SNP
SNP
యువరాజ్ సింగ్ క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. 2011లో టీమిండియా గెలిచిదంటే అది యువ వల్లే అని చెప్పాలి. ఆ వరల్డ్ కప్ హీరో అతనే. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ. ఇదంతా ఆటపరంగా.. కానీ, యువిని హీరో అనేందుకు మరో బలమైన కారణం ఉంది. ఆ సమయంలో యువీకి భయంకరమైన క్యాన్సర్ ఉన్నా లెక్కచేయకుండా.. ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం ఆడి.. వరల్డ్ కప్ గెలిపించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో టీమిండియా కీ ప్లేయర్‌గా ఉంటూ.. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చి.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. 2011 వరల్డ్ కప్ విజయాన్ని గుర్తుచేసుకున్న ప్రతిసారి.. యువీ ప్రదర్శనను తల్చుకోకుండా ఉండలేరు భారత క్రికెట్ అభిమానులు. అలాంటి గొప్ప క్రికెటర్ తాజాగా వరల్డ్ కప్ 2023 సందర్భంగా టీమిండియాకు ఓ ఎమోషనల్ మేసేజ్ ఇచ్చాడు.
యువీ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఇలా రాసుకోచ్చాడు..‘2011 వరల్డ్ కప్ అద్భుత విజయాన్ని గుర్తుచేసుకున్న ప్రతి సారి ఆ మధుర స్మృతులను అనుభూతి చెందుతుంటాను. మన దేశంలో ఆడుతూ వరల్డ్ కప్ గెలవడం అనేది చిరకాలం గుర్తుండిపోయే క్షణం. మళ్లీ అలాంటి సమయం క్రికెట్‌ను పిచ్చిగా ప్రేమించే దేశానికి వచ్చింది. కోట్ల మంది హృదయాల్లో అదే ప్రేమ, అదే ప్యాషన్, అవే అంచనాలు ఉన్నాయి. వరల్డ్ కప్ గెలిచి మేము ఏ అనుభూతినైతే పొందామో మీరంతా మళ్లీ అది పొందాలను కోరుకుంటున్నాను. వరల్డ్ కప్ సాధించాలంటే.. హార్డ్ వర్క్, డెడికేషన్, టీమ్ వర్క్ అవసరం, ప్రస్తుత జట్టుపై నాకు పూర్తి నమ్మకం ఉంది.
ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. వరల్డ్ కప్ అంటే టైటిల్ గెలవడం కాదు. జీవితం కాలం గుర్తుండిపోయే జ్ఞాపకాలను పొందడం. మనం ఎలాగైతే లెజెండరీ క్రికెటర్ల నుంచి స్ఫూర్తి పొందామో.. మనం కూడా తర్వాత తరాన్ని అలాగే ఇన్స్‌పైర్ చేయాలి. దేశం మొత్తం మీ వెనుక నిలబడి ఉంది. మీరు తీసే ప్రతి పరుగు, ప్రతి వికెట్‌కు మీతో పాటు చీయర్స్ చేస్తాం. మీ వందశాతం ఎఫెక్ట్ వరల్డ్ కప్ తిరిగి తీసుకొరండీ. మీపై మాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు సాధించగలరు. 2023 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా అద్భుత విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మళ్లీ చరిత్ర సృష్టిద్దాం. జై హింద్’ అంటూ పేర్కొన్నాడు. యువీ చేసిన ఈ ఎమోషనల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి యువీ ట్వీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
As I reflect on the incredible journey we had during the 2011 World Cup, I can’t help but feel a rush of nostalgia.
The joy of representing our nation on home soil and bringing the World Cup home was a moment I’ll cherish forever.
Now, it’s déjà vu as the World Cup returns to… pic.twitter.com/w71TJCVRCK
— Yuvraj Singh (@YUVSTRONG12) October 5, 2023
ఇదీ చదవండి: ఫ్రెండ్స్‌తో కలసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న కోహ్లీ.. వీడియో వైరల్!