iDreamPost

Apple Event 2023: ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరకే ఐఫోన్ 15!

Apple Event 2023: ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరకే ఐఫోన్ 15!

ఐఫోన్ ప్రియులకు ఇది నిజంగా శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే మరి కొన్ని గంటల్లో యాపిల్ ఈవెంట్ 2023 గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ లో ఐఫోన్ 15 మోడల్ మొదలు.. పలు ఉత్పత్తులను యాపిల్ కంపెనీ లాంఛ్ చేయబోతోంది. ఈ యాపిల్ ఈవెంట్ ను వండర్ లస్ట్ పేరిట నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 12న ఉదయం 10 గంటలకు కాలిఫోర్నియాలో ఈవెంట్ జరుగుతుంది. అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. యాపిల్ యూట్యూబ్ ఛానల్ ఈవెంట్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది.

ఈ యాపిల్ ఈవెంట్ 2023లో యాపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 15+, ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్స్ ను విడుదల చేయనున్నారు. వీటితో పాటుగా యాపిల్ వాచ్, వాచ్ అల్ట్రా మోడల్స్ ని కూడా యాపిల్ సంస్థ లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈవెంట్ లో ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధించిన కీలక అనౌన్స్ మెంట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈసారి ఐఫోన్ కు ఈయూ కామన్ ఛార్జర్ షరతులకు అనుగుణంగా యూఎస్ బీ టైప్-సీ పోర్టుతో ఛార్జర్ ను తీసుకురానున్నారు. ఇది స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో రావచ్చు. అలాగే ఓఎస్ అప్ డేట్స్ గురించి కూడా యాపిల్ ఈవెంట్ 2023లో ప్రకటన చేసే అవకాశం ఉంది. మ్యాక్ ఓఎస్ 14, యాపిల్ ఐఓఎస్ 17, ఐప్యాడ్ ఓఎస్ 17, వాచ్ ఓఎస్ 10 వర్షన్స్ పై అప్ డేట్ కి సంబంధించిన సమాచారాన్ని కూడా అందజేయనున్నట్లు చెబుతున్నారు.

ఐఫోన్ 15 ఇండియాలో కూడా తయారీ అవుతోంది. అమెరికా- చైనా విపరీత పరిస్థితుల దృష్ట్యా ఐఫోన్ ప్రొడక్షన్ ని చైనాకి దూరంగా ఇతర దేశాల్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. తమిళనాడులోని ప్లాంట్ లో కూడా ఐఫోన్ ప్రొడక్షన్ జరుగుతున్నట్లు ఇప్పటికే చెప్పారు. అయితే ఐఫోన్ యూజర్లకు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే.. ఐఫోన్ 15 ధరలు తక్కువగానే ఉండే అవకాశం ఉందంటున్నారు. ఐఫోన్ 15 ధర రూ.79,900గా, ఐఫోన్ 15+ ధర రూ.89,900, ఐఫోన్ 15 ప్రో ధర రూ.1,29,900గా, ఐఫోన్ ప్రో మ్యాక్స్ ధర రూ.1,39,900 గా ఉండే అవకాశం ఉంటుందని లీకులు ద్వారా తెలుస్తోంది. అయితే ఇవేం తక్కువ ధర అని అనుకోవచ్చు. ఐఫోన్ 14 సిరీస్ ధరలకు అతి దగ్గరగా ఐఫోన్ 15 ధరలు ఉంటాయని.. దాదాపుగా ఒకే ధరలు కూడా ఉండచ్చు అని చెబుతున్నారు. అంటే 14 ధరకే 15 మోడల్ ఇస్తున్నారంటే గొప్పే అంటూ టెక్ వర్గాలు కూడా చెబుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి