MS Dhoni: ధోనిని ఎప్పటికీ క్షమించను.. నా కొడుకు కెరీర్ నాశనం చేశాడు: యువరాజ్ తండ్రి

Yograj Singh Comments On MS Dhoni: మహేంద్రసింగ్ ధోని నా కొడుకు కెరీర్ ను నాశనం చేశాడు.. అతడిని ఎప్పటికీ క్షమించనని యువరాజ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశాడు.

Yograj Singh Comments On MS Dhoni: మహేంద్రసింగ్ ధోని నా కొడుకు కెరీర్ ను నాశనం చేశాడు.. అతడిని ఎప్పటికీ క్షమించనని యువరాజ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశాడు.

మహేంద్రసింగ్ ధోని.. భారత క్రికెట్ రూపురేఖలను మార్చిన ఓ యోధుడు. ఇక తన కెప్టెన్సీలో టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఘనుడు. తన బ్యాటింగ్, కెప్టెన్సీతో పాటుగా తన వ్యక్తిత్వంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ఎంతో మంది యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చాడు. అలాంటి ధోనిపై యువరాజ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ మరోసారి విమర్శలు గుప్పించాడు. ధోని వల్లే తన కొడుకు యువరాజ్ సింగ్ కెరీర్ అర్థాంతరంగా ముగిసిందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిపై మరోసారి ఘాటు విమర్శలు చేశాడు యువరాజ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్. “ధోని అద్భుతమైన, లెజెండ్ క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తన కొడుకు కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ధోనినే. అతడిని నేను ఎప్పటికీ క్షమించను. యువరాజ్ సింగ్ ఇంకో నాలుగైదు సంవత్సరాలు ఆడేవాడే. కానీ ధోని కారణంగా అర్థాంతరంగా కెరీర్ ను ముగించాడు. అతడు సపోర్ట్ చేయకపోవడం వల్లే ఇలా జరిగింది. నేను నా కుటుంబ సభ్యులు తప్పు చేసినా.. వారిని ఎప్పటికీ క్షమించను. క్యాన్సర్ తో పోరాడుతూనే నా కొడుకు క్రికెట్ ఆడి.. దేశానికి వరల్డ్ కప్ అందించినందుకు అతడికి భారత రత్న ఇవ్వాలి” అని జీస్విచ్ అనే యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

కాగా.. ధోనిపై గతంలో కూడా యోగ్ రాజ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఇక ఇప్పుడు మరోసారి తన కొడుకు కెరీర్ నాశనం అవ్వడానికి ధోనినే కారణం అంటూ సంచలన కామెంట్స్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక టీమిండియా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ లను గెలుచుకోవడంలో యువీది కీలకపాత్ర. భారత్ తరఫున 402 మ్యాచ్ లు ఆడిన యువరాజ్ 11,178 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 71 అర్థ సెంచరీలు ఉన్నాయి. మరి ధోని వల్లే తన కొడుకు కెరీర్ ముగిసిందని చెప్పిన యోగ్ రాజ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments