iDreamPost
android-app
ios-app

వీడియో: కోహ్లీ కళ్లు చెదిరే సిక్స్.. ఈ షాట్ మళ్లీ మళ్లీ చూడాల్సిందే!

IND vs AFG Match- Virat Kohli Classic Six: బార్బడోసే వేదికగా టీమిండియా- ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సిక్సర్ తో క్రికెట్ ఫ్యాన్స్ కు కన్నుల పండుగ చేశాడు. ఆ షాట్ ని మీరు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు.

IND vs AFG Match- Virat Kohli Classic Six: బార్బడోసే వేదికగా టీమిండియా- ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సిక్సర్ తో క్రికెట్ ఫ్యాన్స్ కు కన్నుల పండుగ చేశాడు. ఆ షాట్ ని మీరు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు.

వీడియో: కోహ్లీ కళ్లు చెదిరే సిక్స్.. ఈ షాట్ మళ్లీ మళ్లీ చూడాల్సిందే!

పొట్టి ప్రపంచ కప్ 2024లో అసలు సిసలైన మ్యాచులు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. సూపర్ 8లో ఇప్పటికే 2 మ్యాచులు ముగిశాయి. ఇప్పుడు భారత్- ఆఫ్గనిస్తాన్ వంతు వచ్చింది. బార్బడోస్ వేదికగా భారత్- ఆఫ్గనిస్తాన్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. మొదట్లో కాస్త తడబడినట్లు కనిపించింది. కెప్టెన్ రోహిత్ శర్మ.. 13 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే తర్వాత కోహ్లీ- పంత్ కాస్త దూకుడు ప్రదర్శించారు. అటాకింగ్ బాధ్యత పంత్ తీసుకున్నాడు. హ్యాటిక్ ఫోర్లతో శభాష్ అనిపించుకున్నాడు. అటు కోహ్లీ కాస్త సమంయమనం పాటిస్తూ వచ్చాడు. కానీ, ఆగి ఆగి ఒక షాట్ కొట్టాడు.. అది ఈ మ్యాచ్ కే హైలెట్ అని చెప్పచ్చు.

బార్బడోస్ లో స్లో పిచ్ మీద టీమిండియా కాస్త తడబడినట్లే కనిపిస్తోంది. 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి కేవలం 79 పరుగులు మాత్రమే చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ పెవిలియన్ చేరిన తర్వాత కాస్త నిదానంగానే ఆడారు. ఆ తర్వాత కోహ్లీ- పంత్ ఇద్దరూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఈ సీజన్లో కోహ్లీ కాస్త తడబడుతూనే వచ్చాడు. కానీ, ఈ మ్యాచ్ లో మాత్రం కాస్త పర్వాలేదు అనిపించాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 24 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, నవీన్ ఉల్ హక్ వేసిన బంతిని కోహ్లీ సిక్సర్ కొట్టిన తీరు అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. కోహ్లీ పాకిస్తాన్ మీద జరిగిన మ్యాచ్ లో కొట్టిన సిక్సర్ ఎలా అయితే హైలెట్ అయ్యిందో ఇది కూడా అదే తరహాలో ఉంది. నిల్చున్న చోటు నుంచే బంతిని నేరుగా బౌండరీ దాటించేశాడు.

కోహ్లీ ఈ షాట్ కొట్టినప్పుడు వచ్చిన సౌండ్ కూడా మీ చెవుల్లో రీసౌండింగ్ అవుతుంది. ఎంత క్లాస్ గై కొట్టాడు అంటే.. అది చూసిన తర్వాత అందరూ కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చేసింది తక్కువ స్కోరే కావచ్చు.. కానీ, అతనిలో స్కిల్ ఎంత ఉంది అనేది ఈ షాట్ తో మరోసారి నిరూపించుకున్నాడు కోహ్లీ అంటూ విమర్శకులు కూడా పొగిడేస్తున్నారు. ఇంక పంత్ ఈ మ్యాచ్ లో కూడా తన మ్యాజిక్ చూపించాడు. కేవలం 11 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. ధనా ధన్ షాట్స్ తో కాసేపు అఫ్గాన్ బౌలర్లను బెంబేలెత్తిచాడు. స్లో పిచ్ కావడంతో బౌలర్లకు బాగా అనుకూలించే పరిస్థితి కనిపిస్తోంది. రషీద్ ఖాన్ మరోసారి ఎంత డేంజరస్ అనే విషయాన్ని నిరూపించుకున్నాడు. మరి.. కోహ్లీ కొట్టిన ఈ క్లాసిక్ షాట్ మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి