iDreamPost
android-app
ios-app

Yuzvendra Chahal: వీడియో: RCBని దారుణంగా ట్రోల్ చేసిన చాహల్.. కోహ్లీతో ఫ్రెండ్​షిప్​ కూడా మరిచి..!

  • Published Jan 02, 2024 | 7:03 PM Updated Updated Jan 02, 2024 | 7:03 PM

టీమిండియా ఆటగాడు, రాయల్ చాలెంజర్స్ మాజీ ప్లేయర్ అయిన యుజ్వేంద్ర చాహల్ ఆర్సీబీని దారుణంగా ట్రోల్ చేశాడు. ఐపీఎల్ 2024 వేలం ముగిసిన తర్వాత రాయల్ చాలెంజర్స్ జట్టు బౌలింగ్ దళం ఎలా ఉంది అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 'మోయే మోయే' అంటూ సమాధానం ఇచ్చాడు.

టీమిండియా ఆటగాడు, రాయల్ చాలెంజర్స్ మాజీ ప్లేయర్ అయిన యుజ్వేంద్ర చాహల్ ఆర్సీబీని దారుణంగా ట్రోల్ చేశాడు. ఐపీఎల్ 2024 వేలం ముగిసిన తర్వాత రాయల్ చాలెంజర్స్ జట్టు బౌలింగ్ దళం ఎలా ఉంది అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 'మోయే మోయే' అంటూ సమాధానం ఇచ్చాడు.

  • Published Jan 02, 2024 | 7:03 PMUpdated Jan 02, 2024 | 7:03 PM
Yuzvendra Chahal: వీడియో: RCBని దారుణంగా ట్రోల్ చేసిన చాహల్.. కోహ్లీతో ఫ్రెండ్​షిప్​ కూడా మరిచి..!

ఐపీఎల్ 2024 మినీవేలం ముగియడంతో.. కొంత మంది ఆటగాళ్లు ఇతర జట్లపై కామెంట్స్ చేస్తున్నారు. కొందరు డైరెక్ట్ గా విమర్శిస్తే.. మరికొందరు ఇన్ డైరెక్ట్ గా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా టీమిండియా ఆటగాడు, రాయల్ చాలెంజర్స్ మాజీ ప్లేయర్ అయిన యుజ్వేంద్ర చాహల్ ఆర్సీబీని దారుణంగా ట్రోల్ చేశాడు. ఐపీఎల్ 2024 వేలం ముగిసిన తర్వాత రాయల్ చాలెంజర్స్ జట్టు బౌలింగ్ దళం ఎలా ఉంది అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘మోయే మోయే’ అంటూ సమాధానం ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కోహ్లీతో ఫ్రెండ్షిప్ ను కూడా మరిచి చాహల్ ఈ కామెంట్స్ చేయడం గమనార్హం.

యుజ్వేంద్ర చాహల్.. టీమిండియాకు గత కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నాడు. సెలెక్టర్లు అతడిపై మెుగ్గుచూపకపోవడంతో.. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు ఫార్మాట్ల సిరీస్ లకు కూడా ఎంపిక చేయలేదు. ఈ విషయాన్ని కొందరు మాజీ క్రికెటర్లు తప్పుపట్టారు కూడా. అయితే జట్టులో చోలు కోల్పోయిన చాహల్ విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపాడు. దీంతో తాను ప్రాతినిథ్యం వహించిన హర్యాన టీమ్ టైటిల్ ను కైవసం చేసుకుంది. తన ఫర్ఫామెన్స్ తో చాహల్ సెలెక్టర్లకు వరుసగా కౌంటర్లు ఇస్తూనే వస్తున్నాడు. అదీకాక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తనదైన శైలిలో ప్లేయర్లపై, పలు అంశాలపై స్పందిస్తుంటాడు.

తాజాగా తాను ఇదివరకు ఐపీఎల్ లో ప్రాతినిథ్యం వహించిన ఆర్సీబీ జట్టుపై దారుణమైన ట్రోలింగ్ చేశాడు చాహల్. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో చాహల్ చాలాసార్లు ఆన్ లైన్ గేమ్స్ ఆడుతు మనకు కనిపించాడు. తాజాగా ప్రముఖ ఆన్ లైన్ గేమ్ అయిన బ్యాటిల్ గ్రౌండ్స్ మోబైల్ ఇండియా గేమ్ ఆడుతున్న ఓ వ్యక్తి చాహల్ ను ఓ క్వశ్చన్ అడిగాడు. ఐపీఎల్ 2024 మినీ వేలం తర్వాత ఆర్సీబీ జట్టు బౌలింగ్ ఎటాక్ ఎలా ఉండబోతోంది? అన్న ప్రశ్నకు చాహల్ ‘మోయే మోయే’ అంటూ నవ్వుతూ ట్రోల్ చేశాడు. సెర్బియన్ సాంగ్ లో ఉన్న ఈ పదాన్ని ప్రస్తుతం మీమ్స్, ట్రోల్స్ లో విపరీతంగా వాడుతున్నారు. ఈ పదానికి ఒకానొక బాషలో ‘పీడకల’ అనే అర్దం వస్తోంది. అంటే ఆర్సీబీ జట్టు బౌలింగ్ దారుణంగా ఉందనే అర్దంలో చాహల్ ఈ విధంగా స్పందించాడా? లేక ఇంకేదైనా కారణం ఉందా? అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. విరాట్ కోహ్లీతో చాహల్ కు మంచి బాండింగ్ ఉంది. అలాంటి కోహ్లీ టీమ్ గురించి ఇలా కామెంట్స్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురించేసింది. ఐపీఎల్ మినీ వేలంలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్ లాంటి బౌలర్లను దక్కించుకోవడంలో ఆర్సీబీ విఫలం అయ్యింది. భారీ ధరకు వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ ను దక్కించుకుని అందరిని షాక్ కు గురిచేసింది. ఆక్షన్ లో సరైన బౌలర్ ను దక్కించుకోలేదనే ఉద్దేశంలోనే ఈ విధంగా ట్రోల్ చేశాడని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఆర్సీబీ నుంచి బయటకి వచ్చిన చాహల్ ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత ఐపీఎల్ సీజన్లలో యుజ్వేంద్ర చాహల్ అద్భుతంగా రాణించాడు. మరి ఆర్సీబీని చాహల్ ఇంత దారుణంగా ట్రోల్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın alCasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibom