Rohit Sharma: రోహిత్ చెప్పిన ఆ ఒక్క మాట వల్లే ఇదంతా సాధ్యమైంది: ద్రవిడ్

టీమిండియాకు ప్లేయర్​గా, కెప్టెన్​గా అపూర్వ సేవలు అందించిన రాహుల్ ద్రవిడ్.. కోచ్​గానూ తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాడు. అతడి శిక్షణలో జట్టు టీ20 వరల్డ్ కప్-2024 టైటిల్​ను ముద్దాడింది.

టీమిండియాకు ప్లేయర్​గా, కెప్టెన్​గా అపూర్వ సేవలు అందించిన రాహుల్ ద్రవిడ్.. కోచ్​గానూ తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాడు. అతడి శిక్షణలో జట్టు టీ20 వరల్డ్ కప్-2024 టైటిల్​ను ముద్దాడింది.

టీమిండియాకు ప్లేయర్​గా, కెప్టెన్​గా అపూర్వ సేవలు అందించిన రాహుల్ ద్రవిడ్.. కోచ్​గానూ తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాడు. అతడి శిక్షణలో జట్టు టీ20 వరల్డ్ కప్-2024ను ముద్దాడింది. అతడి కోచింగ్​లో టీమ్ వన్డే ప్రపంచ కప్-2023 ఫైనల్​కు చేరుకుంది. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ ఫైనల్స్​కూ చేరింది. ఈ రెండు మార్లు టైటిల్​ను అందుకోవడంలో విఫలమైంది. అయితే ఈసారి మాత్రం దాన్ని తిరగరాసింది. తాజాగా ముగిసిన పొట్టి కప్పులో విజేతగా నిలిచింది రోహిత్ సేన. కొన్నేళ్ల నుంచి టీమ్​తో ట్రావెల్ చేస్తున్న మిస్టర్ కూల్.. ఎట్టకేలకు టీమ్​కు కప్పు అందించాడు. కోచ్​గా అతడికి ఇదే ఆఖరి టోర్నమెంట్ కావడంతో అంతా ఎమోషనల్ అవుతున్నారు. ద్రవిడ్​ సేవల్ని మిస్సవుతామని అంటున్నారు.

కోచ్​గా ద్రవిడ్​ ఎప్పుడో తప్పుకోవాల్సింది. గత ఏడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్​ ముగిశాక అతడు తన బాధ్యతల నుంచి పక్కకు జరగాల్సింది. బీసీసీఐతో ఉన్న కాంట్రాక్ట్ అక్కడితో పూర్తవడంతో తాను తప్పుకుంటానని ద్రవిడ్ చెప్పాడు. అయితే టీ20 వరల్డ్ కప్​కు అట్టే టైమ్ లేకపోవడంతో బోర్డు పెద్దలు అప్పటివరకు కొనసాగమని నచ్చజెప్పడంతో ఓకే అన్నాడు. అలా ద్రవిడ్ కంటిన్యూ అవడం, అతడి కోచింగ్​లోనే మెగాటోర్నీలో టీమ్ ఛాంపియన్స్​గా నిలవడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచ కప్ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన మాటల్ని తాజాగా ద్రవిడ్ గుర్తుచేసుకున్నాడు. ఆ రోజు హిట్​మ్యాన్ చెప్పిన ఆ ఒక్క మాట వల్లే ఇదంతా సాధ్యమైందన్నాడు. పొట్టి కప్పు ముగిసే వరకు కోచ్​గా కొనసాగమని రోహిత్ అని ఉండకపోతే ఇదంతా జరిగేది కాదంటూ అసలు విషయం బయటపెట్టాడు ద్రవిడ్. ఆ మాట అంతా మార్చేసిందన్నాడు.

‘గతేడాది నవంబర్​లో రోహిత్ నాకు కాల్ చేశాడు. కోచ్​గా కంటిన్యూ అవ్వాలని అడిగాడు. అందుకు అతడికి కృతజ్ఞతలు’ అని ద్రవిడ్ తెలిపాడు. కోచ్​గా ద్రవిడ్ కొనసాగడంలో బోర్డు పెద్దల పాత్రే ఉందని, వాళ్లు రిక్వెస్ట్ చేయడం వల్లే అతడు టీమ్​తో ఉండిపోయాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే హిట్​మ్యాన్ కంటిన్యూ అవ్వమంటూ చేసిన మాట వల్లే అతడు ఇప్పటిదాకా టీమ్​తో ట్రావెల్ చేశాడని క్లారిటీ వచ్చేసింది. ఇక, కోచ్​గా తప్పుకోవడంపై ద్రవిడ్ స్పందిస్తూ.. తనకు మాటలు రావట్లేదని, ఈ ప్రయాణంలో సహకరించిన వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్పాడు. టీమ్​లోని ప్రతి ఒక్కరితో కలసి పని చేయడం సంతోషంగా, గర్వంగా ఉందన్నాడు. ఈ టోర్నీ మొత్తం ప్లేయర్లు తమ బెస్ట్ ఇచ్చారని, ఈ మూమెంట్స్ జీవితాంతం గుర్తుండిపోతాయని పేర్కొన్నాడు. మరి.. ద్రవిడ్​ కోచింగ్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments