iDreamPost
android-app
ios-app

విరాట్‌ కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యువరాజ్‌ సింగ్‌!

  • Author Soma Sekhar Updated - 05:58 PM, Thu - 9 November 23

విరాట్ కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు యువరాజ్ సింగ్. ప్రస్తుతం ఈ కామెంట్స్ క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.

విరాట్ కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు యువరాజ్ సింగ్. ప్రస్తుతం ఈ కామెంట్స్ క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.

  • Author Soma Sekhar Updated - 05:58 PM, Thu - 9 November 23
విరాట్‌ కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యువరాజ్‌ సింగ్‌!

యువరాజ్ సింగ్.. వరల్డ్ క్రికెట్ లో నిఖార్సైన ఆల్ రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. తన ఆల్ రౌండ్ ప్రతిభతో టీమిండియా 2011 ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్రపోషించాడు. క్యాన్సర్ తో పోరాడుతూనే ఈ వరల్డ్ కప్ లో పాల్గొన్నాడు యూవీ. ఇదిలా ఉండగా.. ధోనీ, నేను బెస్ట్ ఫ్రెండ్స్ కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. తాజాగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసి న్యూస్ లోకి వచ్చాడు. ఈసారి ఏకంగా టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీపై వివాదాస్పద కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లీ చాలా బిజీ అందుకే అతడితో మాట్లాడటం లేదని చెప్పుకొచ్చాడు యువీ. మరిన్ని వివరాల్లోకి వెళితే..

క్రీడా ప్రపంచంలో యువరాజ్ సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. టీఆర్ఎస్ పాడ్ కాస్ట్ లో కోహ్లీ గురించి ఈ విధంగా మాట్లాడాడు. “విరాట్ కోహ్లీ ప్రస్తుతం చాలా బిజీ అయ్యాడు. చీకూ కాస్త విరాట్ గా మారడంతో.. అతడిలో చాలా తేడా వచ్చింది. ఇక మేమందరం కలిసి ఫిట్ టీమ్ గా మారాలని అనుకున్నాం. అయితే కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత అతడో బెంచ్ మార్క్ ను సెట్ చేశాడు. కానీ అతడి కంటే నాకే ఎక్కువ స్కిల్స్ ఉన్నాయి. కోహ్లీ తనను తాను క్రిస్టియానో రొనాల్డో అనుకుంటాడు. విరాట్ క్రికెట్ లో రోనాల్డోనే కాదనను. కానీ ఫుట్ బాల్ లో మాత్రం అతడి కంటే నేనే మెరుగైన ప్లేయర్ ని. నేను విరాట్ తో ఫుట్ బాల్ ఆడే సమయంలో ఈ విషయం తెలుసుకున్నాను” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు యువరాజ్ సింగ్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా.. 2008-2017 మధ్యకాలంలో టీమిండియా తరపున కోహ్లీ-యువీ కలిసి ఆడారు. అయితే కోహ్లీ టీమ్ లోకి వచ్చే టైమ్ కే యువరాజ్ ఇండియాలో తోపు ప్లేయర్ గా ఉన్నాడు. 2011 వరల్డ్ కప్ గెలిపించిన తర్వాత.. యువీ క్యాన్సర్ చికిత్స కోసం జట్టుకు కొంతకాలం దూరమైయ్యాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ సత్తాచాటి.. యువరాజ్ ను స్థాయిని దాటుకుని వెళ్లాడు. మరి విరాట్ పై యువరాజ్ చేసిన షాకింగ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.