Somesekhar
మూడు ఫార్మాట్లలో, ఈ జనరేషన్ లో ఇలాంటి ప్లేయర్ లేడు. అతడు ఈ దశాబ్దలో అన్ని రికార్డులను బద్దలుకొడతాడు అంటూ టీమిండియా స్టార్ ప్లేయర్ పై ప్రశంసలు కురిపించాడు యువరాజ్ సింగ్.
మూడు ఫార్మాట్లలో, ఈ జనరేషన్ లో ఇలాంటి ప్లేయర్ లేడు. అతడు ఈ దశాబ్దలో అన్ని రికార్డులను బద్దలుకొడతాడు అంటూ టీమిండియా స్టార్ ప్లేయర్ పై ప్రశంసలు కురిపించాడు యువరాజ్ సింగ్.
Somesekhar
ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది క్రికెటర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు. అలాంటి వారు దశాబ్దానికి ఒక్కరు ఉంటారు. ఆ ఒక్కడికే అన్ని సాధించే అర్హతలు ఉంటాయంటున్నాడు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యువీ.. టీమిండియా స్టార్ క్రికెటర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ జనరేషన్ లో ఇలాంటి ఆటగాడు లేడు.. అతడు ఈ దశాబ్దంలో అన్ని రికార్డులు బద్దలు కొడతాడు అంటూ కితాబిచ్చాడు. మరి యువీ పొగడ్తల వర్షం కురించిన ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
టీమిండియా మాజీ ఆటగాడు, స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ టీ20 వరల్డ్ కప్ 2024కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా పలు ఐసీసీ ఈవెంట్స్ లల్లో పాల్గొంటున్నాడు యువీ. ఈ సందర్భంగా టీమిండియా స్టార్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తాడు. “ఈ తరం అత్యుత్తమ బ్యాటర్ విరాట్ కోహ్లీ. మూడు ఫార్మాట్లలో అతడు అద్భుతమైన ఆటగాడు. అతడు ఈ దశాబ్దంలో అన్ని రికార్డులు బద్దలు కొడతాడు. అయితే అతడి కెరీర్ లో ఏదైనా లోటు ఉందా? అంటే.. అది వరల్డ్ కప్ మెడల్ మాత్రమే. ఇప్పటికే ఓ మెడల్ సాధించినప్పటికీ.. అతడు ఇంకా ఆకలితో, కసితో ఉన్నాడు. ఈ వరల్డ్ కప్ మెడల్ సాధించడానికి విరాట్ పూర్తిగా అర్హుడు” అంటూ కోహ్లీని ఆకాశానికి ఎత్తేశాడు.
ఈ క్రమంలోనే 2014 టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ చూపించిన అసాధారణ ప్రతిభను గుర్తుచేశాడు. ఆ టోర్నీలో కోహ్లీ అద్భుతంగా రాణించాడని కితాబిచ్చాడు యువీ. ఇదిలా ఉండగా.. యువరాజ్ ను ఉస్సేన్ బోల్ట్, క్రిస్ గేల్ తో పాటుగా టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. దాంతో అతడు పలు ఐసీసీ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న యువీ, విరాట్ పై ప్రశంసలు కురిపించాడు. మరీ ఈ జనరేషన్ లో అత్యుత్తమ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్న యువీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.