iDreamPost

అమ్మాయిలు జాగ్రత్తా.. మీకు కూడా ఇలా జరగోచ్చు

  • Published Jun 23, 2024 | 3:10 PMUpdated Jun 23, 2024 | 3:10 PM

ఏఐ వల్ల ఎన్ని లాభాలున్నాయో.. నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇక సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే వాళ్లు.. మరీ ముఖ్యంగా ఆడవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆ వివరాలు..

ఏఐ వల్ల ఎన్ని లాభాలున్నాయో.. నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇక సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే వాళ్లు.. మరీ ముఖ్యంగా ఆడవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆ వివరాలు..

  • Published Jun 23, 2024 | 3:10 PMUpdated Jun 23, 2024 | 3:10 PM
అమ్మాయిలు జాగ్రత్తా.. మీకు కూడా ఇలా జరగోచ్చు

టెక్నాలజీ పెరిగే కొలది మనకి అన్నీ పనులు ఈజీ అయిపోయాయి. కాని ఇప్పుడు అదే టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్డ్ అయ్యే కొలది ప్రమాదంగా మారింది. అందులోను AI డెవలప్ అయిన తరవాత ఏది నిజం? ఏది అబద్దం? కూడా అర్ధం కావడం లేదు. ఎందుకంటే AIతో జరుగుతున్న మోసాలు, దారుణాలు ఇలా ఉన్నాయి. రష్యాకి ఉక్రెయిన్ కి వార్ జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఒల్గా లోయెక్ అనే 21 ఇయర్స్ ఉక్రెయిన్‌ అమ్మాయి, పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఒక స్టూడెంట్. లాస్ట్ ఇయర్ నవంబర్‌లో, ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి, తన సబ్స్క్రైబర్స్ కి కంటెంట్ క్రియేట్ చేసి ఇస్తుంది. మంచి ఫోల్లోవర్స్, వ్యూస్ అన్ని వస్తున్నాయి, కాని సడన్ గా ఆమె లైఫ్ లో ఒకటి జరిగింది.

ఆమె రష్యాలో రోడ్ మీద క్యాండీ (పిచు మిట్హాయి) అమ్ముతున్నట్టు, అది కూడా తను ఒక రష్యన్ అని, చైనా రష్యాకి ఈ వార్ లో సపోర్ట్ చేస్తునందుకు థాంక్స్’చెప్తున్నట్లుగా ఆ వీడియోలో. ఆ వీడియో చూడగానే తను షాక్ అయిపొయింది. ఏంటి నాలాగానే ఉన్నా అమ్మాయా? అనుకుంది ముందు. కాని రోజులు గడిచే కొద్ది తన యుట్యూబ్ ఛానల్ కన్నా కూడా, ఆ వీడియోకే ఎక్కువ వ్యూస్ రావడం మొదలయ్యింది. ఆ వీడియో పెట్టిన అకౌంట్‌కి ఫాలోవర్స్‌ కూడా ఒల్గా లోయెక్ యుట్యూబ్ ఛానల్ ని దాటేశారు.. అందరూ కూడా ఆ వీడియో లో ఉన్నది ఒల్గా లోయెక్ అని కామెంట్స్ చేస్తున్నారు. అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో అర్ధం కాని ఒల్గా లోయెక్ పోలీసులని అప్రోచ్ అయ్యింది. అప్పుడు తెలిసింది అసలు మేటర్..

ఒక ఒల్గా లోయెక్ వీడియో నే కాదు ఇంకా చాలా మంది వీడియోస్ ఇలా సోషల్ మీడియాలో ఉన్నాయి అని, కాని నిజానికి ఆ వీడియోలు ఏవి కూడా ఒరిజినల్ వి కాదు, డీప్ ఫేక్ టెక్నాలజీ ఇంకా జెనరేటివ్ AIని వాడి, ఇలా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండి, ఫొటోస్ అండ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వారి డేటా ని తీసుకుని, ఈ డీప్ ఫేక్ టెక్నాలజీతో వీడియోని మార్ఫ్ చేసి, సోషల్ మీడియాలో పెడుతున్నారు. అయితే నిజానికి ఇదంతా చేస్తుంది రష్యా అనుకున్నారు మొదట్లో, కాని ఇదంతా చేస్తుంది చైనా.

చైనా ఎప్పుడూ కూడా టూ ఫేసెస్ తో ఉంటుంది. పైకి ఫ్రెండ్ షిప్ చేసినట్టే చేసి వెనకాల నుండి ఏం చెయ్యాలో అది చేస్తూ ఉంటుంది చైనా. రష్యాకి సపోర్ట్ ఇచ్చినట్టే ఇచ్చి, చైనా రష్యాకి సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్స్ అనే వార్ ప్రాపగాండాతో ఈ ఫేక్ వీడియోస్ ని తయారు చేస్తుంది. అయితే ఇలాంటి వాటి నుండి మనలిని మనం సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. ఆడవాల్లు మరింత జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న అన్ని టాప్ కంపెనీస్ కూడా సొంత AIలను తయారు చేసుకుంటున్నాయి, ఈ ప్రాసెస్ లో AIకి ట్రైనింగ్ ఇవ్వాలి అంటే దానికి చాలా డేటా కావాలి. ఇక్కడ డేటా అంటే ఫోటోలు, వీడియోలు, టెక్స్ట్ ఇలాంటివి. ఆ డేటా కోసం ఆన్లైన్ లో ఆక్టివ్ గా ఉండి వారి ఫొటోస్ ని షేర్ చేస్తారు కదా, ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ ని తీసుకుని సదరు కంపెనీస్ తయారు చేసే AI టూల్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నాయి.

అందకని ముందు మీ సెక్యూరిటీ సిస్టంని స్ట్రాంగ్ చేసుకోండి, ప్రైవసీ పాలసీస్, ప్రైవేటు లో పెట్టుకోవడం వంటివి చెయ్యండి.. లేదంటే పూర్తిగా డిలీట్‌ చేయడం బెటర్‌ అని అంటున్నారు. AIకి ట్రైన్ ఏ కదా చేసేది మన డేటాతో తప్పేంటి? అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే, ఎందుకంటే AI వలన మంచి ఎంత ఉందో, చెడు కూడా అంతే ఉంది. మిమ్మలిని వాంటెడ్ గా ఇలాంటి ఫేక్ వీడియోస్ ద్వారా క్రైమ్ లో ఇరికించొచ్చు, ఇంకో పక్క AIని వాడి న్యూడ్ వీడియోస్ కూడా డిజైన్ చేస్తున్నారు. అందులో పొరపాటున మన ఫేస్ ఉంటే ఇంకా ఆడవాళ్ళ ఆత్మహత్యలు పెరుగుతాయ్.. ఇలాంటివి జరగకుండా ముందు జాగ్రత్తగా మీరు మీ సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్‌లో తొలగించండి. 2026 నాటికి కచ్చితంగా ఈ AI టూల్స్ మీద చాలా నియమాలని పెడతం అని అన్ని దేశాల ప్రభుత్వాలు చెప్తున్నాయి. చూడాలి మరి ముందు ముందు ఈ టెక్నాలజీ ద్వారా ఉపయోగపడే పనులు చేస్తామో లేక, దారుణాలు చూస్తామో అని..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి