iDreamPost

ఫ్రెండ్స్​తో కలసి ఫుల్​గా ఎంజాయ్ చేస్తున్న కోహ్లీ.. వీడియో వైరల్!

  • Author singhj Published - 02:02 PM, Thu - 5 October 23
  • Author singhj Published - 02:02 PM, Thu - 5 October 23
ఫ్రెండ్స్​తో కలసి ఫుల్​గా ఎంజాయ్ చేస్తున్న కోహ్లీ.. వీడియో వైరల్!

45 రోజులు, 48 మ్యాచులు, 10 వేదికలు, 10 జట్లు, 150 మంది ప్లేయర్లు.. కానీ ఉన్నది ఒకే ట్రోఫీ. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న వరల్డ్ కప్-2023 ఇవాళ స్టార్ట్ కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్​కు రన్నరప్ న్యూజిలాండ్​కు మధ్య గురువారం జరిగే తొలి మ్యాచ్​తో మెగా టోర్నమెంట్ మొదలుకానుంది. భారత్ పూర్తిస్థాయిలో ఆతిథ్యం ఇస్తున్న ఫస్ట్ వరల్డ్ కప్ ఇదే. 1987లో పాకిస్థాన్​తో, 1996లో పాక్, శ్రీలంకతో, 2011లో బంగ్లాదేశ్, లంకలతో కలసి ఇండియా ప్రపంచ కప్​ను నిర్వహించింది. 2011లో వరల్డ్ కప్​ను ముద్దాడిన మన టీమ్.. సొంతగడ్డపై మరోమారు దాన్ని రిపీట్ చేయాలని అనుకుంటోంది.

ఈసారి టీమిండియా సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే వరల్డ్ కప్​కు రెడీ అయిపోయింది. భారత్ ఆడాల్సిన రెండు వార్మప్ మ్యాచులు వర్షం కారణంగా రద్దయ్యాయి. అక్టోబర్ 8వ తేదీన ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచుతో టీమిండియా వరల్డ్ కప్ వేటను మొదలుపెట్టనుంది. ఇటీవల ఆసీస్​తో జరిగిన వన్డే సిరీస్​ను 2-1తో గెలుచుకోవడంతో ఈ మ్యాచ్​లో కాన్ఫిడెంట్​గా బరిలోకి దిగనుంది భారత్. కంగారూతో మ్యాచ్​లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలకం కానున్నారని అనలిస్టులు అంటున్నారు. వరల్డ్ కప్ భారత్ నెగ్గాలంటే వీళ్లిద్దరూ రాణించడం చాలా కీలకమని చెబుతున్నారు. ఈ టైమ్​లో విరాట్​కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

14 ఏళ్ల కింద శ్రీలంకతో డంబుల్లా వేదికగా జరిగిన వన్డే మ్యాచ్​తో కోహ్లీ ఇంటర్నేషన్ క్రికెట్​లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ టైమ్​లో అతడు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే ఇది జరిగి చాలా రోజులే అవుతోంది. కానీ ఆ ఇంటర్వ్యూ తర్వాత తన ఫ్రెండ్స్​తో కలసి ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు విరాట్. ఇన్నాళ్లూ తమతో కలసి తిరిగిన మిత్రుడు టీమిండియాకు ఆడటం, ఇంటర్వ్యూ ఇచ్చే రేంజ్​కు ఎదగడంతో కోహ్లీ ఫ్రెండ్స్ సంతోషం తట్టుకోలేకపోయారు. దీన్ని నమ్మలేక పోతున్నామని.. విరాట్ పెద్దోడు అయిపోయాడంటూ ఆనందంతో గంతులేశారు. కోహ్లీ కూడా వారితో కలసి చప్పట్లు కొడుతూ, నవ్వుతూ కనిపించాడు. ఈ పాత వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఇదీ చదవండి: ధోని అసలు కెప్టెనే కాదు! రవిచంద్రన్‌ అశ్విన్‌ సంచలన స్టేట్‌మెంట్‌!

 

View this post on Instagram

 

A post shared by Cricket Addictor (@cricaddictor)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి