iDreamPost
android-app
ios-app

ఐఫోన్‌ 15 మోడల్స్‌ని లాంచ్‌ చేసిన యాపిల్‌.. ఫీచర్స్‌, ధర ఎంతంటే..

  • Published Sep 13, 2023 | 9:14 AM Updated Updated Sep 13, 2023 | 9:14 AM
  • Published Sep 13, 2023 | 9:14 AMUpdated Sep 13, 2023 | 9:14 AM
ఐఫోన్‌ 15 మోడల్స్‌ని లాంచ్‌ చేసిన యాపిల్‌.. ఫీచర్స్‌, ధర ఎంతంటే..

స్మార్ట్‌ ఫోన్స్‌లో ఐఫోన్‌కు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐఫోన్‌ కొనడం కోసం కిడ్నీలు అమ్ముకున్న వారు ఉన్నారంటే.. ఆ ఫోన్‌కు ఉండే క్రేజ్‌ గురించి అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏటా కొత్త సిరీస్‌లను విడుదల చేస్తూ ఉంటుంది. అలానే ఈ ఏడాది కొత్త సిరీస్‌లను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసింది. యాపిల్‌ ఈవెంట్‌ 2023 వండర్‌లస్ట్‌ కార్యక్రమం ద్వారా యాపిల్‌ ఐఫోన్‌ 15 సిరీస్‌ అందుబాటులోకి వచ్చింది. యాపిల్‌ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఐఫోన్ 15 మోడల్స్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అనే నాలుగు సరికొత్త ఫోన్లను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. మరి వాటి ఫీచర్స్‌, ధర తదితర వివరాలు..

ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఈ సిరీస్‌లో అనేవి బేస్ మోడల్స్. వీటిలో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మాదిరిగానే అల్యూమినియం సైడ్స్, గ్లాస్ బ్యాక్ ఉంటాయి. అయితే ఈ సిరీస్‌లోని ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ హై-ఎండ్ ఫోన్లను మాత్రం సరికొత్త డిజైన్‌, అద్భుతమైన ఫీచర్లతో తీసుకువస్తున్నారు. ముఖ్యంగా వీటిని స్టెయిన్లెస్ స్టీల్, టైటానియం వంటి లోహాలతో రూపొందించారు. దీని వల్ల బరువు బాగా తక్కువగా ఉంటాయి. మరోవైపు లైఫ్‌టైమ్‌ కూడా పెరుగుతుంది.

ఐఫోన్‌ 15 ఫీచర్స్‌..

యాపిల్‌ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌ రెండు మోడల్స్‌ కూడా 6.1 అంగుళాల నుంచి 6.7 అంగుళాల డిస్ల్పేతో వస్తున్నాయి. తాజా 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్‌ని 48 మెగాపిక్సెల్స్‌కి పెంచడం జరిగింది. అలాగే టెలిఫొటో, ఆల్ట్రావైడ్ లెన్స్ కెమెరాలను కూడా పొందుపరచడం జరిగింది. వీటి ద్వారా 3X నుంచి 6X వరకు జూమ్ చేసి పిక్చర్స్‌ని తీయొచ్చు. ఇక ప్రాసెసర్‌ విషయానికి వస్తే.. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్లలో ఏ16 చిప్‌ని మాత్రమే వినియోగిస్తున్నారు.

ఇక ఐఫోన్‌ 15 మోడల్‌ రేటు విషయానికి వస్తే.. 128 జీబీ ఫోన్‌ ధర 79,900 రూపాయలు ఉండగా.. 256 జీబీ ఫోన్‌ ధర 89,900, 512 జీబీ మొబైల్‌ ధర 1,09,000 రూపాయలుగా ఉండనుంది. అలానే ఐఫోన్‌ 15 ప్లస్‌ విషయానికి వస్తే.. 128 జీబీ ఫోన్‌ ధర 89,900 రూపాయలు ఉండగా.. 256 జీబీ ఫోన్‌ ధర 99,900, 512 జీబీ మొబైల్‌ ధర 1,19,000 రూపాయలుగా ఉండనుంది.

ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఫీచర్స్‌..

ఐఫోన్‌ 15 బేస్‌ మోడల్స్‌తో పోలిస్తే.. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ డిస్ప్లే మాత్రం కాస్త పెద్దగా ఉండే అవకాశం ఉంది. అలాగే వీటి స్క్రీన్ బోర్డర్స్ 1/3వ వంతు సన్నంగా ఉంటాయి. ఇందుకు అనుగుణంగా ఫోన్ బెజిల్స్ కూడా మరింత సన్నగా ఉంటాయి. ప్రస్తుతం యాపిల్ కంపెనీ లో-ఇంజిక్షన్ ప్రెజర్ ఓవర్మౌల్డింగ్‌ (ఎల్‌ఐపోఓ) అనే పద్ధతి ఉపయోగించి తమ ప్రొడక్టులను తయారుచేస్తున్న విషయం తెలిసిందే. అలాగే.. ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యామ్స్‌ మొబైల్స్‌లో ఏ17 చిప్స్‌ని ఇన్స్టాల్ చేశారు. దీని వల్ల ఈ హైఎండ్ ఫోన్ల ప్రాసెసింగ్ స్పీడ్ పెరుగుతుంది.

ఇక ఐఫోన్‌ 15 ప్రో మోడల్‌ ధర విషయానికి వస్తే.. 128 జీబీ ఫోన్‌ ధర 1,34,900 రూపాయలు ఉండగా.. 256 జీబీ ఫోన్‌ ధర 1,44,900, 512 జీబీ మొబైల్‌ ధర 1,84,900 రూపాయలుగా ఉండనుంది. అలానే ఐఫోన్‌ ప్రో మాక్స్‌ ధర 256 జీబీ ఫోన్‌ ధర రూ.1,59,900, 512 జీబీ మొబైల్‌ ధర 1,79,000 రూపాయలు, 1టీబీ ధర 1,99,900 రూపాయలుగా ఉండనుంది.

ఐఫోన్‌ 15 కలర్ వేరియంట్స్…

సాధారణంగా ఐఫోన్స్.. పింక్, బ్లాక్, వైట్, బ్లూ, యెల్లో రంగుల్లో లభిస్తాయి. కానీ ఐఫోన్ 15 ప్రో మోడల్స్.. గ్రే, బ్లాక్, డార్క్ బ్లూ, వైట్ కలర్స్లోనూ అందుబాటులోకి రానున్నాయి.