iDreamPost
android-app
ios-app

Afghanistan: ప్రపంచ క్రికెట్​కు షాక్! ఆఫ్ఘానిస్థాన్ టీమ్​పై బ్యాన్?

  • Published Sep 14, 2024 | 9:55 PM Updated Updated Sep 14, 2024 | 10:54 PM

Afghanistan Cricket At Risk Of Ban: ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్​కు సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు వినిపిస్తున్నాయి. ఆ టీమ్​పై బ్యాన్ పడిందని అంటున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..

Afghanistan Cricket At Risk Of Ban: ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్​కు సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు వినిపిస్తున్నాయి. ఆ టీమ్​పై బ్యాన్ పడిందని అంటున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..

  • Published Sep 14, 2024 | 9:55 PMUpdated Sep 14, 2024 | 10:54 PM
Afghanistan: ప్రపంచ క్రికెట్​కు షాక్! ఆఫ్ఘానిస్థాన్ టీమ్​పై బ్యాన్?

క్రికెట్​లో చాలా టీమ్స్ ఉన్నాయి. కానీ బిగ్ టీమ్స్ అంటే ఆరేడు జట్ల కంటే ఎక్కువ కనిపించవు. చాలా దేశాలు జెంటిల్మన్ గేమ్​లోకి ఎంట్రీ ఇచ్చినా నిలబడలేకపోయాయి. కొన్ని పసికూనల్లా మిగిలిపోతే.. మరికొన్ని మాత్రం కాస్త పెద్ద స్థాయికి చేరుకున్నాయి. అయితే వీటన్నింటి కంటే ఆఫ్ఘానిస్థాన్ డిఫరెంట్ అనే చెప్పాలి. తక్కువ సమయంలోనే ఆ టీమ్ పెద్ద జట్లకు కాంపిటీషన్ ఇచ్చే స్థాయికి చేరుకుంది. నాలుగైదేళ్ల గ్యాప్​లోనే అనూహ్యంగా ఎదిగిన ఆఫ్ఘాన్ టీమ్.. ఇంగ్లండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా లాంటి జట్లను ఓడించి తాము పసికూనలం కాదని ప్రూవ్ చేసింది. టీ20 ప్రపంచ కప్​-2024లో ఏకంగా సెమీస్​కు చేరుకుని చరిత్ర సృష్టించింది. వచ్చే కొన్నేళ్లలో వరల్డ్ క్రికెట్​లో మరింత బలమైన జట్టుగా మారేందుకు పరుగులు పెడుతున్న ఆఫ్ఘాన్ గురించి షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఆ టీమ్​పై బ్యాన్ పడిందని తెలుస్తోంది. అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఆఫ్ఘానిస్థాన్​లో క్రికెట్​ను బ్యాన్ చేయాలని అక్కడి తాలిబన్ల ప్రభుత్వం నిర్ణయించినట్లు వినిపిస్తోంది. ప్రజలపై అనేక ఆంక్షలు విధిస్తున్న అక్కడి సర్కారు.. క్రీడల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తోంది. గేమ్స్​ను అస్సలు ఎంకరేజ్ చేయట్లేదు. ముఖ్యంగా మహిళలు ఎలాంటి ఆటలు ఆడకుండా నిషేధం విధించింది. ఇప్పుడు మెన్స్ గేమ్స్​ మీద కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు సమాచారం. అక్కడి సుప్రీం లీడర్ హిబతుల్లా, అకున్ జాదా ఆఫ్ఘాన్​లో క్రికెట్​పై క్రమంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే క్రికెట్​ను అధికారికంగా బ్యాన్ చేస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించలేదు. కానీ దీని గురించి క్రికెట్ వరల్డ్​లో మాత్రం చర్చలు ఊపందుకున్నాయి. అంత మంచి టీమ్​ను నిషేధించాలని చూడటం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

గత కొన్నేళ్లలో ఎందరో మంచి ప్లేయర్లను వరల్డ్ క్రికెట్​కు అందించింది ఆఫ్ఘానిస్థాన్. రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, గుల్బదీన్ నయీబ్, రెహ్మానుల్లా గుర్బాజ్ లాంటి ఆ జట్టు ఆటగాళ్లు ఎన్నో లీగ్స్​లో ఆడుతూ ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు. రషీద్ అయితే టాప్ టీ20 ప్లేయర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అతడికి భారత్​లోనూ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. టీ20లతో పాటు వన్డే క్రికెట్​లోనూ స్ట్రాంగ్​ టీమ్​గా తయారవుతోంది ఆఫ్ఘాన్. వన్డే వరల్డ్ కప్-2023లో ఇంగ్లండ్, పాకిస్థాన్​ను ఓడించిన ఆ జట్టు.. టీ20 ప్రపంచ కప్​-2024లో మరిన్ని విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా లాంటి తోపు టీమ్​కు షాక్ ఇచ్చి సెమీస్​కు దూసుకెళ్లింది. అలాంటి ఆఫ్ఘాన్​ను బ్యాన్ చేస్తున్నారనే న్యూస్ క్రికెట్ ఫ్యాన్స్​లో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదని.. టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. మరి.. ఆఫ్ఘాన్ క్రికెట్​ బ్యాన్ అంటూ వస్తున్న కథనాలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.