iDreamPost
android-app
ios-app

యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్.. ఇంతకంటే గుడ్ న్యూస్ మరొకటి ఉండదేమో!

  • Published Jun 05, 2024 | 4:42 PM Updated Updated Jun 05, 2024 | 4:42 PM

Foldable iPhone: యాపిల్ కంపెనీ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్స్ రానున్నాయి. డిస్ప్లే సైజ్ ఎంతో తెలిస్తే స్టన్ అవ్వడం ఖాయం. ఐఫోన్ లవర్స్ కి ఇంతకంటే మరొక గుడ్ న్యూస్ ఉండదేమో

Foldable iPhone: యాపిల్ కంపెనీ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్స్ రానున్నాయి. డిస్ప్లే సైజ్ ఎంతో తెలిస్తే స్టన్ అవ్వడం ఖాయం. ఐఫోన్ లవర్స్ కి ఇంతకంటే మరొక గుడ్ న్యూస్ ఉండదేమో

యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్.. ఇంతకంటే గుడ్ న్యూస్ మరొకటి ఉండదేమో!

ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ గురించి తెలిసే ఉంటుంది. పెద్ద స్క్రీన్ కావాలనుకున్నపుడు మడత విప్పి.. వద్దనుకున్నప్పుడు మడతపెట్టుకుని వాడుకునే ఫోన్. శామ్ సంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5, వన్ ప్లస్ ఓపెన్, టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ వంటి ఫోన్లు వచ్చాయి. అయితే ఐఫోన్ నుంచి కూడా ఇలాంటి ఫోల్డబుల్ ఫోన్ వస్తే బాగుణ్ణు అని చాలా మంది ఐఫోన్ లవర్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే మిగతా స్మార్ట్ ఫోన్స్ తో పోలిస్తే స్క్రీన్ సైజ్ విషయంలో యాపిల్ ఫోన్లు చిన్నగా ఉంటాయి. దీని వల్ల మిగతా ఫోన్లలో ఉన్న ఆ స్క్రీన్ అనుభూతిని ఐఫోన్స్ లో మిస్ అవుతున్నారు. ఈ కారణంగా పెద్ద స్క్రీన్ కోరుకునే వారికి ఈ ఫోల్డబుల్ ఐఫోన్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ క్రమంలో యాపిల్ కంపెనీ కూడా ఫోల్డబుల్ ఫోన్స్ పై దృష్టి పెట్టింది. యాపిల్ కంపెనీ దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. కానీ ఫోల్డబుల్ ఫోన్స్ పై యాపిల్ ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిందని సమాచారం. 

యాపిల్ కంపెనీ ఇంకా కాంపోనెంట్ స్పెసిఫికేషన్స్, పని తీరు వంటి విషయాలపై అధ్యయనం చేస్తుంది. ఫోల్డబుల్ డిస్ప్లేల సరఫరాతో పాటు వివిధ వస్తువుల తయారీని పరిగణనలోకి తీసుకున్న తర్వాత యాపిల్ కంపెనీ.. ఫోల్డబుల్ ఐఫోన్ కోసం లాంఛింగ్ సమయాన్ని 2026 నాలుగో త్రైమాసికం నుంచి 2027 మొదటి త్రైమాసికానికి పోస్ట్ పోన్ చేసిందని ఓ టెక్ దిగ్గజ కంపెనీ వెల్లడించింది. 2024లో 17.8 మిలియన్ యూనిట్లకు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ షిప్మెంట్లు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్ షేర్ మార్కెట్లో 1.5 శాతంగా ఉంది. 2022లో 80 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న శామ్ సంగ్ కంపెనీ కూడా పలు బ్రాండ్స్ నుంచి పోటీ పెరిగిపోవడం వల్ల 50 శాతంతో సరిపెట్టుకుంది. ఈ 50 శాతం మార్కెట్ వాటాను కాపాడుకోవడానికే శామ్ సంగ్ కష్టపడుతుంది. ఇలాంటి సమయంలో యాపిల్ కంపెనీ ఫోల్డబుల్ ఐఫోన్స్ ని దింపితే నష్టపోతామన్న ఉద్దేశంతో ఆ ఫోల్డబుల్ ఫోన్స్ కి డిమాండ్ పెరిగే సమయానికి రెడీ చేయాలని భావిస్తుంది.   

అంచనా ఫోల్డబుల్ ఐఫోన్ స్పెసిఫికేషన్స్:

క్లామ్ షెల్, స్టైల్ ఫోల్డబుల్ అనే రెండు ఫోల్డబుల్ ఐఫోన్ మోడల్స్ ని దింపుతుందని అంటున్నారు. ఎల్జీ డిస్ప్లే, శామ్ సంగ్ డిస్ప్లేతో ఆర్డర్ల కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఫోల్డబుల్ డిస్ప్లేలకు సంబంధించి పేటెంట్ రైట్స్ కోసం యాపిల్ కంపెనీ దరఖాస్తు చేసింది. యాపిల్ నుంచి వచ్చే తొలి ఫోల్డబుల్ ఐఫోన్ 6 అంగుళాల ఎక్స్ టర్నల్ డిస్ప్లే, 8 అంగుళాల ప్రధాన డిస్ప్లేతో వస్తుందని అంచనా వేస్తున్నారు.