వరల్డ్ కప్ లో నో ఛాన్స్.. చాహల్ కీలక నిర్ణయం!

  • Author Soma Sekhar Updated - 03:55 PM, Tue - 19 December 23

రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహల్ లను పక్కకు పెట్టింది. అయితే చాహల్ కు ఆసియా కప్ లో చోటు దక్కకపోవడంతో.. వరల్డ్ కప్ లో గ్యారెంటీగా చోటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా అతడికి సెలెక్టర్లు మెుండి చేయి చూపించారు.

రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహల్ లను పక్కకు పెట్టింది. అయితే చాహల్ కు ఆసియా కప్ లో చోటు దక్కకపోవడంతో.. వరల్డ్ కప్ లో గ్యారెంటీగా చోటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా అతడికి సెలెక్టర్లు మెుండి చేయి చూపించారు.

  • Author Soma Sekhar Updated - 03:55 PM, Tue - 19 December 23

వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీ కోసం టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహల్ లను పక్కకు పెట్టింది. అయితే చాహల్ కు ఆసియా కప్ లో చోటు దక్కకపోవడంతో.. వరల్డ్ కప్ లో గ్యారెంటీగా చోటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా అతడికి సెలెక్టర్లు మెుండి చేయి చూపించారు. ఇక వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కకపోవడంతో.. చాహల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

యజ్వేంద్ర చాహల్.. లెగ్ స్పిన్నర్ గా టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. జట్టులో స్ట్రాంగ్ ప్లేయర్ గా ఉంటూ.. స్పిన్ విభాగానికి వెన్నుముకగా నిలిచిన చాహల్ కు వరల్డ్ కప్ లో మాత్రం చుక్కెదురైంది. ప్రపంచ కప్ జట్టులో అతడికి చోటు కచ్చితంగా దక్కుతుందని అందరూ భావించారు. కానీ అతడిని ఎంపిక చేయలేదు సెలెక్టర్లు. దీంతో చాహల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే? చాహల్ వరల్డ్ కప్ కు ఎంపిక కాకపోవడంతో.. ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కౌంటీ ఛాంపియన్ షిప్-2023లో భాగంగా.. ఆఖరి మూడు మ్యాచ్ ల్లో కెంట్ క్రికెట్ క్లబ్ కు చాహల్ ప్రాతినిథ్యం వహించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కౌంటీ క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ చాహల్ కు ఎన్ఓసీ కూడా మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి కెంట్ కౌంటీ క్రికెట్ క్లబ్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. ఇదిలా ఉండగా.. చాహల్ గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు బీసీసీఐ అధికారి ఒకరు. చాహల్ అవసరమైతే వెంటనే టీమిండియాలోకి వస్తాడు అని టైమ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. దీంతో వరల్డ్ కప్ ఆడేందుకు చాహల్ కు దారులు మూసుకుపోలేదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి వరల్డ్ కప్ జట్టులో చాహల్ ను ఎంపిక చేయకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments