SNP
SNP
ఆసియా కప్ 2023 కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కకపోవడంపై టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ స్పందించాడు. సాధారణంగా ఎప్పుడూ చాలా జోవియల్‌గా ఉండే చాహల్.. ఆసియా కప్ టీమ్‌లో ప్లేస్ దక్కకపోవడంపై సిరీస్‌గా రియాక్ట్ అయ్యాడు. నిజానికి టీమ్ ప్రకటించగానే.. అందులో చాహల్ పేరు లేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆసియా కప్, ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ ఈ రెండు టోర్నీలో ఉపఖండపు పిచ్‌లపై జరుగుతున్న నేపథ్యంలో ఒక స్టార్ స్పిన్నర్‌ను ఎలా పక్కనపెడతారని క్రికెట్ అభిమానులు సైతం మండిపడ్డారు. టీమ్ సెలెక్షన్‌లో ఇదొక్కటే పెద్ద మైనస్ అంటూ సోషల్ మీడియాలో సెలెక్టర్లను ఏకిపారేశారు.
జట్టులో ఒకే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. మరో స్పిన్నర్ అవసరం పడితే.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన అక్షర్ పటేల్‌ను ఆడించాలి. ఓ పేస్ బౌలర్ స్థానంలో అక్షర్‌ను ఆడిస్తే బ్యాటింగ్ ఆర్డర్‌లో డెప్త్ పెరగడంతో పాటు అదనపు స్పిన్నర్ జట్టులో చేరుతాడని సెలెక్టర్లు భావించినట్లు తెలుస్తోంది. అయితే.. తనకు ఆసియా కప్ 2023 టీమ్‌లో చోటు దక్కకపోవడంపై చాహల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో కారు మబ్బుల వెనుక ఉన్న సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు అనే అర్థం వచ్చేలా ఎమోజీ పెట్టాడు. చీకటిని చీల్చుకుంటూ సూర్యుడు ఉదయిస్తాడంటూ.. ఇన్‌డైరెక్ట్‌గా సెలెక్టర్లకు, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చాహల్ గట్టి కౌంటర్ ఇచ్చాడంటూ క్రికెట్ అభిమానులు చెప్పుకుంటున్నారు.
అయితే.. జట్టులో చాహల్‌కు చోటు ఇవ్వకపోవడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందిస్తూ.. జట్టులో ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లను తీసుకోవడం కష్టమైందని, బ్యాటింగ్ ఆర్డర్‌లో డెప్త్ పెంచేందుకే చాహల్‌ను పక్కనపెట్టాల్సి వచ్చిందని అన్నారు. చాహల్ కంటే కుల్దీప్ యాదవ్ మెరుగ్గా రాణిస్తుండటంతోనే చాహల్‌ను పక్కనపెట్టి కుల్దీప్ యాదవ్‌ను టీమ్‌లోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. చాహల్ స్థానంలో అక్షర్ ఉంటే.. టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో బలం పెరగడంలో పాటు.. కుల్దీప్‌తో కలిసి అతను స్పిన్ కూడా పంచుకుంటాడని వెల్లడించారు. ఏది ఏమైనా.. చాహల్‌ను ఎంపిక చేయకపోవడం మాత్రం సరైన నిర్ణయం కాదని క్రికెట్ అభిమానుల్లో ఎక్కువ శాతం మంది ఫీల్ అవుతున్నారు. మరి చాహల్‌ను ఎంపిక చేయకపోవడం, దానికి సెలెక్టర్లు, కెప్టెన్ ఇచ్చిన వివరణ, చాహల్ ఎమోజీ కౌంటర్ వీటిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#chahal #YuzvendraChahal #AsiaCup2023 #TeamIndia #RohitSharma pic.twitter.com/Oz8mthvG6v
— Sayyad Nag Pasha (@nag_pasha) August 22, 2023
ఇదీ చదవండి: 4.4 ఓవర్లలోనే 90 పరుగులు కొట్టేసిన గంభీర్ టీమ్!