్ లోడ్ చేసి ఉంటే కనుక ఇంటర్నెట్ లేకపోయినా ఈ ట్రాన్స్ లేట్ ఫీచర్ వర్క్ అవుతుంది. టెక్స్ట్ ని టైప్ చేస్తేనే కాదు.. మీరు మాటలను కూడా అనువాదం చేస్తుంది. ఫ్యూచర్ లో తెలుగు సహా పలు భారతీయ భాషలు కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. ఇంగ్లీష్ సహా వేరే భాషలు నేర్చుకోవాలనుకునేవారికి ఈ యాప్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.

ఐఓఎస్ 17.6 అప్డేట్ అందుబాటులో ఉన్న ఫోన్ల జాబితా:

ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎస్ఈ (సెకండ్ జెన్), ఐఫోన్ ఎస్ఈ (థర్డ్ జెన్) ఫోన్లలో ఈ కొత్త ఐఓస్ 17.6 అప్డేట్ అందుబాటులో ఉంది. అయితే కొత్తగా విడుదలైన ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఐఫోన్లలో ఆల్రెడీ ఐఓఎస్ 17 అప్డేట్ అనేది ఉంది. ఈ అప్డేట్ ని సెక్యూరిటీ పర్పస్ ఖచ్చితంగా ఇన్ స్టాల్ చేసుకోవాలని యాపిల్ కంపెనీ సూచించింది. సెట్టింగ్స్ లోకి వెళ్లి జనరల్ లో సాఫ్ట్ వేర్ అప్డేట్ లోకి వెళ్లి అప్డేట్ చేసుకోవాలి.

Good news for iPhone users

మీకు మెజర్ అనే యాప్ గురించి తెలిస్తే ఓకే కానీ తెలియకపోతే కనుక ఒకసారి ఆ యాప్ ని ట్రై చేయండి. ఇది ఎప్పటి నుంచో ఉంది. కానీ చాలా మంది చూసి ఉండకపోవచ్చు. ఈ యాప్ తో మీరు కొలతలు కొలుచుకోవచ్చు. టేబుల్స్, మంచాలు, బీరువాలు, ఫ్లోర్ వెడల్పు, పొడవు వంటి కొలతలు తెలుసుకోవచ్చు.