iDreamPost
android-app
ios-app

AI టెక్నాలజీ ఎఫెక్ట్.. 30 వేల మంది ఉద్యోగులకు గూగుల్ గుడ్ బై..!

టెక్నాలజీ అనేది ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది. ఈ టెక్నాలజీలో భాగంగా వచ్చి చేరింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. పనులు సాఫీగా, సులువుగా సాగిపోతుండటంతో పలు సంస్థలు ఏఐ టెక్నాలజీ వైపు చూస్తున్నాయి. దీంతో..

టెక్నాలజీ అనేది ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది. ఈ టెక్నాలజీలో భాగంగా వచ్చి చేరింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. పనులు సాఫీగా, సులువుగా సాగిపోతుండటంతో పలు సంస్థలు ఏఐ టెక్నాలజీ వైపు చూస్తున్నాయి. దీంతో..

AI టెక్నాలజీ ఎఫెక్ట్.. 30 వేల మంది ఉద్యోగులకు గూగుల్ గుడ్ బై..!

సాంకేతిక ఎంత అభివృద్ధి చెందితే.. అన్ని ఉద్యోగాలు పోతాయా? టెక్నాలజీ ఉద్యోగాలకు ఎసరు పెడుతుందా అనే ప్రశ్నలకు కొంత మంది సాంకేతిక నిపుణులు అలాంటివి ఏమీ లేవని చెబుతున్నారు. అవన్నీ పుకార్లు అని కొట్టిపడేస్తున్నారు. భయం చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. కానీ చెబుతున్న మాటలకు, వాస్తవంలో జరుగుతున్న దానికి పొంతన ఉండటం లేదు. ఎందుకంటే ప్రముఖ ఇంజిన్ సంస్థ గూగుల్‌లో కృత్రిమ మేధ కారణంగా భారీ స్థాయిలో ఉద్యోగాలు పోనున్నాయట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని చాట్ జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్ మన్ ఆందోళన వ్యక్తం చేసినట్లే జరుగుతుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల పనులు చకచకా, సులువుగా జరిగిపోతుంటంతో పెద్ద పెద్ద టెక్ కంపెనీలన్నీ ఈ సాంకేతికను వినియోగిస్తున్నాయి. దీంతో గూగుల్ కూడా దీనిపై దృష్టిసారించింది. ఏఐ వినియోగించనుంది. ఇందులో భాగంగా సుమారు 30 వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో గూగుల్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సేల్స్ రంగంలో ఏఐ వినియోగించడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నందున అటుగా అడుగులు వేస్తోంది. ఆ రంగంలో ఏఐని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీంతో ఆ రంగంలో పనిచేసే ఉద్యోగులపై ప్రభావం పడనుంది. ఇప్పటికే యాడ్స్ క్రియేషన్‌ను ఆటోమేటిక్ గా రూపొందించేందుకు PMax ఏఐ ఆధారిత టూల్స్ వినియోగిస్తోంది గూగుల్.

దీని కారణంగా కంపెనీ వార్షిక ఆదాయం పెరిగింది. ఏఐ సామర్థ్యంతో పాటు ఉద్యోగుల అవసరం తగ్గడంతో గూగుల్‌కు భారీగా లాభాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో మరిన్ని రంగాల్లో ఏఐ సాంకేతికను ఉపయోగించాలని గూగుల్ నిర్ణయించడంతో కంపెనీ ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉంది. గత ఏడాది సుమారు 12 వేల మందిని ఇంటికి పంపించేసింది సదరు టెక్ సంస్థ. ఆర్థికవ్యవస్థలో మార్పుల కారణంగా లేఆఫ్స్ తప్పలేదని సీఈవో సుందర్ పిచాయ్ ఇటీవల పేర్కొన్నారు. ఇప్పుడు దీన్ని కూడా అన్ని రంగాల్లోకి తీసుకువస్తే.. కచ్చితంగా జాబ్స్ పై పెద్ద ప్రభావమే చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని భావిస్తే.. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.