iDreamPost
android-app
ios-app

యాపిల్ ఐఫోన్ 16 లాంచ్ డేట్.. ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ ధరలు తగ్గుతాయా?

  • Published Aug 20, 2024 | 7:33 PM Updated Updated Aug 20, 2024 | 7:33 PM

Apple iPhone 16 Launch Date, Price Detials: ప్రస్తుతం యాపిల్ కంపెనీ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోన్లను సెప్టెంబర్ లో లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు భారతదేశంలో నిర్ణయించిన ధర కంటే కొంచెం తక్కువ ధరకే ఐఫోన్ 16 మోడల్స్ ని విక్రయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఎంత వరకూ తగ్గుతుంది? ఐఫోన్ 16 ఫోన్లను ఎప్పుడు లాంచ్ చేస్తుంది? వంటి వివరాలు మీ కోసం.

Apple iPhone 16 Launch Date, Price Detials: ప్రస్తుతం యాపిల్ కంపెనీ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోన్లను సెప్టెంబర్ లో లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు భారతదేశంలో నిర్ణయించిన ధర కంటే కొంచెం తక్కువ ధరకే ఐఫోన్ 16 మోడల్స్ ని విక్రయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఎంత వరకూ తగ్గుతుంది? ఐఫోన్ 16 ఫోన్లను ఎప్పుడు లాంచ్ చేస్తుంది? వంటి వివరాలు మీ కోసం.

యాపిల్ ఐఫోన్ 16 లాంచ్ డేట్.. ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ ధరలు తగ్గుతాయా?

యాపిల్ ప్రధాన భాగస్వామిగా ఫాక్స్ కాన్ కంపెనీ ఉంది. ఇప్పటికే ఈ కంపెనీ తమిళనాడులోని ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను తయారు చేయడానికి సన్నాహాలు చేస్తుందని బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ ఫోన్ల ఉత్పత్తిని హ్యాండిల్ చేయడానికి వేలాది మంది వర్కర్స్ కి కంపెనీ శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. గ్లోబల్ మార్కెట్లో విడుదలైన తర్వాత ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను అసెంబుల్ చేయడానికి ఫాక్స్ కాన్ కంపెనీ సిద్ధంగా ఉంది. టాటా గ్రూప్, పెగాట్రాన్ లోకల్ యూనిట్ తో సహా దేశంలోని యాపిల్ కంపెనీతో భాగస్వామ్యం ఉన్న ఇతర కంపెనీలు కూడా ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ అసెంబ్లీకి సహకరించనున్నాయి. దీని వల్ల ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల ధరలపై నేరుగా ప్రభావం పడనుంది.

ప్రస్తుతం ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ యూనిట్లను దేశానికి దిగుమతి చేసుకోవడం వల్ల దిగుమతి సుంకం పడుతుంది. దీని వల్ల ధరలు అనేవి పెరుగుతాయి. అయితే భారతదేశంలో స్థానికంగా అసెంబుల్ చేయడం వల్ల ధర తగ్గించవచ్చునని యాపిల్ కంపెనీ భావిస్తుంది. ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ పై 10 శాతం తగ్గించాలన్న లక్ష్యంతో యాపిల్ కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే యాపిల్ కంపెనీ 10 శాతం ధర తగ్గించినప్పటికీ.. గ్లోబల్ మార్కెట్లో ఉన్న ధరలతో పోలిస్తే ఎక్కువే. ఎందుకంటే స్థానిక పన్నులు, ఖరీదైన విడిభాగాల కారణంగా ధర ఎక్కువగా ఉంటుంది. దేశంలో అసెంబుల్ చేయబడిన చాలా వరకూ ఐఫోన్ 16 ప్రో మోడల్స్ యూరప్, మిడిల్ ఈస్ట్, అమెరికా వంటి గ్లోబల్ మార్కెట్ కి ఎగుమతి చేయబడతాయి.

భారత్ లో హై ఎండ్ ఐఫోన్ మోడల్స్ కి డిమాండ్ తక్కువగా ఉన్న కారణంగా ఎక్కువ ఫోన్లు విదేశీ మార్కెట్ కి ఎగుమతి కానున్నాయి. తొలిసారిగా యాపిల్ కంపెనీ తన ప్రో సిరీస్ ఐఫోన్స్ ని చైనాలో కాకుండా మిగతా దేశాల్లో తయారు చేస్తుంది. గత ఏడేళ్లుగా యాపిల్ కంపెనీ ఐఫోన్స్ ని భారత్ లో అసెంబుల్ చేయిస్తుంది. ఈ కొత్త అభివృద్ధితో ఐఫోన్ ఉత్పత్తిలో మన దేశానికి 14 శాతంగా ఉన్న వాటా వచ్చే ఏడాదికి 25 శాతానికి పెరగనుంది. ఐఫోన్ 17 ఫోన్ల ఉత్పత్తిని మన దేశంలో ఎక్స్ క్లూజివ్ గా ప్రారంభించాలని యాపిల్ కంపెనీ భావిస్తున్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్ గురించి కొన్ని లీకులు అయితే వచ్చాయి. ఈ కొత్త ఐఫోన్ సిరీస్ లని సెప్టెంబర్ 10న యాపిల్ పార్క్ లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

‘రెడీ సెట్ క్యాప్చర్’ పేరుతో ఒక పోస్టర్ ని చేసినట్లు తెలుస్తోంది. ఈ లాంచ్ ఈవెంట్ కి హాజరైన వారిని స్టీవ్ జాబ్స్ థియేటర్ కి కంపెనీ ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. గతంలో సెప్టెంబర్ 10న ఐఫోన్ 16 మోడల్స్ ని లాంచ్ చేస్తున్నట్లు బూమ్ బర్గ్ నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఏఐ ఫీచర్స్ అనేవి అక్టోబర్ ఐఓఎస్ 18.1 అప్డేట్ వచ్చేవరకూ అందుబాటులో ఉండవని తెలిపింది. ఇక ఐఫోన్ 16 సిరీస్ ఫీచర్స్ విషయానికొస్తే.. పలు కొత్త ఫీచర్లను, మెరుగైన డిజైన్స్ ని తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఐఫోన్ 16 ప్రో మోడల్స్ స్పోర్ట్ గ్లాసీ టైటానియం ఫినిష్ తో.. స్క్రాచ్ రెసిస్టెంట్ తో వస్తున్నట్లు తెలుస్తుంది.

గత మోడల్స్ తో పోలిస్తే మరింత ప్రీమియం లుక్ తో ఐఫోన్ 16 ప్రో మోడల్స్ ని తయారు చేసినట్లు సమాచారం. అంతేకాదు లార్జ్ స్క్రీన్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఐఫోన్ 16 ప్రో మోడల్స్ కి 6.3 అంగుళాల డిస్ప్లే, ప్రో మ్యాక్స్ మోడల్స్ కి 6.9 అంగుళాల డిస్ప్లేని ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే బేసిక్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ఫోన్ల డిజైన్ కూడా ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ ని పోలి ఉంటాయని.. కొత్త ఏ18 బయోనిక్, ఏ18 బయోనిక్ ప్రాసెసర్స్ తో వస్తాయని సమాచారం. అన్ని ఐఫోన్ 16 మోడల్స్ ఐఓఎస్ 18 ఆపరేటింగ్ సిస్టం మీద రన్ అవుతాయి. అడ్వాన్స్డ్ ఏఐ సామర్థ్యాలతో, మెరుగైన సిరి ఫీచర్స్, న్యూ టెక్స్ట్ టూల్స్ తో రానున్నాయి.