Nidhan
ఆఫ్ఘానిస్థాన్ మ్యాచ్ భారత్‌కు అన్ని విధాలుగా హెల్ప్ అయింది. ఈ విక్టరీతో ఇన్నాళ్లుగా వేధిస్తున్న 3 చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరికింది.
ఆఫ్ఘానిస్థాన్ మ్యాచ్ భారత్‌కు అన్ని విధాలుగా హెల్ప్ అయింది. ఈ విక్టరీతో ఇన్నాళ్లుగా వేధిస్తున్న 3 చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరికింది.
Nidhan
సూపర్-8 స్టార్ట్ అవకముందు భారత జట్టుపై విమర్శకులకే కాదు.. సొంత అభిమానులకు కూడా ఎన్నో అనుమానాలు ఉండేవి. లీగ్ స్టేజ్‌లో బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అవ్వడం, బౌలింగ్‌లో పేసర్లు తప్ప స్పిన్నర్లు అంతగా ప్రభావం చూపించకపోవడం, ఆల్‌రౌండర్లు బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించినా బ్యాటింగ్‌లో సత్తా చాటకపోవడం బిగ్ వర్రీగా మారింది. వరుస విజయాలు సాధిస్తున్నా ఏదో మూల టీమ్ సరిగ్గా ఆడటం లేదనే టెన్షన్ ఫ్యాన్స్‌లో ఉండేది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడటం, టీ20 క్రికెట్ స్టైల్లో టీమ్ గేమ్ లేకపోవడంతో నాకౌట్ స్టేజ్‌లో చేతులెత్తేయడం పక్కా అనే సందేహాలు చుట్టుముట్టాయి. అయితే వాటన్నింటినీ ఒక్క విజయంతో పటాపంచలు చేసింది రోహిత్ సేన.
ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన సూపర్ పోరులో 47 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసిన టీమిండియా.. తమపై వస్తున్న అన్ని డౌట్స్‌కు చెక్ పెట్టింది. ఎలాంటి టెన్షన్ అక్కర్లేదని, ఇక కప్పు మనదేననే భరోసాను అభిమానులకు ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు రాణించడం, ఫీల్డింగ్‌లో కూడా టీమ్ కలసికట్టుగా అదరగొట్టడంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. సరిగ్గా గమనిస్తే.. ఆఫ్ఘాన్‌పై గెలుపుతో 3 చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరికేసింది. అందులో మొదటిది విరాట్ కోహ్లీ ఫామ్. గ్రూప్ దశ మ్యాచుల్లో అతడు దారుణంగా నిరాశపర్చడంతో బిగ్ మ్యాచెస్‌లో అయినా రాణిస్తాడా అనే క్వశ్చన్స్ వచ్చాయి. అయితే నిన్నటి మ్యాచ్‌లో కింగ్ చాలా పాజిటివ్‌గా బ్యాటింగ్ చేశాడు. 24 బంతుల్లో 24 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇందులో ఒక బిగ్ సిక్స్ ఉంది.
క్రీజులో ఉన్నంత సేపు డిఫరెంట్ షాట్స్ ఆడుతూ అలరించాడు కోహ్లీ. మ్యాంగో మ్యాచన్ నవీనుల్ హక్ బౌలింగ్‌లో అతడు కొట్టిన స్ట్రయిట్ సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. పట్టుదలతో అతడు బ్యాటింగ్ చేసిన తీరు చూస్తుంటే నెక్స్ట్ మ్యాచెస్‌లో అపోజిషన్ టీమ్స్‌కు దబిడిదిబిడి అనే చెప్పాలి. ఇక, నిన్నటి మ్యాచ్‌లో మరో ప్రశ్నకూ జవాబు లభించింది. టీ20ల్లో వైవిధ్యమైన షాట్లు ఆడటం ముఖ్యం. అందునా విండీస్ లాంటి స్లో పిచ్‌లపై క్విక్‌గా రన్స్ చేయాలంటే వినూత్నమైన షాట్లు కొట్టడం తప్పనిసరి. ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ లాంటి టీ20 స్పెషలిస్ట్‌లు ఫామ్ అందుకున్నారు. నిన్నటి మ్యాచ్‌లో వాళ్లు కొట్టిన పలు డిఫరెంట్ షాట్లకు ప్రత్యర్థి జట్టుకు మైండ్‌బ్లాంక్ అయింది. ఇక ఆఫ్ఘాన్ మ్యాచ్‌తో దొరికిన ఆఖరి సమాధానం స్పిన్నర్ల పెర్ఫార్మెన్స్. నిన్నటి మ్యాచ్‌లో మన స్పిన్నర్లు 4 వికెట్లు తీశారు. కరీబియన్ వికెట్లపై ఎలా బౌలింగ్ చేస్తారోననే భయాన్ని పోగొట్టి.. మ్యాచ్‌లు గెలిపిస్తామనే భరోసా ఇచ్చారు. ఇలా ఒకే మ్యాచ్‌తో కోహ్లీ ఫామ్, టీ20లకు తగ్గట్లు డిఫరెంట్ షాట్స్ ఆడటం, స్పిన్నర్ల సక్సెస్‌కు సంబంధించి భారత్‌కు జవాబులు దక్కాయి.