iDreamPost

యాపిల్ నుంచి బడ్జెట్ ఇయర్ బడ్స్.. ఈ ధర మీరు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేసుండరు!

Budget Apple Earbuds: మామూలుగా యాపిల్ ప్రొడక్ట్స్ అంటేనే కాస్ట్లీగా ఉంటాయి. దానికున్న బ్రాండ్ వాల్యూ కారణంగా ఎంత రేటు ఉన్నా సరే యాపిల్ పరికరాలను కొనేవారు ఉంటారు. అయితే బడ్జెట్ లేక ఆగిపోయేవారు చాలా మంది ఉంటారు. అలాంటి వారి కోసం యాపిల్ కంపెనీ బడ్జెట్ లో సరికొత్త ప్రాడెక్ట్ ని తీసుకొచ్చింది. 

Budget Apple Earbuds: మామూలుగా యాపిల్ ప్రొడక్ట్స్ అంటేనే కాస్ట్లీగా ఉంటాయి. దానికున్న బ్రాండ్ వాల్యూ కారణంగా ఎంత రేటు ఉన్నా సరే యాపిల్ పరికరాలను కొనేవారు ఉంటారు. అయితే బడ్జెట్ లేక ఆగిపోయేవారు చాలా మంది ఉంటారు. అలాంటి వారి కోసం యాపిల్ కంపెనీ బడ్జెట్ లో సరికొత్త ప్రాడెక్ట్ ని తీసుకొచ్చింది. 

యాపిల్ నుంచి బడ్జెట్ ఇయర్ బడ్స్.. ఈ ధర మీరు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేసుండరు!

యాపిల్ కంపెనీ తయారుచేసే ఉత్పత్తులన్నీ ఖరీదైనవిగానే ఉంటాయి. ఎందుకంటే ఆ కంపెనీ మెయింటెయిన్ చేసే క్వాలిటీ అటువంటిది. మ్యాక్ సిస్టం, మ్యాక్ బుక్, ఐఫోన్ నుంచి ఆఖరుకి చెవిలో పెట్టుకునే ఇయర్ బడ్స్ వరకూ కూడా అన్నీ అధిక ధరలోనే ఉంటాయి. యాపిల్ ఇయర్ బడ్స్ కొనాలంటే కనీసం 20 వేలు పెట్టుబడి పెట్టాలి. ఈ బడ్జెట్ తో ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కోవచ్చురా అని డ్రాప్ అయిపోయే మిడిల్ క్లాస్ వారు ఎంతోమంది ఉన్నారు. షర్టు, ప్యాంటు మ్యాచింగ్ ఎలా అయితే ఉండాలని అనుకుంటామో.. అలా ఐఫోన్ కి యాపిల్ కంపెనీ చేసిన ఇయర్ బడ్స్ ఉంటేనే ఆ ఫీల్ ని ఎక్స్ పీరియన్స్ చేయగలుగుతారు. కానీ ఏం చేస్తాం.. మిడిల్ క్లాస్ వారికి అందని యాపిల్ అయిపోయింది కదా అని అనుకుంటే పొరపాటే.

ఇప్పుడు యాపిల్ కంపెనీ కూడా బడ్జెట్ లో ఇయర్ బడ్స్ ని తీసుకొచ్చింది. బీట్స్ సోలో బడ్స్ పేరుతో ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ ని కొత్తగా లాంఛ్ చేసింది. ఇది నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది. మ్యాటీ బ్లాక్, స్టార్మ్ గ్రే, ఆర్క్టిక్ పర్పుల్, ట్రాన్స్పరెంట్ రెడ్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రత్యేకత ఏంటంటే.. ఈ ఇయర్ బడ్స్ కి మీ ఐఫోన్, ఐపాడ్, ట్యాబ్లెట్, ల్యాప్ టాప్ వంటి యాపిల్ పరికరాల ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. కేవలం యాపిల్ పరికరాలతోనే కాకుండా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్ టాప్ వంటి వాటితో కూడా ఈ ఇయర్ బడ్స్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే 18 గంటల బ్యాటరీ బ్యాకప్ వస్తుంది.

దీనిలో ఉన్న ఫాస్ట్ ఫ్యూయల్ ఫీచర్ తో 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే గంట సేపు మ్యూజిక్ వినచ్చు. మిగతా ఇయర్ బడ్స్ తో పోలిస్తే దీని కేస్ చిన్నదిగా ఉంటుంది. కాల్ క్వాలిటీ కోసం ఇందులో అడ్వాన్స్డ్ నాయిస్ లెర్నింగ్ అల్గారిథంని యూజ్ చేశారు. ఇది యాపిల్ ఫోన్స్ కి, ఆండ్రాయిడ్ ఫోన్స్ కి రెండిటికీ పని చేస్తుంది. దీని ధర రూ. 79.99 డాలర్లుగా నిర్ణయించింది కంపెనీ. మన కరెన్సీ ప్రకారం 6,674 రూపాయలు. యాపిల్ కంపెనీ నుంచి ఈ బడ్జెట్ లో ఇయర్ బడ్స్ రావడం అంటే చిన్న విషయమేమీ కాదు. మిడిల్ క్లాస్ ఆడియన్స్ ని యాపిల్ కంపెనీ బానే టార్గెట్ చేసినట్టుంది. మీరు దీన్ని యాపిల్ వెబ్ సైట్ లో కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఈ కామర్స్ వెబ్ సైట్స్ లో ఇవి అందుబాటులోకి రాలేదు. యాపిల్ వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

ఇయర్ బడ్స్ తో వచ్చేవి ఇవే:

  • బీట్స్ సోలో బడ్స్ ఇయర్ ఫోన్స్
  • ఇయర్ బడ్స్ కేస్ 
  • 4 సైజ్ ఆప్షన్స్ తో ఇయర్ టిప్స్ 
  • వారంటీ కార్డు 
  • (పవర్ అడాప్టర్, యూఎస్బీ-సి ఛార్జింగ్ కేబుల్ సెపరేట్ గా కొనుక్కోవాలి)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి