వరల్డ్ కప్ సెమీస్​కు ఆఫ్ఘాన్.. రషీద్ సేన సక్సెస్​ వెనుక కనిపించని హీరోలు!

ఆఫ్ఘానిస్థాన్ జట్టు సంచలనం సృష్టించింది. పొట్టి కప్పులో గ్రూప్ దశ దాటితే గొప్ప అనుకున్న టీమ్ కాస్తా.. ఏకంగా సెమీస్​కు దూసుకెళ్లింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో బంగ్లాదేశ్​ను చిత్తు చేసి సగర్వంగా నాకౌట్ గడప తొక్కింది.

ఆఫ్ఘానిస్థాన్ జట్టు సంచలనం సృష్టించింది. పొట్టి కప్పులో గ్రూప్ దశ దాటితే గొప్ప అనుకున్న టీమ్ కాస్తా.. ఏకంగా సెమీస్​కు దూసుకెళ్లింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో బంగ్లాదేశ్​ను చిత్తు చేసి సగర్వంగా నాకౌట్ గడప తొక్కింది.

ఆఫ్ఘానిస్థాన్ జట్టు సంచలనం సృష్టించింది. పొట్టి కప్పులో గ్రూప్ దశ దాటితే గొప్ప అనుకున్న టీమ్ కాస్తా.. ఏకంగా సెమీస్​కు దూసుకెళ్లింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో బంగ్లాదేశ్​ను చిత్తు చేసి సగర్వంగా నాకౌట్ గడప తొక్కింది. ఇవాళ జరిగిన ఈ సూపర్ పోరులో తొలుత బ్యాటింగ్​కు దిగిన ఆఫ్ఘాన్.. అన్ని ఓవర్లు ఆడి 5 వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆ టీమ్ గెలుపు కష్టమేనని అంతా భావించారు. అయితే చిన్న లక్ష్యాలను డిఫెండ్ చేయడంలో ఆరితేరిన రషీద్ సేన.. బంగ్లాను 105 పరుగులకే కుప్పకూల్చేసింది. డక్​వర్త్ లూయిస్ పద్ధతితో 8 పరుగుల తేడాతో గెలిచి సెమీస్​కు చేరుకుంది ఆఫ్ఘాన్. ఫైనల్​కు వెళ్లాలంటే సౌతాఫ్రికాను ఆ టీమ్ ఓడించాల్సి ఉంటుంది. 27వ తేదీన ఈ రెండు జట్లు తలపడనున్నాయి.

తొలిసారి వరల్డ్ కప్ సెమీస్​కు ఆఫ్ఘాన్ చేరుకోవడంతో అంతా ఆ టీమ్​ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. కెప్టెన్‌ రషీద్ ఖాన్, బ్యాటర్ గుర్బాజ్, ఆల్​రౌండర్ గుల్బదీన్, పేసర్ నవీనుల్ హక్​ను మెచ్చుకుంటున్నారు. అయితే ఆ టీమ్ అన్​సంగ్ హీరోలను మాత్రం మర్చిపోతున్నారు. కాబూల్ నుంచి కాందహార్ వరకు ఆఫ్ఘాన్ విజయాన్ని ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ గెలుపులో ప్రధానంగా ముగ్గుర్ని క్రెడిట్ ఇవ్వాలి. తొలుతగా ఆ జట్టు కోచ్​ జొనాథన్ ట్రాట్​ను మెచ్చుకోవాలి. జులై 2022లో ఆఫ్ఘాన్​కు కోచ్​గా వచ్చిన ఈ ఇంగ్లండ్ దిగ్గజం.. ఆ టీమ్ రాత మార్చేశాడు. బిగ్ టోర్నమెంట్స్​లో ఎలా ఆడాలి? మెయిన్ టీమ్స్​ను ఎలా ఓడించాలి? క్రంచ్ సిచ్యువేషన్​ను ఎలా ఫేస్ చేయాలి? అనేది రషీద్ సేనకు నేర్పించాడు. ఒత్తిడిని తట్టుకొని ఆడటం, విజయం కోసం ఆఖరి బంతి వరకు ఎలా పోరాడాలి అనేది చెబుతూ మీరు సాధించగలరంటూ ధైర్యం నూరిపోశాడు.

ట్రాట్ బాధ్యతలు చేపట్టాక ఆఫ్ఘాన్ రాత మారింది. వన్డే ప్రపంచ కప్-2023లో అదరగొట్టింది. ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్థాన్​ను మట్టికరిపించింది. ఆస్ట్రేలియాను అప్పుడే ఓడించినంత పని చేసింది. దీంతో అతడి కాంట్రాక్ట్ ముగిసినా ఇంకో ఏడాది పాటు కొనసాగించాలని డిసైడ్ అయింది ఆఫ్ఘాన్ బోర్డు. దీంతో మరింత పట్టుదలతో టీమ్​ను వెనుక నుంచి నడిపిస్తున్నాడు ట్రాట్. పొట్టి కప్పులో ఆ జట్టు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ అతడి పాత్ర ఉంది. ఇవాళ బంగ్లాతో పోరు టైమ్​లోనూ ఎంతో ఇంటెన్స్​గా కనిపించాడు. అతడి కోచింగ్ మహత్యం వల్లే ఆఫ్ఘాన్ ఇక్కడ వరకు చేరిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ టీమ్ సక్సెస్​లో ఇంకో ఇద్దరు కనిపించని హీరోలు ఉన్నారు. అందులో ఒకరు టీమిండియా లెజెండ్ అజయ్ జడేజా అయితే.. మరొకరు విండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో. వన్డే ప్రపంచ కప్ టైమ్​లో ఆఫ్ఘాన్​కు మెంటార్​గా వ్యవహరించాడు జడేజా.

మెంటార్​గా ఉంటూ భారత్​లోని పిచ్ కండీషన్స్​ను బట్టి ఎలా ఆడాలనేది ఆఫ్ఘాన్​కు నేర్పించాడు అజయ్ జడేజా. అడ్డగోలు షాట్లకు పోకుండా నిలబడితే పరుగులు ఎలా వస్తాయి అనేది చూపించాడు. అతడి సలహాలు, సూచనలతో బిగ్ టీమ్స్​ను కూడా బోల్తా కొట్టించింది ఆఫ్ఘాన్. అయితే ఇంత చేసినా అతడు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆఫ్ఘాన్ సక్సెస్ అయితే చాలని.. తనకు డబ్బులు అక్కర్లేదని చెప్పిన జడేజాకు ఆ టీమ్ ఎప్పటికీ రుణపడి ఉంటుందని అనొచ్చు. ఇక, వెస్టిండీస్ ఆల్​రౌండర్ బ్రావో టీ20 వరల్డ్ కప్​లో ఆఫ్ఘాన్​కు అన్నీ తానై నిలబడ్డాడు. పేరుకు బౌలింగ్ కోచ్ అయినా.. అన్నీ తానై నిలబడ్డాడు. కరీబియన్ దీవుల వాతావరణం, అక్కడి మైదానాల్లో ఆడాల్సిన తీరు లాంటివి నేర్పించాడు. బంగ్లాతో మ్యాచ్​ టైమ్​లో డ్రెస్సింగ్ రూమ్​లో ఉండకుండా బౌండరీ లైన్ దగ్గరికి వచ్చి రషీద్​కు అతడు సలహాలు ఇచ్చాడు. దీన్ని బట్టే అతడి డెడికేషన్ లెవల్స్, ఆఫ్ఘాన్ సక్సెస్ కోసం పడిన తపన ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇలా సొంత దేశం కాకపోయినా వీళ్లందరూ కాబూలీవాలాలకు పెద్ద దిక్కుగా నిలబడటం అభినందనీయమనే చెప్పాలి.

Show comments