SNP
Yuzvendra Chahal, Elon Musk, Harshal Patel: రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్.. మరో టీమిండియా క్రికెటర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. అతను అలా ఎందుకు చేశాడో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
Yuzvendra Chahal, Elon Musk, Harshal Patel: రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్.. మరో టీమిండియా క్రికెటర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. అతను అలా ఎందుకు చేశాడో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
SNP
టీమిండియా స్టార్ క్రికెటర్, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న యుజ్వేంద్ర చాహల్ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉండి ఉంటాడు. ఎందుకంటే.. చాలా కాలం తర్వాత ఇండియన్ టీ20 టీమ్‌లో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అది కూడా టీ20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీతో. ఇలాంటి మంచి సంతోషకరమైన సందర్భంలో.. మరో టీమిండియా క్రికెటర్‌పై ఫిర్యాదు చేశాడు చాహల్. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న టీమిండియా ఆటగాడు హర్షల్ పటేల్‌పై కాపీ రైట్ చర్యలు తీసుకోవాలంటూ.. ట్విట్టర్ ఓపెనర్ ఎలన్ మస్క్‌కు ట్విట్టర్ వేదికగానే ఫిర్యాదు చేశాడు. ఇంతకీ హర్షల్ పటేల్ ఏం చేశాడు? చాహల్ ఎందుకు ఫిర్యాదు చేశాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
యుజ్వేంద్ర చాహల్ గ్రౌండ్‌లో బయట చాలా సరదాగా ఉండే మనిషి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఓ సారి టీమిండియా మ్యాచ్ ఆడుతున్న సమయంలో డ్రింక్స్ అందిచే క్రమంలో బౌండరీ లైన్ వద్ద గ్రౌండ్‌పై పడుకుని.. ఓ మంచి పోజ్‌లో చాహల్ ఫొటో ఒకటి బాగా వైరల్ అయింది. అప్పటి నుంచి అది చాహల్ సెలబ్రేషన్ మార్క్ పోజ్‌గా మారిపోయింది. ఆ తర్వాత ఆ ఫొజ్‌ను చాలా మంది క్రికెటర్లు సరదాగా కాపీ చేశారు. ఇప్పుడు తాజాగా హర్షల్ పటేల్ సైతం చాహల్ పోజ్‌ను కాపీ చేశాడు. దీంతో.. తన పోజ్‌ను కాపీ కొట్టిన హర్షల్ పటేల్‌పై సరదాగా స్పందించిన చాహల్.. హర్షల్ భాయ్‌పై కాపి రైట్ వేయండి ఎలాన్ మస్క్ పాజీ అంటూ ఒక ట్వీట్ చేశాడు. అది కాస్త వైరల్ అయింది.
కాగా, ప్రస్తుతం చాహల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన చాహల్.. 13 వికెట్లు పడగొట్టి.. ఈ సీజన్‌లో టాప్ వికెట్ టేకర్ల లిస్ట్‌లో ఉన్నాడు. అది కూడా 9 ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో 11 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి.. బెస్ట్ ప్రదర్శన కనబర్చాడు. ఈ సీజన్‌లో చాహల్ చూపిస్తున్న కమిట్‌మెంట్, అద్భుతమైన బౌలింగ్ అతనికి టీ20 వరల్డ్ కప్ 2024 టీమ్‌లో చోటు కల్పించింది. చాహల్ ఎంపికతో మరోసారి టీమిండియాలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ స్పిన్ జోడి అయిన కుల్చా కాంబినేషన్ టీ20 వరల్డ్ కప్‌లో రిపీట్ కానుంది. మరి హర్షల్ పటేల్‌పై చర్యలు తీసుకోవాలని చాహల్ సరదాగా పేర్కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Dear @elonmusk paaji, Harshal bhai pe copyright lagana hai 😂🤣 pic.twitter.com/CUAeZd6uNa
— Yuzvendra Chahal (@yuzi_chahal) May 1, 2024