iDreamPost
android-app
ios-app

ఆ మ్యాచ్ లో నా విధ్వంసకర బ్యాటింగ్ చూసి.. రిఫరీ నా బ్యాట్ చెక్ చేశాడు: యువరాజ్ సింగ్

  • Author Soma Sekhar Published - 06:22 PM, Tue - 4 July 23
  • Author Soma Sekhar Published - 06:22 PM, Tue - 4 July 23
ఆ మ్యాచ్ లో నా విధ్వంసకర బ్యాటింగ్ చూసి.. రిఫరీ నా బ్యాట్ చెక్ చేశాడు: యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్.. తన ఆల్ రౌండర్ ప్రతిభతో టీమిండియాకు చిరకాల స్వప్నం అయిన వరల్డ్ కప్ ను అందించాడు. అంతకు ముందే టీ20 వరల్డ్ కప్ ను సైతం తన బ్యాటింగ్ విధ్వంసంతో.. భారత్ అందించాడు. ఇక యువరాజ్ కు తనదైన రోజు వచ్చిందంటే.. ఏ బౌలర్ కూడా అతడిన్ని ఆపలేడు. అంతలా యువీ ఊచకోత ఉంటుంది. ఇక ఈ ఊచకోత చూసి, యూవీ బ్యాట్ లో ఏవైనా స్ప్రింగులు ఉన్నాయా? అనుమానం కలగకమానదు. ఇక ఓ మ్యాచ్ లో యూవీ విధ్వంసం చూసి మ్యాచ్ రిఫరీ వచ్చి తన బ్యాట్ ను చెక్ చేసినట్లు యువరాజ్ సింగ్ తాజాగా చెప్పుకొచ్చాడు. అది ఏ మ్యాచ్? యువీ తుపాన్ ఇన్నింగ్స్ ఏ జట్టుపైనో ఇప్పుడు తెలుసుకుందాం.

అది 2007 టీ20 వరల్డ్ కప్.. సౌతాఫ్రికా వేదికగా జరిగిన ఈ తొలి పొట్టి ప్రపంచ కప్ ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ లో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటనను గుర్తు చేసుకున్నాడు టీమిండియా మాజీ ఆటగాడు, స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. ఈ టోర్నీలో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య సెకండ్ సెమీ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ 15 రన్స్ తేడాతో ఆసీస్ పై విజయం సాధించింది. మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. జట్టులో ఉతప్ప(34), ధోని(36) పరుగులు చేయగా.. స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు.

ఈ క్రమంలోనే అతడి బ్యాట్ లో ఏమైనా స్ప్రింగులు ఉన్నాయా? అన్నంతగా.. యువీ విధ్వంసం సాగింది. కేవలం 30 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. 233 స్ట్రైక్ రేట్ తో అతడి విధ్వంసం సాగింది. ఇక యువీ ఊచకోత చూసిన మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ వచ్చి.. యువీ బ్యాట్ ను చెక్ చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. యువీ విధ్వంసంతో ఆసీస్ ను 15 పరుగుల తేడాతో ఓడించింది టీమిండియా. ఇక 2007 టీ20 వరల్డ్ కప్ భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు యువరాజ్ సింగ్. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు జరిగిన 2011 వరల్డ్ కప్ టీమిండియా గెలవడంలో కూడా యువీదే కీ రోల్.