Nidhan
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌లో అదరగొట్టిన మిస్టర్ 360.. రషీద్ ఖాన్‌కు నిద్రపట్టకుండా చేసే రికార్డును అచీవ్ చేశాడు.
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌లో అదరగొట్టిన మిస్టర్ 360.. రషీద్ ఖాన్‌కు నిద్రపట్టకుండా చేసే రికార్డును అచీవ్ చేశాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024లో భాగంగా ఆఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న సూపర్-8 పోరులో సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. గ్రూప్ దశ ఆఖర్లో టచ్‌లోకి వచ్చిన మిస్టర్ 360.. అదే జోరును ఆఫ్ఘాన్ల మీద చూపించాడు. ఇవాళ్టి మ్యాచ్‌లో తొలి బంతి నుంచే అతడు బాదడం మొదలుపెట్టాడు. 28 బంతులు ఎదుర్కొన్న ఈ డాషింగ్ బ్యాటర్ 5 బౌండరీలు, 3 సిక్సుల సాయంతో 53 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు.
సూర్యకుమార్ ఓ రేర్ ఫీట్ నమోదు చేశాడు. ఆఫ్ఘాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌కు నిద్రపట్టకుండా చేసే రికార్డును అతడు అచీవ్ చేశాడు. టీ20 క్రికెట్లో రషీద్ బౌలింగ్‌లో ఒక్కసారి కూడా ఔట్ అవకుండా 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా సూర్య నిలిచాడు. అతడి కంటే ముందు డీఆర్సీ షార్ట్ (76 బంతుల్లో 113), షేన్ వాట్సన్ (73 బంతుల్లో 108) రషీద్ బౌలింగ్‌లో 100 మార్క్‌ను అందుకున్నారు. ఇప్పుడు సూర్య ఆ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాడు. రషీద్ బౌలింగ్‌లో 100 పరుగుల మార్క్‌ను చేరడానికి సూర్యకు కేవలం 64 బంతులే పట్టాయి. వరల్డ్ టాప్ బ్యాటర్స్‌ను వణికించే రషీద్.. పొట్టి ఫార్మాట్లో సూర్యను మాత్రం ఒక్కసారి కూడా ఔట్ చేయలేకపోయాడు. ఇవాళ కూడా అతడిపై భారత స్టార్ డామినేషన్ నడిచింది.
SKY now becomes the third batter in T20s to score 100 or more runs vs Rashid Khan without a single dismissal at the moment.
1) D’Arcy Short 113*(76)
2) Shane Watson 108*(73)
3) SKY 102*(64) #INDvsAFG— Peeyush Sharma (@peeyushsharmaa) June 20, 2024