iDreamPost
android-app
ios-app

ఫ్యూచర్‌లో మీరు ఎలా ఉంటారో చూపించే AI టూల్! ఆపై లక్ష్యం చేరేలా సాయం

  • Published Jun 06, 2024 | 8:05 PM Updated Updated Jun 06, 2024 | 8:05 PM

AI Tool: భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. భవిష్యత్తులో ఎలా ఉంటామో చూసుకోవాలని ఒక డ్రీమ్ ఉంటుంది. అయితే ఈ ఏఐ టూల్ సాయంతో మీరు భవిష్యత్తులో ఎలా ఉంటారో చూసుకోవచ్చు. అంతేకాదు.. మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం ఈ ఏఐ టూల్ మీకు ప్రతి దశలోనూ సహకరిస్తుంది.

AI Tool: భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. భవిష్యత్తులో ఎలా ఉంటామో చూసుకోవాలని ఒక డ్రీమ్ ఉంటుంది. అయితే ఈ ఏఐ టూల్ సాయంతో మీరు భవిష్యత్తులో ఎలా ఉంటారో చూసుకోవచ్చు. అంతేకాదు.. మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం ఈ ఏఐ టూల్ మీకు ప్రతి దశలోనూ సహకరిస్తుంది.

ఫ్యూచర్‌లో మీరు ఎలా ఉంటారో చూపించే AI టూల్! ఆపై లక్ష్యం చేరేలా సాయం

ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే దిశానిర్దేశం చేసేవాళ్ళు ఉండాలి. ఒకప్పుడు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఇలా చేయాలి, అలా చేయాలి.. పలానా దాంట్లో గ్రోత్ ఉంటుంది అని చెప్పేవారు. వారి సలహాలు, సూచనలు బాగా పని చేసేవి. చాలా మంది పెద్దల సలహాలతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. కానీ ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు లేవు. సలహాలు ఇచ్చేవారు లేరు. దీంతో పిల్లలకి సలహాలు, సూచనలు ఇచ్చేవారు కనుమరుగయ్యారు. తల్లిదండ్రులకి ఆఫీస్ పనులతోనే టైం సరిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల భవిష్యత్తుకి దిశా నిర్దేశం చేసేందుకు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ రాబోతుంది. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాం? ఫ్యూచర్ తో మాట్లాడుకునేలా.. మాసూచూ సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో ఒక టూల్ ని డెవలప్ చేశారు. ఆ టూల్ ద్వారా భవిష్యత్తుతో మాట్లాడవచ్చు. 

ఈ చాట్ బాట్ లో యూజర్లు తమ గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో పాటు లక్ష్యం ఏంటో చెప్పాలి. ఫోటో అప్లోడ్ చేస్తే భవిష్యత్తులో ఎలా ఉంటారో అనేది ఒక ఇమేజ్ లో చూపిస్తుంది. అంటే మీరు పోలీస్ అవుదాం అని అనుకుంటే కనుక మిమ్మల్ని పోలీస్ డ్రెస్ లో చూపిస్తుంది. అంతేకాదు మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ఆధారంగా చాట్ బాట్ నుంచి సలహాలు, సూచనలు పొందవచ్చు. అంటే లక్ష్యాన్ని ఎలా అందుకోవాలి? గమ్యాన్ని ఎలా చేరుకోవాలి? అని ఏఐ టూల్ మీకు దిశా నిర్దేశం చేస్తుంది. చాట్ బాట్ అంచనాలు ఇక్కడ ముఖ్యం కాకపోయినా.. తమ భవిష్యత్తు గురించి ఆలోచించడానికి ఇది ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

భవిష్యత్తు గురించి ఆలోచించడం.. దానికి అనుగుణంగా వారి ప్రవర్తనలో మార్పులు తెచ్చుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఓపెన్ ఏఐ జీపీటీ 3.5 ఆధారంగా దీన్ని రూపొందించామని.. ఇది యూజర్లు ఇచ్చిన ఇన్పుట్ ఆధారంగా సమాధానం ఇస్తుందని అన్నారు. అయితే సమాచారంలో ప్రామాణికత ఆధారంగా చాట్ బాట్ సమాధానం ఉంటుందని పరిశోధకులు తెలిపారు. తప్పుడు సమాచారం ఇస్తే ఫలితాలు ఆశించిన మేర ఉండకపోవచ్చునని అన్నారు. మొత్తం 344 మందిపై ప్రాథమికంగా ప్రయోగాలు నిర్వహించగా.. ఆశించిన మేర ఫలితాలు వచ్చినట్లు తెలిపారు.