iDreamPost
android-app
ios-app

ఏం పిచ్చిరా బాబు…. ఐఫోన్ 15 కొనడానికి 17 గంటలు క్యూలో నిలబడ్డాడు..?

ఏం పిచ్చిరా బాబు…. ఐఫోన్ 15 కొనడానికి 17 గంటలు క్యూలో నిలబడ్డాడు..?

టెక్ దిగ్గజం యాపిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కంపెనీ విడుదల చేసే ఐఫోన్ లకు మాములు క్రేజ్ ఉండదు. ఇక కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని యాపిల్ కంపెనీ కూడా తరచూ ఐఫోన్ లో కొత్త కొత్త సిరీస్ లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. అలా మార్కెట్ లోకి వచ్చిన ఐఫోన్ కొత్త మోడల్స్ ను కొనేందుకు చాలా మంది ఎంతగానో ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవలే యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట ఫోన్లను లాంచ్ చేసింది. వీటి అమ్మకాలు భారతదేశంలో కూడా ప్రారంభమయ్యాయి. ఐఫోన్ కొనుగోలు చేసేందుకు చాలా మంది వాటి స్టోర్ల వద్ద క్యూలో ఉన్నారు.  ఓ వ్యక్తి  ఐఫోన్ 15 కొనడం కోసం దాదాపు 17 గంటలు క్యూలో నిలబడి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐఫోన్ 15 సిరీస్ ను లాంచ్ చేసిన యాపిల్ సంస్థ.. సెప్టెంబర్ 22 నుంచి సేల్ ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఇండియాలోని యాపిల్ స్టోర్స్ లో ఉదయం 8 గంటల నుంచి  అమ్మకాలు ప్రారంభం అవుతాయని ప్రకటించింది.  అలానే మన దేశంలో ముంబై, న్యూఢిల్లీలోనే యాపిల్ స్టోర్స్ ఉన్నాయి. ఒక రోజు ముందు నుంచే  ఐఫోన్ ప్రియులు.. ఈ స్టోర్ల వద్ద క్యూ కట్టారు. అలానే ఐఫోన్-15ను సొంతం చేసుకోవాడనికి ఓ వ్యక్తి ఏకంగా  17 గంటల పాటు క్యూలో నిలబడ్డాడు. అతడి గురించి తెలుసుకున్న అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు సేల్ ప్రారంభం అవుతుందని తెలుసుకొని గురువారం మధ్యాహ్నం 3 గంటలకే వచ్చి క్యూలో నిల్చున్నాడు.

ఆ క్యూలో  ఉన్న మొదటి వ్యక్తి కూడా ఆయనే. గుజరాత్ రాష్ట్రం నుంచి ముంబై చేరుకొని,బీకేసీ ముంబైలో ఉన్న  యాపిల్ స్టోర్ వద్ద క్యూలో నిలబడ్డాడు. అతనితో నేషనల్ మీడియా మాట్లాడగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత దేశంలో తొలి ఐఫోన్-15 తానే కొనాలని అందుకే  ప్రత్యేకంగా అహ్మదాబాద్ నుంచి ముంబైకి వచ్చినట్లు తెలిపాడు. తాను గురువారం మధ్యాహ్నం 3 నుంచి  క్యూలో ఉన్నానని, 17 గంటల పాటు క్యూలో నిల్చున్నానని అతడు తెలిపాడు.

ఇక ఆయన బుక్ చేసిన ఐఫోన్ 15 విషయానికి వస్తే… 15 ప్రో మ్యాక్స్ 256బీజీ మోడల్, వైట్ టైటానియం కలర్ బుక్ చేశానని, దీంతో పాటు యాపిల్ వాచ్ అల్ట్రా 2, కొత్త ఎయిర్‌పాడ్స్ కూడా కొన్నానని చెప్పాడు. యాపిల్ బ్రాండ్ గురించి కామెంట్ చేయమని మీడియా అడగ్గా..ఇది బెస్ట్ బ్రాండ్ అని నవ్వేశాడు. ఇక మరో కస్టమర్ వివేక్ తెల్లవారుజామున 4 గంటల నుంచి యాపిల్ బీకేసీ స్టోర్ దగ్గర క్యూలో నిలబడ్డాడు. మరి.. ఐఫోన్ కోసం  ఇలా గంటల తరబడి నిల్చుకున్న ఈ వ్యక్తి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.