iDreamPost
android-app
ios-app

వైఫై వాడేవారికి అలర్ట్.. ఇలా చేయకపోతే మీ ఇంటర్నెట్ డేటా అంతా వృధానే!

Alert For Wi-Fi Users: వైఫై ఇంటర్నెట్ అనేది ఈరోజుల్లో చాలా మంది వాడుతున్నారు. ఈ ఇంటర్నెట్ కోసం వాడే వైఫై రౌటర్లతో ప్రమాదం పొంచి ఉంది. వీటిలో ఈ వైఫై రౌటర్ల వల్ల డేటా వృధా అవుతుందని.. హ్యాకింగ్ కి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని సెర్ట్-ఇన్ తెలిపింది.

Alert For Wi-Fi Users: వైఫై ఇంటర్నెట్ అనేది ఈరోజుల్లో చాలా మంది వాడుతున్నారు. ఈ ఇంటర్నెట్ కోసం వాడే వైఫై రౌటర్లతో ప్రమాదం పొంచి ఉంది. వీటిలో ఈ వైఫై రౌటర్ల వల్ల డేటా వృధా అవుతుందని.. హ్యాకింగ్ కి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని సెర్ట్-ఇన్ తెలిపింది.

వైఫై వాడేవారికి అలర్ట్.. ఇలా చేయకపోతే మీ ఇంటర్నెట్ డేటా అంతా వృధానే!

ఈరోజుల్లో ఇంట్లో చాలా మంది వైఫై ఇంటర్నెట్ వాడుతున్నారు. అయితే ఇంటర్నెట్ ప్రొవైడర్ ఏదైనా గానీ చాలా మంది ఉపయోగించే వైఫై రౌటర్స్ మాత్రం ఎక్కువగా టీపీ-లింక్ కి చెందినవే ఉంటాయి. అయితే ఈ టీపీ-లింక్ రౌటర్లలో ప్రధాన భద్రతా లోపం ఉన్నట్టు కనుగొన్నారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) టీపీ-లింక్ రౌటర్లలో లోపం ఉందని హెచ్చరించింది. యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మొజిల్లా వంటి కంపెనీల సాఫ్ట్ వేర్లలో భద్రతా లోపాలను గుర్తించడంలో ప్రసిద్ధి చెందిన సెర్ట్-ఇన్.. ఈసారి కూడా టీపీ-లింక్ రౌటర్స్ లో ఉన్న పెద్ద లోపాన్ని కనుగొన్నారు. ఈ రౌటర్స్ లో ‘ఆర్ఎఫ్ టెస్ట్’ అనే ఫైల్ వల్ల లోపం ఏర్పడిందని.. దీని కారణంగా రౌటర్ లో నెట్ వర్క్ అనేది దెబ్బ తింటుందని సెర్ట్-ఇన్ తెలిపింది.

దీన్ని బయట వ్యక్తులు ఎవరైనా నియంత్రించవచ్చునని.. పాస్ వర్డ్ కూడా అవసరం లేదని తెలిపింది. ఈ లోపాన్ని అలుసుగా చేసుకుని హ్యాకర్స్ ఎవరైనా మీ రౌటర్ ని తమ సొంతం చేసుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ లోపం ‘C5400X(EU)_V1_1.1.7 బిల్డ్ 20240510 కంటే ముందు టీపీ-లింక్ ఆర్చర్ మోడల్స్ లో ఉందని సెర్ట్-ఇన్ పేర్కొంది. దీని వల్ల మీకు ఇంటర్నెట్ సరిగా రాదు. మీ ఇంటర్నెట్ డేటా దొంగిలించబడుతుంది. నెల తిరిగేసరికి మీరు ఇంటర్నెట్ వాడకపోయినా గానీ బిల్లు మాత్రం తడిసి మోపుడవుతుంది. 

లోపానికి పరిష్కారం:

  • వీలైనంత త్వరగా రౌటర్ కి సంబంధించి లేటెస్ట్ సాఫ్ట్ వేర్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి. కంపెనీలు రెగ్యులర్ గా సాఫ్ట్ వేర్ అప్డేట్స్ ని విడుదల చేస్తాయి. ఇలా చేస్తే రౌటర్ లో ఉన్న భద్రతా లోపాలు పోతాయి.
  • మరీ ముఖ్యంగా రౌటర్ తో వచ్చే డీఫాల్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ని మార్చాలి. పాస్వర్డ్ బలహీనంగా కాకుండా స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకోవాలి. 
  • WPA3 లేదా WPA2 వంటి ఎన్క్రిప్షన్ ని ఉపయోగించడం వల్ల మీ వైఫై నెట్వర్క్ భద్రతను బలోపేతం చేసుకోవచ్చు. దీని వల్ల మీ డేటాని ఎవరూ హ్యాక్ చేయలేరు.              
  • అలానే రౌటర్ రిమోట్ మేనేజ్మెంట్ ఫీచర్ ని ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే బయట వ్యక్తి ఎవరూ కే ఊదా రౌటర్ సెట్టింగ్స్ ని మార్చలేరు. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి