Vinay Kola
Emergency: మనం ఆపదలో ఉన్నప్పుడు ఒక యాప్ సాయంతో సాయం పొందవచ్చు. ఆ యాప్ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది.
Emergency: మనం ఆపదలో ఉన్నప్పుడు ఒక యాప్ సాయంతో సాయం పొందవచ్చు. ఆ యాప్ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది.
Vinay Kola
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా క్రైమ్స్ ఎలా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజుకి ఏదో ఒక క్రైమ్ సీన్ వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా మహిళలకు భద్రత లేకుండా పోయింది. వారిపై అఘాయిత్యాలు ఆగట్లేదు. దేశంలో ప్రస్తుతం మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. పని ప్రదేశాలు, దూర ప్రాంత ప్రయాణాలు, ఇతర ప్రాంతాల్లో మహిళల భద్రత కోసం ప్రభుత్వం చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఓ యాప్ ని తీసుకొచ్చింది. ఈ యాప్ వల్ల సకాలంలో ఆపద కాలంలో మహిళలకు సాయం అందుతుంది. ఎందుకంటే ఈ యాప్ హోంశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇంతకీ ఆ యాప్ ఏంటి? అదెలా పని చేస్తుంది? దాని వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆ యాప్ పేరు 112 India యాప్. ఈ యాప్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ రెన్పాన్స్ అందిస్తుంది. ఇది ప్రమాదంలో ఉన్నవారికి, లేదా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అత్యవసర సమయాల్లో సాయం అందేలా చేస్తుంది. ముఖ్యంగా మహిళల సేఫ్టీకి ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది. మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు ఇందులో సింగిల్ బటన్ నొక్కితే చాలు మీరు సేఫ్ ఐపోతారు. ఈ యాప్ లో చాలా కేటగిరీలు ఉంటాయి. సపోజ్ మీరు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా ఏమైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు ఈ యాప్ లో పోలీస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ని నొక్కారంటే చాలు 5 నుంచి 10 నిమిషాల్లో పోలీసులు మీరు ఉన్న లొకేషన్ కి వచ్చేస్తారు. ఇందులో హెల్ప్ అని మీరు ఒక్క బటన్ నొక్కడం ద్వారా మీ సమాచారం మీ లొకేషన్ తో సహా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కి వెళ్ళిపోతుంది. దాంతో వారు మీ సమాచారాన్ని లొకేషన్ ని దగ్గరలో ఉన్న పోలీసులకు అందిస్తారు. దాంతో వెంటనే పోలీసులు మీ వద్దకు వస్తారు మిమ్మల్ని సేవ్ చేస్తారు.
ఒకవేళ మీకు ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగినా ఎమర్జెన్సీ టీం వచ్చి మిమ్మల్ని రక్షిస్తుంది. అలాగే ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగినా లేదా ఇంకేమైనా ప్రమాదాలు జరిగినా ఈ యాప్ సాయంతో సమాచారం ఇవ్వవచ్చు. దాంతోపాటు 112 నంబర్‌కు కూడా ఎమర్జెన్సీ కాల్ చేయవచ్చు. ఇలా ఈ యాప్ తో మీకు కావాల్సిన సాయం అందుతుంది. ఈ యాప్ లో వాయిస్ కాల్, SOS బటన్, SMS, ప్యానిక్ బటన్ ద్వారా అత్యవసర సాయం కోరవచ్చు. ఈ 112 ఇండియా యాప్ ఆండ్రాయిడ్, iOS యాప్‌లలో అందుబాటులో ఉంది. కాబట్టి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రాణాలను రక్షించుకోండి. ఇక ఈ 112 ఇండియా యాప్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.