iDreamPost
android-app
ios-app

వీడియో: అభిషేక్ శర్మకు యువరాజ్ బ్యాటింగ్ పాఠాలు.. ఊరికే హిట్టర్లు అయిపోరు!

  • Published Sep 04, 2024 | 6:06 PM Updated Updated Sep 04, 2024 | 6:06 PM

Yuvraj Singh, Abhishek Sharma, Team India: టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ బ్యాటింగ్ గురించి తెలిసిందే. బ్యాట్ పట్టుకొని గ్రౌండ్​లోకి దిగితే బౌలర్ల బెండుతీసేవాడు. శిష్యుడు అభిషేక్ శర్మను కూడా తనలాగే పించ్ హిట్టర్​ను చేశాడు యువీ. అయితే ఇంకా అతడికి క్లాసులు తీసుకుంటున్నాడు.

Yuvraj Singh, Abhishek Sharma, Team India: టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ బ్యాటింగ్ గురించి తెలిసిందే. బ్యాట్ పట్టుకొని గ్రౌండ్​లోకి దిగితే బౌలర్ల బెండుతీసేవాడు. శిష్యుడు అభిషేక్ శర్మను కూడా తనలాగే పించ్ హిట్టర్​ను చేశాడు యువీ. అయితే ఇంకా అతడికి క్లాసులు తీసుకుంటున్నాడు.

  • Published Sep 04, 2024 | 6:06 PMUpdated Sep 04, 2024 | 6:06 PM
వీడియో: అభిషేక్ శర్మకు యువరాజ్ బ్యాటింగ్ పాఠాలు.. ఊరికే హిట్టర్లు అయిపోరు!

టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ బ్యాటింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది. బ్యాట్ పట్టుకొని గ్రౌండ్​లోకి దిగితే బౌలర్ల బెండుతీసేవాడు. భారీ ఫోర్లు, సిక్సులు బాదుతూ అపోజిషన్ టీమ్స్​కు చుక్కలు చూపించేవాడు. ముఖ్యంగా అతడి సిక్సర్లు బాగా ఫేమస్. నీళ్లు తాగినంత ఈజీగా బంతిని స్టేడియంలోకి పంపించేవాడు. అందుకే సిక్సర్ల కింగ్​ అనే బిరుదు సంపాదించాడు. రిటైర్మెంట్ తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్​కు దూరంగా ఉంటున్న యువీ.. ఈ గ్యాప్​లో యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మను తయారు చేశాడు. తనలాగే భీకర షాట్లతో విరుచుకుపడే విధ్వంసకారుడిలా శిష్యుడ్ని రెడీ చేశాడు. అతడికి తాజాగా బ్యాటింగ్ పాఠాలు ఇస్తూ కనిపించాడు యువీ.

బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న అభిషేక్ శర్మ దగ్గరకు వచ్చాడు యువీ. లెగ్ సైడ్ స్వీప్ షాట్ కొట్టడంపై అతడికి ట్రెయినింగ్ ఇచ్చాడు. ఆఫ్ స్పిన్​ను సమర్థంగా ఎదుర్కోవడం ఎలాగో నేర్పించాడు. అయితే అదే పనిగా షాట్స్ కొడుతూ పోయిన అభిషేక్​ను దగ్గరకు పిలిచి సింగిల్స్ కూడా తీస్తూ ఉండాలని సూచించాడు. అయినా మాట వినకుండా భారీ షాట్లు కొట్టడంతో నువ్వు మారవంటూ అసహనం వ్యక్తం చేశాడు. సిక్సులు కొట్టడం తప్ప ఇంకో పని చేయవని సీరియస్ అయ్యాడు. ఇవాళ అభిషేక్ పుట్టిన రోజు కావడంతో యువీ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన లెజెండ్.. ఈ ఏడాది అభిషేక్ సాధ్యమైనన్ని ఎక్కువ సింగిల్స్ తీస్తాడని ఆశిస్తున్నానంటూ జోక్ చేశాడు.

గ్రౌండ్ బయటకు ఎన్ని సిక్సులు కొడతాడో.. అన్ని సింగిల్స్ కూడా తీస్తాడని అనుకుంటున్నానంటూ అభిషేక్​ను ఉద్దేశించి చమత్కరించాడు యువీ. ఇదే రీతిలో కష్టపడాలి.. నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ఆ పోస్ట్​లో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ యువరాజ్ కోచింగ్​ సూపర్బ్​గా ఉందని.. అభిషేక్ హిట్టింగ్ కూడా అదిరిపోయిందని అంటున్నారు. గురువును మించిన శిష్యుడు అయ్యేలా ఉన్నాడని చెబుతున్నారు. ఊరికే హిట్టర్లు అయిపోరు.. ఇంత సాధన చేస్తారు కాబట్టే ఆ రేంజ్​లో ఆడతారని మెచ్చుకుంటున్నారు. ఇక, యువరాజ్ కోచింగ్​లో రాటుదేలిన అభిషేక్ శర్మ తొలుత ఐపీఎల్​లో అదరగొట్టాడు. సన్​రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ సీజన్​లో దుమ్మురేపాడు. 16 మ్యాచుల్లో కలిపి 484 పరుగులు చేశాడు. దీంతో జింబాబ్వేతో టీ20 సిరీస్​లో ఆడే ఛాన్స్ దక్కించుకున్నాడు. డెబ్యూ సిరీస్​లోనే 14, 10, 100 రన్స్​తో మెరిశాడు. సూపర్ సెంచరీతో ఇంటర్నేషనల్ క్రికెట్​లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. అలాంటి అభిషేక్​ బ్యాటింగ్​ను మరింత మెరుగుపర్చుతూ, నెక్స్ట్‌ లెవల్ బ్యాటర్​గా తీర్చిదిద్దుతున్నాడు యువీ.

 

View this post on Instagram

 

A post shared by Yuvraj Singh (@yuvisofficial)