కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ సూపర్‌! కానీ వరల్డ్‌ కప్‌ విషయానికి వస్తే..: యువీ

వన్డే వరల్డ్‌ కప్‌ మహా సంగ్రామానికి రోజులు దగ్గర పడుతున్నాయి. భారత్‌ వేదికగా.. అక్టోబర్‌ 5న ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి టాస్‌ పడనుంది. ఈ టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు సంసిద్ధం అవుతున్నాయి. కప్పు గెలవడమే లక్ష్యంగా తమ వ్యూహాలకు, ప్రణాళికలకు పదును పెడుతున్నాయి. టీమిండియా సీనియర్‌ ఆటగాళ్లు టీ20లకు దూరంగా ఉంటూ.. వన్డేలపై మాత్రమే ఫోకస్‌ పెట్టారు. మరికొంత మంది కీలక ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకుంటున్నారు. అలాగే వరల్డ్‌ కప్‌ ఫేవరేట్స్‌లో ఇండియాతో పాటు ఉన్న ఆస్ట్రేలియా ఒక అడుగు ముందుకేసి.. ఏకంగా 18 మందితో కూడిన ప్రిలిమినరీ టీమే ప్రకటించింది.

ఇక మిగతా టీమ్స్‌ కూడా వరల్డ్‌ కప్‌ కోసం వాళ్లదైన పద్ధతిలో ప్రిపేర్‌ అవుతున్నాయి. అయితే.. ముఖ్యంగా టీమిండియా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. అప్పుడెప్పుడో కపిల్‌ దేవ్‌ సారథ్యంలో 1983లో తొలి సారి వన్డే వరల్డ్‌ కప్‌ నెగ్గిన టీమిండియా మళ్లీ 2011లో ధోని కెప్టెన్సీలో టీమిండియా స్వదేశంలోనే వరల్డ్‌ కప్‌ నెగ్గింది. ఆ తర్వాత 2015, 2019లో జరిగిన వరల్డ్‌ కప్స్‌లో టీమిండియా కప్ సాధించడంలో విఫలమైంది. కానీ, ఇప్పుడు మళ్లీ మన దేశంలోనే వరల్డ్‌ కప్‌ టోర్నీ జరుగుతుండటంతో క్రికెట్‌ అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. టీమిండియా విజయావకాశాలపై భాతర మాజీ క్రికెటర్‌, 2011 వరల్డ్‌ కప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచిన యువరాజ్‌ సింగ్‌ స్పందిస్తూ.. ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మంచి కెప్టెన్‌ అని కానీ, అది మాత్రమే వరల్డ్‌ కప్‌ గెలవడానికి సరిపోదని అన్నాడు. రోహిత్‌ శర్మకు మంచి టీమ్‌ కూడా కావాలి. 2011లో టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలిచింది. అప్పుడు టీమ్‌ని లీడ్‌ చేసిన ధోని మంచి కెప్టెన్‌.. అలాగే అతనికి మంచి టీమ్‌ ఉంది. అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. అందుకే ఆ వరల్డ్‌ కప్‌ గెలుపు సాధ్యమైందని అన్నాడు. ఇప్పుడు కూడా టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలవాలంటే మంచి టీమ్‌ ఉండాలని.. లేకుంటే వరల్డ్‌ కప్‌ గెలవడం కష్టమని అన్నాడు. మరి యువరాజ్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాక్‌ బౌలర్లపై రోహిత్‌ శర్మ వ్యాఖ్యలు! పెద్ద కాంట్రవర్సీ అవుతుందంటూ..

Show comments