iDreamPost
android-app
ios-app

Zaheer Khan: టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్‌.. ఇక భారత్​కు తిరుగుండదు!

  • Published Jul 10, 2024 | 3:05 PMUpdated Jul 10, 2024 | 3:05 PM

టీమిండియా నయా హెడ్ కోచ్​గా గౌతం గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. గౌతీని జట్టులోకి ఆహ్వానిస్తూ బోర్డు సెక్రెటరీ జైషా అఫీషియల్ అనౌన్స్​మెంట్ చేశాడు.

టీమిండియా నయా హెడ్ కోచ్​గా గౌతం గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. గౌతీని జట్టులోకి ఆహ్వానిస్తూ బోర్డు సెక్రెటరీ జైషా అఫీషియల్ అనౌన్స్​మెంట్ చేశాడు.

  • Published Jul 10, 2024 | 3:05 PMUpdated Jul 10, 2024 | 3:05 PM
Zaheer Khan: టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్‌.. ఇక భారత్​కు తిరుగుండదు!

భారత క్రికెట్​లో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. టీ20 వరల్డ్ కప్​తో కోచ్ రాహుల్ ద్రవిడ్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఎప్పుడో పదవీ కాలం ముగిసినా కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ కోరడంతో పొట్టి కప్పు వరకు కొనసాగుతూ వచ్చాడు ది వాల్. టోర్నీ ముగియడం, భారత్ కప్పు నెగ్గడంతో అతడు సంతోషంగా పోస్ట్ నుంచి వైదొలిగాడు. అప్పటి నుంచి కొత్త కోచ్​కు సంబంధించి బోర్డు నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ లోపు జింబాబ్వే సిరీస్ కూడా మొదలవడంతో అనౌన్స్​మెంట్ ఆలస్యం అవ్వొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే నిన్న బీసీసీఐ సెక్రెటరీ జైషా కోచ్ పోస్ట్​ గురించి ప్రకటన చేశాడు. భారత నయా కోచ్​గా గౌతం గంభీర్​ పేరును ఆయన అనౌన్స్​ చేశాడు. టీమ్​లోకి గౌతీని ఆహ్వానిస్తూ ఆయన ఓ పోస్ట్ కూడా పెట్టాడు. బోర్డు నుంచి ఆయనకు అన్ని విధాలుగా సహకారం లభిస్తుందని తెలిపాడు.

కోచ్​గా గంభీర్ పేరును ప్రకటించడానికి ఒక రోజు ముందే మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్​ను పొగుడుతూ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో కొత్త కోచ్​ రాకకు సమయం ఆసన్నమైందని అంతా అనుకున్నారు. కొన్ని గంటల్లోనే గౌతీ బాధ్యతలు చేపట్టనున్నట్లు బీసీసీఐ నుంచి అనౌన్స్​మెంట్ వచ్చింది. కొత్త హెడ్ కోచ్​తో పాటు మొత్తం కోచింగ్ స్టాఫ్​ను మార్చేస్తోంది బోర్డు. ఇందులో భాగంగానే సపోర్ట్ స్టాఫ్​ను సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా గౌతీకి ఆప్షన్ ఇచ్చిందని తెలుస్తోంది. దీంతో తనకు నచ్చిన వారిని టీమ్​లోకి తీసుకునేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడట. ఇందులో భాగంగానే కోల్​కోతా నైట్ రైడర్స్​ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్​ను టీమిండియా కోచింగ్ స్టాఫ్​లోకి తీసుకురావాలని చూస్తున్నాడట. అలాగే బౌలింగ్ కోచ్​ బాధ్యతల్ని లెజెండ్ జహీర్ ఖాన్​ను అప్పగించాలని డిసైడ్ అయ్యాడట.

జహీర్​తో గంభీర్​ డిస్కస్ చేస్తున్నాడని.. అతడు ఓకే అంటే బీసీసీఐ పెద్దల్ని కూడా ఒప్పించి టీమిండియాలోకి తీసుకొచ్చేందుకు గంభీర్ ప్లాన్స్ వేస్తున్నాడట. జాతీయ జట్టుకు సేవలు అందించేందుకు జహీర్ కూడా ఆసక్తిగా ఉన్నాడని సమాచారం. అయితే జహీర్​తో పాటు బౌలింగ్ కోచ్ రేసులో మరో పేరు కూడా వినిపిస్తోంది. మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీని ఈ రోల్​కు తీసుకోవాలని కొందరు బోర్డు పెద్దలు భావిస్తున్నారట. జహీర్, బాలాజీల్లో ఎవరో ఒకర్ని త్వరగా కన్ఫర్మ్ చేసి శ్రీలంక సిరీస్​కు ముందే టీమ్​లోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. అలాగే బ్యాటింగ్ కోచ్​, ఫిజియోతో పాటు ఇతర సహాయక సిబ్బంది ఎంపిక ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నారట. గంభీర్ సాయంతో కోచింగ్ స్టాఫ్ సెలెక్షన్​ను ముగించాలని భావిస్తున్నారట. మరి.. జహీర్ బౌలింగ్ కోచ్​గా వస్తే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి