iDreamPost
android-app
ios-app

Virat Kohli: కోహ్లీని ఫిట్ నెస్ కా బాప్ అనేది ఇందుకే! వీడియో చూస్తే వావ్ అనాల్సిందే!

  • Published Jul 02, 2024 | 2:23 PM Updated Updated Jul 02, 2024 | 2:23 PM

ప్రపంచ క్రికెట్ లో ఫిట్ నెస్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చే ఒకే ఒక్క ప్లేయర్ టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. తాజాగా అతడు ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ప్రపంచ క్రికెట్ లో ఫిట్ నెస్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చే ఒకే ఒక్క ప్లేయర్ టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. తాజాగా అతడు ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

  • Published Jul 02, 2024 | 2:23 PMUpdated Jul 02, 2024 | 2:23 PM
Virat Kohli: కోహ్లీని ఫిట్ నెస్ కా బాప్ అనేది ఇందుకే! వీడియో చూస్తే వావ్ అనాల్సిందే!

క్రికెట్.. పూర్తి శారీరక శ్రమతో కూడుకున్న ఆట. అందుకే ఈ ఆటకు ఫిట్ నెస్ ఎంతో ముఖ్యం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఏ విభాగంలో చూసుకున్నా.. బాడీ ఫిట్ గా ఉండటం ఎంతో ముఖ్యం. ఇక ప్రపంచ క్రికెట్ లో ఫిట్ నెస్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చే ఒకే ఒక్క ప్లేయర్ టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. బ్యాటింగ్ లో ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో.. ఫీల్డింగ్ లో అతకంటే అగ్రెసివ్ గా మెరుపు వేగంతో చిరుతపులిలా కదులుతూ ఉంటాడు. ఆ విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూస్తే మీరు కూడా వావ్ అనాల్సిందే.

విరాట్ కోహ్లీ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది.. టీమిండియా రన్ మెషిన్, రికార్డుల రారాజు, ఫిట్ నెస్ కా బాప్. క్రికెట్ లో ఫిట్ నెస్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పేరు విరాట్ కోహ్లీది. అంతలా తనదైన ముద్ర వేశాడు ఈ స్టార్ ప్లేయర్. అయితే విరాట్ గ్రౌండ్ లో చేసే విన్యాసాల గురించి మనకు తెలుసు. కానీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ చిరుత పులి చేసే విన్యాసాలు చూశారా? అందులోనే కొన్ని మైండ్ బ్లోయింగ్ దృశ్యాలు ఉన్నాయి. తాజాగా విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న పాత వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?

ఫీల్డింగ్ కోచ్ ఐదుగురు చొప్పున ఒక్కో టీమ్ ను విడగొట్టాడు. ఒక్కొక్కరికి మూడు బంతులు అంటే టీమ్ కు 15 బంతులు ఇచ్చాడు. ఫీల్డింగ్ చేస్తూ.. ఆ బాల్స్ ను వికెట్, వాటర్ బాటిల్, ఫుట్ బాల్ ఇలా కొద్ది దూరంలో పెట్టిన ఆరు టార్గెట్లను కొట్టాలి. ఇలా అందరు ఆటగాళ్లు పరిగెత్తుకుంటూ వచ్చి.. బాల్స్ తో వాటికి త్రో చేశారు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ ఇలా అందరూ వచ్చి త్రో చేశారు. కానీ వారిలో ఒక్కరివి కూడా వాటికి తగల్లేదు. ఇక విరాట్ కోహ్లీ వంతు వచ్చింది. తనకే సాధ్యమైన చిరుత పులి వేగంతో వేగంగా బాల్ ను అందుకున్న విరాట్ తన మూడు ఛాన్స్ లను గురి చూసి టార్గెట్ కు కొట్టాడు. దాంతో అక్కడున్న ప్లేయర్లంతా చప్పట్లు కొట్టారు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారాడంతో.. విరాట్ కోహ్లీని ఫిట్ నెస్ కా బాప్ అంటార్రా బాబు అంటూ ఫ్యాన్స్ కితాబిస్తున్నారు. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by chiku editz (@chiku.planet)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş