iDreamPost

రూ. 65వేల OnePlus 12 ఫోన్‌.. ఇప్పుడు రూ. 17,500కే సొంతం! ఎలాగంటే?

  • Published May 21, 2024 | 5:21 PMUpdated May 21, 2024 | 5:22 PM

ఇటీవలే మార్కెట్‌ లో వన్‌ ప్లస్‌ 12 పేరుతో అదిరిపోయే ఫీచర్లను కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజగా ఈ ఫోన్‌ పై ఇప్పుడు భారీ డిస్కౌంట్‌ తో లభిస్తుంది.

ఇటీవలే మార్కెట్‌ లో వన్‌ ప్లస్‌ 12 పేరుతో అదిరిపోయే ఫీచర్లను కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజగా ఈ ఫోన్‌ పై ఇప్పుడు భారీ డిస్కౌంట్‌ తో లభిస్తుంది.

  • Published May 21, 2024 | 5:21 PMUpdated May 21, 2024 | 5:22 PM
రూ. 65వేల OnePlus 12 ఫోన్‌.. ఇప్పుడు రూ. 17,500కే సొంతం! ఎలాగంటే?

ప్రముఖ చైనా బ్రాండ్‌ అయిన వన్‌ ప్లస్‌ సంస్థకు ఇండియాన్‌ మార్కెట్‌ లో ఉ‍న్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎ‍ప్పటికప్పుడు మార్కెట్లో సరికొత్త మోడల్స్‌ తో  ఈ వన్‌ ప్లస్‌ బ్రాండ్‌ కు చెందిన స్మార్ట్‌ ఫోన్స్‌ లాంచ్‌ అవుతుంటాయి. అయితే మొదట్లో ఈ వన్‌ ప్లస్‌ సంస్థ ప్రీమియం బడ్జెట్‌ ను టార్గెట్‌ చేసుకొని మార్కెట్‌ విడుదల చేశారు. కానీ, ఆ తర్వాత బడ్జెట్ ధరలో ఫోన్ లను లాంచ్ చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే కస్టమర్లకు హై ఫూచర్స్‌ కలిగిన ఫోన్‌ లను అతి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఇటీవలే వన్‌ ప్లస్‌ 12 పేరుతో స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ప్రీమియం సెగ్మెంట్‌లో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు. అయితే తాజాగా ఈ వన్‌ ప్లస్‌ ఫోన్‌ పై ఇప్పుడు మార్కెట్‌ లో భారీ డిస్కౌంట్‌ కే లభింస్తోంది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. వన్‌ ప్లస్‌ 12 పేరుతో రూ. 65 వేలకు లాంచ్‌ అయిన స్మార్ట్‌ ఫోన్‌ ఇప్పుడు ఏకంగా.. రూ. 17,500కి కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించారు. ఇంతకీ ఈ డిస్కౌంట్‌ను ఎలా పొందాలి.? ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? అనే  పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవలే మార్కెట్‌ లో లాంచ్‌ అయిన వన్‌ ప్లస్‌  12, 12 జీబీ, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అసలు ధర రూ. 64,999 కాగా, ఇప్పుడు  అమెజాన్‌పే ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్ కార్డుతో ఆ స్మార్ట్‌ ఫోన్‌ ను కొనుగోలు చేస్తే రూ. 3249 డిస్కౌంట్‌ను పొందొచ్చు. అలాగే అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్స్‌కు 5 శాతం క్యాష్‌బ్యాక్‌ కూడా లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 61,750కి సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా.. మీ పాత ఫోన్‌ ను ఎక్స్ఛేంజ్‌ చేసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా కూడా మీరు డిస్కౌంట్ పొందొచ్చు. అయితే ఈ ఆఫర్‌ అనేది మీ ఫోన్‌ కండిషన్‌ బట్టి గరిష్టంగా రూ. 44,250 వరకు తగ్గింపు ధరకు పొందొచ్చు. ఇలా చూసుకుంటే.. ఈ ఫోన్‌ ను మీరు రూ. 17,500కే సొంతం చేసుకోవచ్చు.

ఇక వన్‌ప్లస్‌ 12స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.82 ఇంచెస్‌తో కూడిన క్యూహెచ్‌డీ+ ఎల్‌టీపీఓ ప్రో ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేను అందించారు. అలాగే 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ కూడా కలదు. దీనితో పాటు 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ను అందించారు. పైగా ఇందులో 64 ఎంపీ రెయిర్‌ కెమెరాను, 32 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ను అందించారు. మొత్తం మీద ఈ ఫోన్‌ కు 5400 ఎంఏహెచ్‌ బ్యాటరీ కూడా పొందవచ్చు. ఇకపోతే 80 వాట్స్‌ సూపర్‌వూక్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు, 50 వాట్స్‌ ఎయిర్‌వూక్‌ ఛార్జింగ్‌కు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. మరి, వన్‌ ప్లస్‌ 12 స్మార్ట్‌ ఫోన్‌ భారీ డిస్కౌంట్‌ కు లభించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి