SNP
Yuvraj Singh, Harbhajan Singh, Suresh Raina, WCL 2024: భారత మాజీ క్రికెటర్లు.. పాకిస్థాన్‌ను ఫైనల్లో చిత్తు చేసి వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ ట్రోఫీని గెలిచారు. ఆ మ్యాచ్ తర్వాత.. చేసిన వెరైటీ సెలబ్రేషన్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆ సెలబ్రేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Yuvraj Singh, Harbhajan Singh, Suresh Raina, WCL 2024: భారత మాజీ క్రికెటర్లు.. పాకిస్థాన్‌ను ఫైనల్లో చిత్తు చేసి వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ ట్రోఫీని గెలిచారు. ఆ మ్యాచ్ తర్వాత.. చేసిన వెరైటీ సెలబ్రేషన్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆ సెలబ్రేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో ఇండియా ఛాంపియన్స్ జట్టు.. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 ట్రోఫీని కైవసం చేసుకుంది. మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో శనివారం రాత్రి జరిగిన ఫైనల్‌లో భారత మాజీ క్రికెటర్లు అద్భుతంగా ఆడి.. పాక్‌ను చిత్తుగా ఓడించారు. అయితే.. ఈ గ్రాండ్ విక్టరీ తర్వాత.. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా.. చాలా వెరైటీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వారి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారి సెలబ్రేషన్స్‌కి అర్థం తెలియకపోయినా.. పాకిస్థాన్‌పై సెటైరికల్‌గానే ఆ వీడియో చేసినట్లు క్రికెట్ అభిమానులు అంటున్నారు.
ఫైనల్ మ్యాచ్ తర్వాత.. గ్రౌండ్‌లో సెలబ్రేషన్స్ అన్ని ముగించుకుని.. డ్రెస్సింగ్ రూమ్‌లోకి తిరిగి వచ్చే క్రమంలో భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా.. దెబ్బలు తగిలిన వారిలా, ముసలోళ్లలా డోర్ తీసుకొని లోపలికి వచ్చారు. వారి సెలబ్రేషన్స్ చూసి క్రికెట్ అభిమానులు సరదాగా నవ్వుకుంటున్నారు. అయితే.. ఈ సెలబ్రేషన్స్ ప్రస్తుత పాకిస్థాన్ టీమ్‌లో ఉన్న ఫాస్ట్ బౌలర్లపై సెటైర్లు వేస్తూ చేసిందా? అని కొంతమంది నెటజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ప్రతి రెండు నెలలకు ఒకసారి గాయపడుతూ ఆటకు దూరం అవుతూ.. సరైన ఫిట్‌నెస్ లేని వారిపై భారత సీనియర్లు ఈ విధంగా సెటైర్ వేసినట్లు తెలుసతఓంది. అలాగే టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచి.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వెరైటీగా వచ్చి కప్పు అందుకున్నాడు. దాన్ని ఇమిటేట్ చేసి ఫన్ జనరేట్ చేశారా? అని కూడా క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఏది ఏమైనా.. యువీ, భజ్జీ, రైనా చేసిన సెలబ్రేషన్స్ మాత్రం భలే ఉన్నాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ 41, కమ్రాన్ అక్మల్ 24, తన్వీర్ 19 పరుగులు చేసి రాణించారు. భారత బౌలర్లలో అనురీత్ సింగ్ 3 వికెట్లతో సత్తా చాటాడు. నేగి, ఇర్ఫాన్ పఠాన్ తలో వికెట్ తీసుకున్నారు. ఇక ఛేజింగ్‌కు దిగిన ఇండియా ఛాంపియన్స్ టీమ్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి.. ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్‌గా నిలిచింది. అంబటి రాయుడు 50, గుర్‌క్రీత్ సింగ్ 34, యూసుఫ్ పఠాన్ 30 పరుగులు చేసి రాణించారు. మరి ఈ ఫైనల్ విజయం తర్వాత.. యువీ, భజ్జీ, రైనా సెలబ్రేషన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Winning Celebrations from Yuvraj Singh, Harbhajan Singh and Suresh Raina 😅
👉🏻 Are they Mocking Current Pakistani Fast Bowling Unit 🧐 Which gets Injured in every 2 Months 🤐#IndvsPakWCL2024 #INDvsZIM pic.twitter.com/QZ8qXLvIIh
— Richard Kettleborough (@RichKettle07) July 14, 2024