iDreamPost
android-app
ios-app

Airtel: ఎయిర్‌టెల్‌ సూపర్‌ ప్లాన్‌.. ఒక్క రీఛార్జ్‌తో కుటుంబం మొత్తం వాడుకోవచ్చు

  • Published May 29, 2024 | 3:27 PM Updated Updated May 29, 2024 | 3:27 PM

జియో పోటీని తట్టుకోవడం కోసం ఎయిర్‌టెల్‌ కూడా రకరకాల ప్లాన్స్‌ అమలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా కుటుంబం మొత్తానికి సరిపోయేలా ఒకే రీఛార్జ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఆ వివరాలు..

జియో పోటీని తట్టుకోవడం కోసం ఎయిర్‌టెల్‌ కూడా రకరకాల ప్లాన్స్‌ అమలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా కుటుంబం మొత్తానికి సరిపోయేలా ఒకే రీఛార్జ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఆ వివరాలు..

  • Published May 29, 2024 | 3:27 PMUpdated May 29, 2024 | 3:27 PM
Airtel: ఎయిర్‌టెల్‌ సూపర్‌ ప్లాన్‌.. ఒక్క రీఛార్జ్‌తో కుటుంబం మొత్తం వాడుకోవచ్చు

జియో రాకతో టెలికాం రంగంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు లిమిటెడ్‌ డేటా, టాక్‌ టైమ్‌ అందించిన కంపెనీలు జియో దెబ్బతో దిగి రాక తప్పలేదు. టెలికాం రంగంలో ఎదుదు లేని కంపెనీగా ఉన్న ఎయిర్‌టెల్‌ కూడా రీఛార్జ్‌ ప్లాన్స్‌లో మార్పులు చేయాల్సి వచ్చింది. ఇక వోడా ఫోన్‌ వంటి కంపెనీలు అయితే మార్కెట్‌లో నిలబడలేకపోయాయి. ఇక కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం.. ఎప్పటికప్పుడు పోటీని పెంచడం కోసం జియో రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ తీసుకొస్తుంది. ఇక ఈ పోటీని తట్టుకునేందుకు ఎయిర్‌టెల్‌ కూడా తన రీఛార్జ్‌ ప్లాన్స్‌లలో అనేక మార్పులు చేస్తుంది. ఇప్పటికే సరికొత్త ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ తీసుకువచ్చిన ఎయిర్‌టెల్‌.. ఇపుడు ఫ్యామిలీ రీఛార్జ్‌ ప్లాన్స్‌ తీసుకువచ్చింది. కుటుంబం మొత్తానికి అతి తక్కువ ధరలో ఫ్రీ కాలింగ్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ వంటి సౌకర్యాలు అందిస్తోంది. ఆ ప్లాన్స్‌ గురించి వివరాలు మీ కోసం..

ఒక్క రీఛార్జ్‌ ప్లాన్‌తో కుటుంబం మొత్తం ప్రయోజనాలు పొందేలా ఎయిర్‌టెల్‌ సరికొత్త ప్యాక్‌లను తీసుకు వస్తుంది. దీనిలో భాగంగా.. రూ. 1,499, రూ. 999, రూ. 599ల కింద ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్, ఫ్యామిలీ రీఛార్జ్ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్లాన్‌కు ఒక్కో రకమైన బెనిఫిట్స్‌ ఉన్నాయి. ఇవన్ని నెల రోజుల వ్యాలిడిటీని కలిగి ఉన్నాయి. ఆ వివరాలు..

రూ.1499 ఫ్యామిలీ రీఛార్జ్‌ ప్లాన్

ఎయిర్‌టెల్‌ ప్రవేశపెట్టిన అద్భుతమైన ప్లాన్‌.. రూ.1499. ఇది పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ రీఛార్జ్ ప్లాన్. దీన్ని రీఛార్జ్ చేసుకుంటే.. మరో ఐదు ఇతర ఫోన్‌ నంబర్లు కూడా ఈ ప్రయోజనాలు పొందవచ్చు. వీరందరికి అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్, రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లతో పాటు 200జీబీ వరకు డేటా రోల్‌ఓవర్ ఫెసిలిటీ పొందవచ్చు. వీటితో పాటుగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ కూడా పొందవచ్చు. ఈ 1499 రీఛార్జ్‌ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ వెర్షన్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు. అంతేకాక అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మెంబర్‌షిప్‌ కూడా లభిస్తుంది. అయితే, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ సబ్‌స్క్రిప్షన్‌ మాత్రం కేవలం ఆరు నెలల వరకు మాత్రమే వర్తిస్తుంది.

రూ. 999 పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌..

రూ. 999 ఎయిర్‌టెల్ ఫ్యామిలీ ప్లాన్‌ను రీఛారజ్‌ చేసుకుంటే మీరు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు లేదా వేరే మొబైల్‌ నంబర్లను యాడ్‌ చసుకోవచ్చు. అంటే ఈ ప్లాన్‌లో మొత్తంగా, మీరు 4 సిమ్ములపై ప్రయోజనాలు పొందుతారు. ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ కూడా అన్ లిమిటెడ్ కాలింగ్‌, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు , కుటుంబ సభ్యులకు 100జీబీ + 30జీబీ యాడ్-ఆన్, హ్యాండ్‌సెట్ రక్షణ, 6 నెలల పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, వింక్‌ ప్రీమియం, 1 సంవత్సరం పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ వంటి ఓటీటీ ప్రయోజనాలను కలిగి ఉంది.

రూ. 599 పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌..

రూ. 599 ఎయిర్‌టెల్ ఫ్యామిలీ రీఛార్జ్‌ ప్లాన్‌ 1 కుటుంబ సభ్యుడికే వర్తిస్తుంది. అంటే ఈ రీఛార్జ్‌లో మీరు కేవలం రెండు సిమ్ములకే ప్రయోజనాలు పొందుతారు. ఈ ప్లాన్‌లో కూడా మీరు అన్ లిమిటెడ్ కాల్‌లు, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, ప్రతి కుటుంబ సభ్యునికి 75జీబీ + 30జీబీ యాడ్-ఆన్, హ్యాండ్‌సెట్ రక్షణ, 6 నెలల పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, వింక్‌ ప్రీమియం, డిస్నీ+హాట్‌ స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు పొందుతారు.