iDreamPost
android-app
ios-app

Yuvraj Singh: రెండో ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేస్తున్న యువరాజ్‌! టీమిండియాకు నెక్ట్స్‌ కోచ్‌?

  • Published Jan 14, 2024 | 5:13 PM Updated Updated Jan 14, 2024 | 5:13 PM

యువరాజ్‌ సింగ్‌.. భారత క్రికెట్‌ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ దిగ్గజ మాజీ క్రికెటర్‌ రాబోయే కాలానికి టీమిండియాకు కాబోయే కోచ్‌లా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై యువీనే స్వయంగా మాట్లాడాడు. మరి యువీ ఏం అన్నాడో ఇప్పుడు చూద్దాం..

యువరాజ్‌ సింగ్‌.. భారత క్రికెట్‌ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ దిగ్గజ మాజీ క్రికెటర్‌ రాబోయే కాలానికి టీమిండియాకు కాబోయే కోచ్‌లా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై యువీనే స్వయంగా మాట్లాడాడు. మరి యువీ ఏం అన్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 14, 2024 | 5:13 PMUpdated Jan 14, 2024 | 5:13 PM
Yuvraj Singh: రెండో ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేస్తున్న యువరాజ్‌! టీమిండియాకు నెక్ట్స్‌ కోచ్‌?

టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ అంతర్జాతీయ క్రికెటర్‌గా రిటైర్‌ అయిన తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ను అంత సీరియస్‌గా తీసుకోలేదు. వ్యాఖ్యాతగా పలు సందర్భాల్లో కనిపించినా.. దాన్ని ఫ్రొఫెషనల్‌గా చేస్తున్నట్లు లేడు. అందుకే ఆటగాడిగా తొలి ఇన్నింగ్స్‌ను ముగించిన యువీ.. తన రెండో ఇన్నింగ్స్‌పై ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ విషయమై తాజాగా యువీ మాట్లాడుతూ.. తాను మెంటరింగ్‌ చేయడానికి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు.. త్వరలోనే కోచ్‌గా మారుతానని ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక నిఖార్సయిన ఆల్‌రౌండర్‌గా ఉన్న యువరాజ్‌ లాంటి ఆటగాడు కోచ్‌గా మారితే.. అద్బుతాలు సృష్టిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

టీమిండియా తరఫున.. ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన యువీకి బోలెడంత అనుభవం ఉంది. పైగా యువ ఆటగాళ్లకు మంచి సలహాలు, సూచనలు ఇస్తూ.. వారిని మోటివేట్‌ చేసేవాడనే పేరు కూడా యువీకి ఉంది. ఈ విషయాన్ని ఒకసారి ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం వెల్లడించాడు. తనకు 2011 వన్డే వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కక బాధపడుతుంటే.. యువీనే తనతో మాట్లాడాడని, తనను నార్మల్‌ చేశాడని చెప్పుకోచ్చాడు. ఇలా నిరాశలో కూరుకుపోయిన ఆటగాడిని నార్మల్‌ చేయగల యువీ.. ఒక టీమ్‌ను కోచ్‌గా ఇంకెంత అద్భుతంగా నడిపించగలడో అర్థం చేసుకోచ్చు. పైగా యువీకి మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. అండర్‌ 19 వరల్డ్‌ కప్‌, టీ20 వరల్డ్‌ కప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ, వన్డే వరల్డ్‌ కప్‌ ఇలా యువీ గెలవని చూడని బిగ్‌ టోర్నమెంట్‌ లేదు. పైగా బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ మూడు విభాగాలపై పట్టున్న ప్లేయర్‌.

అయితే.. ప్రస్తుతం యువీ ఐపీఎల్‌ టీమ్స్‌కు మెంటర్‌గా ఉండి, తర్వాత భారత అండర్‌ 19 టీమ్‌ కోచ్‌గా పని చేసి.. కాస్త అనుభవం సంపాదించాక.. ప్రస్తుతం టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వారుసుడిగా.. టీమిండియా కోచ్‌గా పనిచేసే సూచనలు కనిపిస్తున్నాయని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి వరకు టీమ్‌లో ఉన్న సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ కొన్ని ఫార్మాట్స్‌కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. వాళ్లిద్దరూ కాకుండా మిగతా జట్టులోని సభ్యులందరికీ యువ చాలా ఫ్రీగా కోచింగ్‌ ఇవ్వగలడు. కోహ్లీ, రోహిత్‌ టెస్టులు, వన్డేలకు పరిమతమై.. టీ20లకు దూరంగా ఉంటే.. యువీ ముందుగా టీ20 జట్టుకు పూర్తి స్థాయి కోచ్‌గా నియమించే అవకాశం ఉంది. ఎలాగో రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం కూడా ఈ టీ20 వరల్డ్‌ కప్‌తో ముగుస్తుంది. ఆయనను మరికొంతకాలం టెస్టు, వన్డే కోచ్‌గా కొనసాగించినా.. యువీని టీ20 కోచ్‌గా నియమిస్తే మంచి ఫలితాలు ఉండొచ్చు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.