iDreamPost
android-app
ios-app

బ్లర్ ఫోటోలను క్లారిటీగా మార్చే ఏఐ సాఫ్ట్‌వేర్.. ఏడాది పాటు ఫ్రీగా వాడేసుకోవచ్చు

Aiarty Image Enhancer Which Converts Blur To More Quality Pics: మీ దగ్గర లోక్వాలిటీ ఇమేజెస్ ఉన్నాయా? ఎప్పుడో మీ కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలు ఉన్నాయా? అయితే వాటిని ఇప్పుడు ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టు హై క్వాలిటీ ఇమేజెస్ గా మార్చుకోవచ్చు. ఒకప్పుడు మీ ఫోన్స్ లో కెమెరా క్వాలిటీ లేక ఫోటోలు సరిగా రాకపోయి ఉండవచ్చు. ఆ ఫోటోలని ఇప్పుడు హై క్వాలిటీ పిక్స్ గా మార్చుకోవచ్చు.

Aiarty Image Enhancer Which Converts Blur To More Quality Pics: మీ దగ్గర లోక్వాలిటీ ఇమేజెస్ ఉన్నాయా? ఎప్పుడో మీ కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలు ఉన్నాయా? అయితే వాటిని ఇప్పుడు ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టు హై క్వాలిటీ ఇమేజెస్ గా మార్చుకోవచ్చు. ఒకప్పుడు మీ ఫోన్స్ లో కెమెరా క్వాలిటీ లేక ఫోటోలు సరిగా రాకపోయి ఉండవచ్చు. ఆ ఫోటోలని ఇప్పుడు హై క్వాలిటీ పిక్స్ గా మార్చుకోవచ్చు.

బ్లర్ ఫోటోలను క్లారిటీగా మార్చే ఏఐ సాఫ్ట్‌వేర్.. ఏడాది పాటు ఫ్రీగా వాడేసుకోవచ్చు

ఇప్పుడంటే క్వాలిటీ కెమెరాలతో కూడిన స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి కానీ ఒకప్పుడు స్మార్ట్ ఫోన్స్ లో కెమెరాలు అంత అద్భుతంగా ఏం ఉండేవి కాదు. దీంతో ఫోటోలు ఇప్పటితో పోలిస్తే అప్పటివి తక్కువ రిజల్యూషన్ లో ఉండేవి. ఆ ఫోటోలను ఇప్పటికి తగ్గట్టు హై రిజల్యూషన్ లో మార్చుకుంటే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది చాలా మందికి. బ్లర్ ఫోటోలను, నాయిస్ ఫోటోలను ఎక్కువ క్లారిటీ ఫోటోలుగా మార్చుకునేందుకు ఆన్ లైన్ లో చాలా సాఫ్ట్ వేర్లు, టూల్స్ ఉన్నాయి గానీ అవేమీ ఫ్రీగా రావడం లేదు. ఫ్రీ వెర్షన్ లో రోజుకు ఇన్ని ఫోటోలే అన్న లిమిట్ ఉంది. అయితే ఇప్పుడు చెప్పబోయే సాఫ్ట్ వేర్ మాత్రం వీటన్నిటికీ భిన్నం. ఈ సాఫ్ట్ వేర్ లో ఒకేసారి గంటకు 3 వేల ఫోటోలను క్లారిటీగా మార్చుకోవచ్చు. 

ఐయార్టీ ఇమేజ్ ఎన్‌హ్యాన్సర్ సాఫ్ట్ వేర్ ఉంది. 4 ఇన్ 1 ఏఐ ప్రాసెసింగ్ పవర్ ఫుల్ సాఫ్ట్ వేర్. డీనాయిసింగ్, డీబ్లరింగ్, అప్ స్కేలింగ్/రీస్టోరింగ్, డీటెయిల్ జనరేషన్ ఇలా 4 రకాల పవర్ ఫుల్ ఫీచర్స్ తో ఈ సాఫ్ట్ వేర్ అందుబాటులో ఉంది. ఒకే ఒక్క క్లిక్ తో మీరు నాయిస్ ఇమేజెస్ ని, బ్లర్డ్ ఇమేజెస్ ని హై క్వాలిటీ రిజల్యూషన్ తో పొందవచ్చు. క్వాలిటీ కోల్పోయిన ఇమేజెస్ కి క్వాలిటీ రీస్టోర్ చేసుకోవడానికి, క్వాలిటీ కోల్పోకుండా ఇమేజ్ సైజ్ ని పెంచుకోవడం, ఈ ప్రాసెస్ లో ఇమేజ్ కి సంబంధించిన వివరాలు ఏవీ మిస్ కాకుండా జనరేట్ చేసుకోవడానికి ఈ సాఫ్ట్ వేర్ బాగా ఉపయోగపడుతుంది. ఏకంగా 32కే రిజల్యూషన్ సైజులో ఇమేజెస్ ని క్లారిటీగా కన్వర్ట్ చేస్తుంది. మనం ఇంకా 4కే, 8కే దగ్గరే ఆగిపోతే ఈ ఐయార్టీ సాఫ్ట్ వేర్ బాబు ఏకంగా 32కే రిజల్యూషన్ తో బ్లర్డ్ ఇమేజెస్ ని కన్వర్ట్ చేసి ఇస్తున్నాడు.

ఎక్కువ డీటెయిల్స్ తో, స్మూత్ గా, రియల్ ఫోటోలుగా కన్వర్ట్ చేస్తుంది. దీని కోసం మీకు గొప్ప ఎడిటింగ్ స్కిల్స్ అవసరం లేదు. జస్ట్ అప్లోడ్ చేసి వదిలేస్తే చాలు.. దాని పని అది చూసుకుంటుంది. గంటలో 3 వేల ఫోటోలను కన్వర్ట్ చేస్తుంది. ఈ సాఫ్ట్ వేర్ ని డౌన్ లోడ్ చేసుకోవాలంటే మీ కంప్యూటర్ ఎన్విడియా, ఏఎండీ, ఇంటెల్, సీపీయూ జీపీయూలని సపోర్ట్ చేసేది అయి ఉండాలి. మామూలుగా దీని ధర 85 డాలర్లు ఉంది. మన కరెన్సీ ప్రకారం 7 వేలు పైనే. అయితే ప్రస్తుతం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ. అధికారిక వెబ్ సైట్ లో ఫ్రీ ట్రైల్ అని ఉంటుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకుంటే లైసెన్స్ రాదు. ‘లైసెన్స్ గివ్ ఎవే’ కింద ఉన్న సాఫ్ట్ వేర్ ని డౌన్ లోడ్ చేసుకుంటేనే ఫ్రీగా ఏడాది పాటు అన్ని ఫీచర్స్ ని వాడుకోవచ్చు.  డౌన్ లోడ్ చేసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి