iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్​లో కోహ్లీ ఫెయిలైనప్పుడు.. రోహిత్ రియాక్షన్ ఇదే: ఇండియా ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్!

  • Published Sep 13, 2024 | 7:20 PM Updated Updated Sep 13, 2024 | 7:24 PM

Rohit Sharma, Virat Kohli, T Dilip, T20 World Cup 2024: 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కపను ఇటీవల పట్టేసింది టీమిండియా. అమెరికా-వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన పొట్టి ప్రపంచ కప్​లో విజేతగా నిలిచింది. ఈ విక్టరీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సిందే.

Rohit Sharma, Virat Kohli, T Dilip, T20 World Cup 2024: 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కపను ఇటీవల పట్టేసింది టీమిండియా. అమెరికా-వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన పొట్టి ప్రపంచ కప్​లో విజేతగా నిలిచింది. ఈ విక్టరీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సిందే.

  • Published Sep 13, 2024 | 7:20 PMUpdated Sep 13, 2024 | 7:24 PM
వరల్డ్ కప్​లో కోహ్లీ ఫెయిలైనప్పుడు.. రోహిత్ రియాక్షన్ ఇదే: ఇండియా ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్!

13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్​ను ఇటీవల పట్టేసింది టీమిండియా. అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన పొట్టి ప్రపంచ కప్-2024​లో ఛాంపియన్​గా నిలిచింది. ఈ విక్టరీలో ప్లేయర్లు అందరితో పాటు ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మకు, అలాగే టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. హిట్​మ్యాన్ అటు బ్యాటర్​గా, ఇటు సారథిగా జట్టును అద్భుతంగా నడిపించాడు. అటు టోర్నీ ఆసాంతం ఫెయిలైనా ఫైనల్స్​లో సూపర్బ్ నాక్​తో టీమ్​కు ట్రోఫీ అందించాడు కోహ్లీ. అయితే విరాట్ వరుసగా విఫలమవడంతో ఒకదశలో అందరూ భయపడ్డారు. మనం చూస్తున్నది కోహ్లీనేనా? ఐసీసీ ట్రోఫీల్లో చెలరేగి ఆడేటోడు ఇలా ఫెయిల్ అవుతున్నాడేంటని అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఫైనల్స్​లో అతడు అదరగొట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు. అసలు కోహ్లీ విఫలమైనప్పుడు రోహిత్ రియాక్షన్ ఎలా ఉందనేది ఎవరికీ తెలియదు. దీనిపై భారత ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ స్పందించాడు. వరల్డ్ కప్​లో కోహ్లీ ఫెయిల్ అయినప్పుడు హిట్​మ్యాన్ రియాక్షన్ ఏంటనేది ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో ఆయన రివీల్ చేశాడు.

వరల్డ్ కప్​లో కోహ్లీ వరుసగా విఫలమైనా అతడిపై కెప్టెన్ రోహిత్ నమ్మకం ఉంచాడని టి. దిలీప్ తెలిపాడు. బయట సిచ్యువేషన్ వేరని.. టీమ్​లో ఉండే వాతావరణం వేరు అని అన్నాడు. విరాట్​ సామర్థ్యంపై హిట్​మ్యాన్ పూర్తి భరోసాతో ఉన్నాడని చెప్పాడు. కోహ్లీ లాంటి క్యాపబుల్ ప్లేయర్ మళ్లీ దొరకడని అన్నాడని.. అంత సీనియారిటీ కొంటే వచ్చేది కాదని రోహిత్ చెప్పాడని దిలీప్ పేర్కొన్నాడు. మెల్​బోర్న్​లో పాకిస్థాన్​ మీద కింగ్ ఆడిన మర్చిపోలేని ఇన్నింగ్స్​ను గుర్తుచేశాడని చెప్పుకొచ్చాడు. కోహ్లీ చాలా స్పెషల్ అని.. అలాంటోడు టీమ్​లో ఉంటే ఆ కాన్ఫిడెన్సే వేరు అని హిట్​మ్యాన్​ తమతో చెప్పాడని తెలిపాడు.

Rohith kohli

ఇక, ప్రపంచ కప్​-2024 ఫైనల్​లో సౌతాఫ్రికా మీద కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్​లో ఓపెనర్​గా వచ్చిన విరాట్ ఆఖరి వరకు బ్యాటింగ్ చేశాడు. మొదటి ఓవర్​లో బరిలోకి దిగినోడు 19వ ఓవర్​ చివరి బంతికి ఔట్ అయ్యాడు. ఈ లోపు చేయాల్సిన పని ఫినిష్ చేసి వెళ్లాడు. 59 బంతులు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ 6 బౌండరీలు, 2 సిక్సుల సాయంతో 76 పరుగులు చేశాడు. రోహిత్ (9), రిషబ్ పంత్ (0), సూర్యకుమార్ యాదవ్ (3) ఫెయిలైనా.. అక్షర్ పటేల్ (47), శివమ్ దూబె (27) అండతో 176 పరుగుల భారీ స్కోరుకు టీమ్​ను చేర్చాడు కోహ్లీ. టోర్నీ మొత్తం ఫెయిలైనా ఫైనల్​లో యాంకర్ ఇన్నింగ్స్​తో మెరిశాడు. బాధ్యతాయుతంగా ఆడి టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టైమ్​లో రోహిత్ అతడిపై నమ్మకం ఉంచడం వల్లే ఇదంతా సాధ్యమైందని ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ చెప్పాడు.