Nidhan
Zaheer Khan Appointed As New Mentor For LSG: లక్నో సూపర్ జియాంట్స్‌కు కొత్త మెంటార్ వచ్చేశాడు. ఓ టీమిండియా దిగ్గజం ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకున్నాడు. స్పెషల్ వీడియోతో నయా మెంటార్ గురించి అనౌన్స్మెంట్ చేసింది ఎల్ఎస్జీ.
Zaheer Khan Appointed As New Mentor For LSG: లక్నో సూపర్ జియాంట్స్‌కు కొత్త మెంటార్ వచ్చేశాడు. ఓ టీమిండియా దిగ్గజం ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకున్నాడు. స్పెషల్ వీడియోతో నయా మెంటార్ గురించి అనౌన్స్మెంట్ చేసింది ఎల్ఎస్జీ.
Nidhan
ఐపీఎల్-2025కు ఇంకా చాలా టైమ్ ఉంది. మెగా ఆక్షన్ కూడా ఏడాది ఆఖర్లో జరగనుంది. కానీ ఇప్పటి నుంచే ఫ్రాంచైజీలు అలర్ట్ అవుతున్నాయి. తమకు కావాల్సిన ప్లేయర్లను అట్టి పెట్టుకోవడం, వద్దనుకున్న వారికి బైబై చెప్పడం స్టార్ట్ చేస్తున్నాయి. ఈ మేరకు వారికి సమాచారం ఇస్తున్న టీమ్స్.. కోచింగ్ స్టాఫ్‌ను కూడా మార్చేస్తున్నాయి. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ టాటా చెప్పేసింది. ఇతర జట్లు కూడా తమ కోచ్‌లు, కెప్టెన్లను మార్చే పనిలో పడ్డాయి. ఈ తరుణంలో లక్నో సూపర్ జియాంట్స్ ఫ్రాంచైజీ కీలక ప్రకటన చేసింది. తమ కొత్త మెంటార్‌గా టీమిండియా లెజెండరీ పేసర్ జహీర్ ఖాన్‌ను నియమించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది ఎల్ఎస్జీ.
లక్నోలోని యంగ్ క్రికెటర్లు బౌలింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది ఎల్ఎస్జీ. ఈ ప్లేయర్లందరూ జహీర్ ఖాన్ బౌలింగ్ యాక్షన్‌ను కాపీ చేస్తూ కనిపించారు. అతడి మాదిరిగానే పరిగెత్తుతూ జంప్ చేసి బౌలింగ్ చేశారు. ఆ తర్వాత జహీర్ భారత్ తరఫున ఆడినప్పటి విజువల్స్‌ను చూపించారు. ఆఖర్లో ఎంట్రీ ఇచ్చిన జహీర్.. లక్నోకు వచ్చేశా అని అన్నాడు. ఈ వీడియోతో పాటు మరో ఫొటోను ఎల్ఎస్జీ ఫ్రాంచైజీ షేర్ చేసింది. ఇందులో టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా 34వ నంబర్ జెర్సీని జహీర్‌కు ఇస్తూ జట్టులోకి ఆహ్వానించడాన్ని చూడొచ్చు. జహీర్ లక్నోకు మెంటార్‌గా వెళ్లడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. సరైనోడ్ని దింపారని, ఇంక ఎల్ఎస్జీకి తిరుగుండదని అంటున్నారు.
గౌతం గంభీర్‌కు సరైన రీప్లేస్మెంట్ జహీర్ అని అంటున్నారు నెటిజన్స్. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో అతడికి సుదీర్ఘ కాలం ఆడిన అనుభవం ఉందని.. అది టీమ్‌కు ఎంతో ప్లస్ చేస్తుందని చెబుతున్నారు. కూల్‌గా, కామ్‌గా తన పని తాను చేసుకుపోయే జహీర్ వల్ల ఎంతో మంది యంగ్ టాలెంట్ వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక, మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన జహీర్ తన బెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఈ పొజిషన్లో ఉన్న గంభీర్.. మెంటార్‌గా సక్సెస్ అయ్యాడు. లక్నో టీమ్‌ను బాగా నడిపించాడు. ఆ తర్వాత కేకేఆర్‌కు మెంటార్‌గా వెళ్లి అక్కడా సక్సెస్ అయి.. ఇప్పుడు టీమిండియా కోచ్‌గా బిజీగా ఉన్నాడు. గౌతీ రోల్‌లోకి వెళ్తున్నాడు కాబట్టి జహీర్‌పై అంచనాలు, ఒత్తిడి రెండూ ఉంటాయి. దీన్ని అధిగమించి అతడు టీమ్‌ను ఎలా నడిపిస్తాడో చూడాలి. మరి.. ఎల్ఎస్జీ మెంటార్‌గా జహీర్ సక్సెస్ అవుతాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
Zaheer, Lucknow ke dil mein aap bohot pehle se ho 🇮🇳💙 pic.twitter.com/S5S3YHUSX0
— Lucknow Super Giants (@LucknowIPL) August 28, 2024
Zaheer Khan once suggested Ganguly to promote Sehwag as an opener and the rest, is history.
With an eye for talent, Zak is the perfect person to mentor a young team like the LSG.
Excited to see how the talent blossom under his guidance.#ZaheerNowSuperGiant pic.twitter.com/tQ4WqFFOa3
— Johns. (@CricCrazyJohns) August 28, 2024